
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. టేకులపల్లి గ్రామంలో ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరుకు చెందిన దంపతులు సుభాష్, మంజుల టేకులపల్లి గ్రామంలో కోళ్లఫారం వద్ద పని చేసేవారు. వీరికి ఇద్దరు కూతుళ్ళు మైత్రి(2), మహేశ్వరి(15 నెలలు) ఉన్నారు. అయితే శనివారం రోజు ఉదయం పిల్లలు ఇద్దరు మృతి చెంది ఉండగా.. మంజుల పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మంజులను వైద్యం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారులను తల్లిదండ్రులే చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలతో భోజనంలో విషయం కలిసి చంపి ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment