childrens died
-
UP Bahraich: వేటాడుతున్న తోడేళ్లు.. మరో చిన్నారి మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా వాసులను గత రెండు నెలలుగా తోడేళ్లు చుక్కలు చూపిస్తున్నాయి. దాదాపు 30 గ్రామాల ప్రజలకు వణికించేస్తున్నాయి. రాత్రి సమయాల్లో గ్రామాలపై దాడులు చేసి. ఇళ్లలోని చిన్నారులను ఎత్తుకెళ్లి చంపి తింటున్నాయి. నెలన్నర వ్యవధిలోనే తోడేళ్ల దాడిలో తొమ్మిది మంది చనిపోయారు. మరణించిన వారిలో ఎనిమిది మంది చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. దీంతో బహ్రైచ్‌లోని 35 గ్రామాలకు హై అలర్ట్ ప్రకటించారు.తాజాగా తోడేళ్ల బీభత్సానికి రెండేళ్ల బాలిక బలైంది. మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున జరిగిన తోడేళ్ల తాడిలో అంజలి అనే బాలిక మృతిచెందింది. మరో ముగ్గురు గాయపడగా.. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓవైపు తోడేళ్లను బంధీంచేందుకు అటవీ శాఖ అధికారుల వేట కొనసాగుతుండగానే ఈ దాడులు వెలుగుచూశాయి.గాయపడిన ముగ్గురిలో కమలా దేవి అనే మహిళ మాట్లాడుతూ.. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో బాత్రూమ్కు వెళ్లగా తమపై తోడేలు దాడి చేసినట్లు చెప్పింది. తన మెడ, చెవిని గాయపరిచిందని, వెంటనే కేకలు వేయడంతో అవి పారిపోయినట్లు తెలిపింది.#WATCH | Uttar Pradesh: On the death of a child attacked by a wolf, Monika Rani, DM Bahraich says, "We have caught 4 wolves, 2 are left... Our team is continuously patrolling, we are trying our best to catch them as soon as possible...I request people to sleep indoors...A… pic.twitter.com/Obk5dSqMKt— ANI (@ANI) September 2, 2024 బహ్రైచ్ జిల్లా కలెక్టర్ మోనికా రాణి మాట్లాడుతూ.. తోడేళ్ల డుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి లోపలే నిద్రించాలని సూచించారు. ఇప్పటి వరకు ‘ఆపరేషన్ బేడియా’ కింద నాలుగు తోడేళ్ళను పట్టుకున్నామని మరో రెండింటి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. తమ అధికారుల బృందం నిరంతరం పెట్రోలింగ్ చేస్తోందని, మిగిలిన తోడేళ్ళను వీలైనంత త్వరగా పట్టుకోవడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.ఇదిలా ఉండగా బహ్రైచ్ తోడేళ్ల ఘటనలు పొరుగున ఉన్న బిహార్‌లో భయాందోళన సృష్టిస్తోంది. బిహార్‌లోని మక్సుద్పూర్ కోటలో తోడేళు అనుకొని పలువురు నక్కను అంతమొందించారు. దారుణంగా కొట్టి చంపారు. అయితే దీనిపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు మీడియానే కారణమని ఆరోపిస్తునున్నారు.తోడేళ్ల గురించి అనవసరమైన భయాందోళనలు వ్యాప్తి చేయకుండా నియంత్రించాల్సిన బాధ్యత మీడియాపై ఉందని వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ అనిష్ అంధేరియా పేర్కొన్నారు. బహ్రైచ్‌లో తోడేళ్లు పిల్లలను చంపినట్లు వస్తున్న ఆరోపణలపై విస్తృతమైన కవరేజీ ఇవ్వడం ద్వారా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాలలో ఇలాంటి అనాగరిక చర్యలకు జాతీయ, ప్రాంతీయ మీడియా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. -
అమ్మా.. ఎందుకిలా చేశావ్..!
‘‘అమ్మా.. మా చుట్టూ నీళ్లే.. మమ్మల్ని ఎక్కడ వదిలేసినవ్.. తమ్ముడు గుక్కపట్టి ఏడుస్తున్నడు.. నాకూ ఏడుపొస్తోంది.. నువ్వు దూరంగా మాకు కనిపిస్తున్నా దగ్గరకు తీసుకోవట్లేదు ఎందుకమ్మా... నేను ఏడిస్తే ఆకలేస్తుందా అని అన్నం పెట్టేదానివి.. తమ్ముడు ఏడిస్తే పాలు పట్టేదానివి.. అలాంటిది నువ్వు మమ్మల్ని దూరంగా చూస్తూనే ఉన్నా.. ఏమైంది బిడ్డా అని కూడా అడుగట్లేదు.. నీ గుండె ఎందుకింత కఠినంగా మారిందమ్మా.. అందరూ నువ్వే మమ్మల్ని బావిలో తోసేశావ్ అంటున్నరు.. ఇన్నాళ్లూ ప్రేమను పంచిన నువ్వే ఇలా చేశావా.. మేం ఏం తప్పు చేశాం.. ఎందుకిలా చేశావ్.. నాన్నకు, నీకు మధ్య గొడవతో ఎంత పని చేశావమ్మా.. నీ క్షణికావేశం మన కుటుంబాన్ని ఎలా విడదీసిందో చూశావా.. అమ్మా.. నువ్వు ఏడవకు.. నువ్వు ఏడుస్తుంటే మాకు ఇంకా ఏడుపొస్తుంది..’’ అంటూ ఆ పసి హృదయాల ఆత్మఘోషించే ఉంటుంది.! ఇద్దరు పిల్లలను బావిలో తోసి తల్లీ ఆత్మహత్యకు యత్నించగా.. పిల్లలిద్దరూ మృత్యువాతపడిన హృదయవిదారక ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని బాలాపూర్‌లో చోటు చేసుకుంది. సాక్షి, ఆదిలాబాద్: కాపురంలో కలహాలు సహజం.. అయితే అవి చినికి చినికి గాలివానలా మారి అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను బలిగొన్న ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం బాలాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థాని కుల కథనం ప్రకారం.. బేల మండలం సాంగిడి గ్రామానికి చెందిన సుష్మతో జైనథ్ మండలం బాలాపూర్ గ్రామానికి చెందిన వాన్‌ఖెడే గణేశ్‌కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఆదిత్య(4), ఆర్యన్(18నెలలు) సంతానం. భార్యాభర్తలిద్దరూ కూలీనాలి చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. సాఫీగా సాగిపోతున్న వారి జీవితంలో చిన్న చిన్న కలహాలు పెను తుపాను రేపాయి. ఈ క్రమంలో కలహాలతో విసిగిపోయిన సుష్మ చనిపోవాలని నిర్ణయించుకుంది. బుధవారం భర్త కూలీ పనికి వెళ్లిన సమయంలో గ్రామానికి కొంచెం దూరంలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు పిల్లలతో కలిసి వెళ్లింది. పిల్లలిద్దరినీ ముందుగా అందులో తోసేసి అనంతరం తానూ దూకింది. అయితే నీటిలో మునిగే సమయంలో భయభ్రాంతులకు గురై కేకలు వేయడంతో పక్కనే చేలో ఉన్న రైతు తాడు సాయంతో బావిలో దూకాడు. ముగ్గురిని బయటకు తీయగా సుష్మ ప్రాణాపాయం నుంచి బయటపడగా.. చిన్నారులు కొన ఊపిరితో ఉన్నారు. వారిని వెంటనే గ్రామానికి తీసుకెళ్లే క్రమంలో చనిపోయారు. మిన్నంటిన రోదనలు.. పాల బుగ్గల చిన్నారులు విగతజీవులుగా పడి ఉండటంతో కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామస్తులు భారీగా తరలివచ్చి కడసారి చూపుకోసం గుమిగూడారు. తల్లే క్షణికా వేశంలో బిడ్డలను పొట్టన పెట్టుకుందని భర్త తరఫువారు ఆరోపించగా.. భర్త వేధింపులతోనే జీవితంపై విరక్తి చెంది ఇద్దరు పిల్లలతో సుష్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఆమె తల్లిదండ్రులు వాపోయారు. ఏదేమైనా భార్యాభర్తల మధ్య కలహాలు రెండు పసిప్రాణాలను బలి గొనడంతో ఆ గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. భార్యాభర్తలపై కేసు .. చిన్నారులు మృతిచెందిన ఈ సంఘటనలో భార్యాభర్తలిద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే చిన్న చిన్న గొడవలతో సుష్మ అనవసరంగా పిల్లలతో కలిసి బావిలో దూకి వారి ప్రాణాలు తీసిందని, చి న్నారుల నానమ్మ నీలాబాయి ఇచ్చిన ఫిర్యా దు మేరకు పోలీసులు సుష్మపై కేసు నమోదు చేశారు. దీంతోపాటు తన అల్లుడు వాన్‌ఖెడే గణేష్ వేధింపులతోనే కూతురు సుష్మ ఆత్మహత్యాయత్నం చేసింద ని, చిన్నారుల అమ్మమ్మ జిజాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాన్‌ఖెడే గణేశ్‌పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై పెర్సిస్ బిట్ల తెలిపారు. -
చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి
-
భార్యాభర్తల మధ్య వివాదం.... చిన్నారుల ఉసురు తీసిన ఆర్థిక ఇబ్బందులు
ఆర్థిక సమస్యల వల్ల భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవలతో అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. క్షణికావేశంలో తల్లి తీసుకున్న నిర్ణయంతో అర్ధంతరంగా లోకం విడిచి వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం తల్లిని బాధించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులే తనను ఈ ఘటనకు ప్రేరేపించాయని ఆమె పోలీసుల ఎదుట గొల్లుమంది. సాక్షి, రోలుగుంట: మండలంలోని జె.నాయుడుపాలెం గ్రామానికి చెందిన గడదాసు నాగరాజుకు ఆరేళ్ల క్రితం వడ్డిప గ్రామానికి చెందిన సాయితో వివాహం జరిగింది. వీరికి కుమార్తె భాను(4), కుమారుడు పృథ్వీరాజ్(2) ఉన్నారు. నాగరాజు ఆటో నడపడం ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బేరాలు తగ్గడంతో వీరికి ఏడాది కాలంగా ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. కుటుంబ పోషణ భారంగా మారడంతో భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించే విషయంలో ఆదివారం రాత్రి వీరిద్దరి మధ్య తలెత్తిన గొడవ.. ఘర్షణకు దారితీయడంతో సాయి మనస్తాపం చెందింది. వెంటనే ఇద్దరు పిల్లలను తీసుకువెళ్లి యాదవుల వీధిలోని బావిలో తోసేసి.. తాను కూడా దూకేసింది. చివరి క్షణంలో ఆమె బావిలోని మెట్టును పట్టుకుని వేలాడుతూ కేకలు వేయడంతో.. చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకొని ఆమెను, పిల్లలను బయటకు తీశారు. కానీ అప్పటికే ఇద్దరు చిన్నారులూ మృతి చెందారు. సాయి ప్రాణాలతో బయటపడింది. ఈ సమాచారం తెలుసుకున్న ఎస్ఐ నాగకార్తీక్ ఘటనాస్థలికి చేరుకొని.. తల్లి సాయితో పాటు స్థానికులను విచారించారు. తన భార్య తోసేయడం వల్లే పిల్లలు చనిపోయారని నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ తల్లిని బాధించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులే తనను ఈ ఘటనకు ప్రేరేపించాయని ఆమె పోలీసుల ఎదుట గొల్లుమంది. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
తీవ్ర విషాదం: వంటింట్లో గ్యాస్ లీక్.. భర్తను పిలుచుకుని వచ్చేలోపే...
పట్నా: ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి అయిదుగురు చిన్నారులు మృత్యువాత పడిన విషాద ఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బంకా జిల్లా రాజావర్ గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో చనిపోయిన పిల్లలందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. మృతుల్లో ఓ బాలుడు, నలుగురు బాలికలు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్ పాశ్వాన్‌కు చెందిన ఇంట్లో సాయంత్రం చిన్నారులంతా ఆడుకుంటున్నారు. అదే సమయంలో అతని భార్య సునీత వంటగదిలోకి వెళ్లి స్టవ్ వెలిగించడంతో గ్యాస్ పైపులో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చూసి భయపడిన సునీత వెంటనే భర్తను పిలవడానికి బయటికి పరుగులు తీసింది. ఇంతలోనే సిలిండర్ పేలడంతో ఇంట్లోనే కూర్చున్న అయిదుగురు చిన్నారులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. గంటలోనే ఇల్లంతా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో అశోక్ పాశ్వాన్ నలుగురు పిల్లలు, సోదరుడు ప్రకాష్ కూతురు మరణించారు. ఈ ప్రమాదంలో కుటుంబానికి చెందిన మరో ఇద్దరికి కూడా గాయాలవ్వగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. చదవండి: లుథియానా కోర్టు పేలుడు కేసు... జర్మనీలో సూత్రధారి పట్టివేత ప్రమాదం జరిగిన సమయంలో ప్రకాష్‌కు చెందిన కుమారుడు, కుమార్తె ఇంటి బయట ఉండడంతో వారిద్దరి ప్రాణాలు దక్కాయి. అన్నదమ్ములిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఉజ్వల పథకం కింద అతని ఇంటికి గ్యాస్ స్టవ్ వచ్చింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు బాధిత కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నారు. సంఘటనకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు స్థానిక అధికారి మొయినుద్దీన్ తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: యోగి, ఆర్ఎస్ఎస్ పేరు చెప్పమని ఏటీఎస్ బెదిరించింది -
వికారాబాద్ జిల్లాలో అమానుషం.. ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద మృతి
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. టేకులపల్లి గ్రామంలో ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరుకు చెందిన దంపతులు సుభాష్, మంజుల టేకులపల్లి గ్రామంలో కోళ్లఫారం వద్ద పని చేసేవారు. వీరికి ఇద్దరు కూతుళ్ళు మైత్రి(2), మహేశ్వరి(15 నెలలు) ఉన్నారు. అయితే శనివారం రోజు ఉదయం పిల్లలు ఇద్దరు మృతి చెంది ఉండగా.. మంజుల పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మంజులను వైద్యం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారులను తల్లిదండ్రులే చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలతో భోజనంలో విషయం కలిసి చంపి ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. -
యూపీ: వైరల్ ఫీవర్‌తో 50 మంది చిన్నారుల మృతి!
లక్నో: దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా.. ఉత్తర ప్రదేశ్‌లో వైరల్ జ్వరం ప్రజలను బెంబేలేత్తిస్తుంది. వైరల్ జ్వరంతో ఫిరోజాబాద్‌లో ఇప్పటి వరకు 50 మంది చిన్నారులు మృతి చెందినట్టు హెల్త్ డిపార్ట్మెంట్ ధృవీకరించింది. కాగా, ఈ ఘటనను సీఎం యోగి తీవ్రంగా పరిగణించారు. ఆసుపత్రులలో సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించిన కారణంగా ఫిరోజాబాద్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో)ను విధుల నుంచి తొలగించారు. సీఎం యోగి ఆదేశాలతో, అప్రమత్తమైన అధికారులు ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్ల సంఖ్యను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, ప్లేట్లేట్ల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత సోమవారం (ఆగస్టు 30)న సీఎం యోగి ఫిరోజాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు ప్రతి ఇంటికి వెళ్లి వైరల్ జ్వరం పట్ల అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎవరైన జ్వరంతో బాధపడుతుంటే వారికి వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని తెలిపారు. గ్రామాలలో, పట్టణాలలో పారిశుద్ధ్య అధికారులు స్థానికంగా పరిశుభ్రతను పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదేశించారు. ఈ వైరస్ జ్వరాన్ని డెంగీగా వైద్యఅధికారులు భావిస్తున్నప్పటికీ దీనిపై స్పష్టత లేదు. చదవండి: Suspicious Fever: వణికిస్తున్న వింత జ్వరం.. 32 మంది చిన్నారులు మృతి -
ఆడుకునే వయస్సులో అనంత లోకాలకు..
సాక్షి, హన్వాడ (మహబూబ్‌నగర్): ఆడుతూ.. పాడుతూ పాఠశాలకు వెళ్లి వచ్చే ఆ చిన్నారులు దసరా సెలవులు ఉండటంతో సరదాగా తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లారు.. అయితే పొలంలో నీటి నిల్వ కోసం తోడిన గుంతలో ఈతకు వెళ్లి ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన మండలంలోని మాదారంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే... గ్రామానికి చెందిన కొల్లి సాయన్న, అంజమ్మ దంపతుల కూతుళ్లు రజిత(11), మోక్షిత(4)లు. వీరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రజిత ఐదో తరగతి, మోక్షిత ఒకటో తరగతి చదువుతున్నారు. దసరా సెలవులు పొడిగింపు కారణంగా పాఠశాలకు వెళ్లాల్సిన ఆ చిన్నారులు మంగళవారం తల్లిదండ్రుల వెంట గ్రామ సమీపంలోని పొలానికి వెళ్లారు. ఈ క్రమంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి తమ పొలంలోనే ఉన్న నీటి నిల్వ గుంతలో జారిపడి మృత్యువాత పడ్డారు. పక్కనే పొలం పనుల్లో నిమగ్నమైన తల్లిదండ్రులు గుర్తించి వెంటనే నీటి గుంతలోకి దిగి బాలికలను బయటికి తీయగా అప్పటికే ఆ చిన్నారులు విగతజీవులయ్యారు. దీంతో బాధిత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ రోదించారు. చిన్నారుల మృత్యువాతతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొల్లి సాయన్న, అంజమ్మ దంపతులకు ముగ్గురు ఆడ సంతానంలో ఇద్దరు బాలికలు మృత్యువాత పడగా మరో అమ్మాయి ఉంది. విషయం తెలుసుకున్న మండల రెవెన్యూ అధికారులు, పోలీసులు శవ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. -
‘కన్నీటి’కుంట...
సాక్షి, జమ్మలమడుగు :నీటిని చూడగానే దిగి ఈతకొట్టాలనిపించింది. కానీ ఆ ఇద్దరు చిన్నారులకు కుంట లోతు తెలియదు..దీంతో వారు కుంటలో దిగిన కాసేపటికే ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఉదయం జమ్మలమడుగు మండలం గూడెంచెరువులో ఈ సంఘటన విషాదఛాయలు మిగిల్చింది. గూడెంచెరువు గ్రామానికి చెందిన లింగారెడ్డి..శివకల్యాణ్ వ్యవసాయ కూలీలు. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు. లింగారెడ్డికి సంజయ్ (9) ఒక్కడే సంతానం. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. శివకల్యాణ్‌కు ఇద్దరు పిల్లలు. పాప బాబు. బాబు లోకేష్(9) కూడా అదే స్కూలులో మూడో తరగతి చదువుతున్నాడు. సంజయ్, లోకేష్‌లు ఇద్దరూ మంచి మిత్రులు. వీరు సోమవారం మొహరం సెలవు వల్ల పాఠశాలకు వెళ్లలేదు. మరో ఇద్దరితో కలిసి కొండ ప్రాంతంలో కలిపండ్లు కోసుకుని వద్దామని గండికోట రహదారిలోకి వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షాలతో నీరు చేరిన ఓ కుంట దారిలో కనిపించింది. దీంతో ఇందులో దిగి ఈత కొడదామని సంజయ్, లోకేష్‌లు ఉత్సాహపడ్డారు. ఇంకేమీ ఆ లోచించకుండా వెంటనే నీటిలో దూకారు. ఈ ఇ ద్దరు పిల్లలకు ఈత సరిగా రాదు. 20 అడుగుల లో తుగా ఉన్న కుంటలో చిన్నారులు ఇరుక్కుపోయా రు. ఈతకు దిగని ఇద్దరు మిత్రులు వీరిని చూసి ఆందోళన చెందారు. బయటకు రాలేకపోతున్నారని గ్రహించారు. దీంతో వెంటనే భయపడుతూ ఊళ్లోకి వచ్చి గ్రామస్తులకు విషయం చెప్పారు. గ్రామస్తులు పరుగున వచ్చి కుంటకు చేరుకునేలోగానే లోకేష్..సంజయ్‌లు విగతజీవులయ్యారు. దీంతో స్థానికులు నిశ్చేష్టులయ్యారు. అసువులు బాసిన చిన్నారుల మృతదేహాలను చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. లోకేష్ తల్లి రెండేళ్ల క్రితం చనిపోయింది. ఈ బాలుడి మృతదేహం వద్ద తండ్రి కుప్పకూలి రోదించాడు. చిన్నారుల మృతికి గ్రామస్తులంతా కంటతడి పెట్టారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ ఎన్.నాగరాజు, అర్బన్‌సీఐ కత్తి శ్రీనివాసులు కుంటవద్దకు చేరుకున్నారు. ఫైర్ అధికారులు,స్థానికులతో కలిసి కుంట నుంచి చిన్నారుల మృతదేహాలను బయటికి తీయించారు. పోస్టు మార్టం కోసం జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
అయ్యో.. పాపం!
సాక్షి, శంఖవరం(తూర్పుగోదావరి) : అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను ఆ ఊరు చెరువు పొట్టన పెట్టుకుంది. ఈ సంఘటనతో సమీప బంధువులైన రెండు కుటుంబాల్లో విషాదం అలముకుంది. తమ బంధువుతో చెరువులో మోటారు బైక్ కడిగేందుకు వెళ్లిన ఈ ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడగా, మరో చిన్నారి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడింది. నిత్యం తమ ఇళ్లలో చలాకీగా తిరిగే ఈ ఇద్దరు చిన్నారులు తిరిగి రాని లోకానికి వెళ్లిపోవడంతో ఆ బంధువుల్లో విషాదం నెలకొంది. శంఖవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బోడపాటి వీరాస్వామి, చిలకమ్మ దంపతులకు కుమారు వీరప్రకాశ్(12), కుమార్తె కృపాజ్యోతి(10) ఉన్నారు. కుమారుడు ఆరోతరగతి చదువుతున్నాడు. బంధువైన బోడపాటి వీరాస్వామి అన్నయ్య అల్లుడైన విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం గోపాలపట్నం గ్రామానికి చెందిన గాలింక అప్పారావుకు భార్య నాగరత్నం, నాగేశ్వరరావు(10), ప్రదీప్(8) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు రెండు నెలల క్రితం వ్యవసాయ పనుల కోసం ఇక్కడి వచ్చి నివాసం ఉంటున్నారు. వీరి సమీప బంధువైన గొల్లప్రోలు మండలం తాడిపత్రి గ్రామానికి చెందిన కొల్లు వీరబాబు(23) వీరాస్వామి కుటుంబాన్ని చూసేందుకు శంఖవరం వచ్చాడు. శంఖవరానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండపం గ్రామం ఊర చెరువులో మోటారు బైక్‌ను కడిగేందుకు వీరాస్వామి కుమారుడు వీరప్రకాశ్, అప్పారావు కుమారుడైన నాగేశ్వరరావు, సమీప బంధువైన బోడపాటి శ్రీను(11)లను చెరువు వద్దకు తీసుకువెళ్లాడు. చెరువు వద్ద వీరబాబు బహిర్భూమికి వెళ్లగా బైక్ కడిగేందుకు ముగ్గురూ చెరువులోకి దిగారు. చెరువు లోతును గమనించకపోవడంతో ప్రమాదవశాత్తూ వీరప్రకాశ్, నాగేశ్వరరావు చెరువులో మునిగిపోయారు. అక్కడే ఉన్న శ్రీను గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న వీరబాబుతో పాటు పలువురు వారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం దగ్గలేదు. అప్పటికే చెరువులో మునిగిపోవడంతో మృత్యువాత పడ్డారు. దారిన వెళుతున్న మత్స్యకారులు విషయం తెలుసుకున్న బంధువులు అక్కడికి చేరుకుని రోదించారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడంటూ వీరాస్వామి బోరున విలపించాడు. ఇంటికి పెద్ద కొడుకు మృత్యువాత పడడంతో అప్పారావు బోరున విలపించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. -
మరణంలోనూ వీడని అన్నదమ్ముల బంధం
సాక్షి, శెట్టూరు: బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు చిన్నారులను చెరువు మింగేసింది. నీటమునుగుతున్న తమ్ముడిని రక్షించేందుకు ప్రయత్నించి అన్న కూడా జల సమాధి అయ్యాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారులిద్దరూ మృత్యువాతపడటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటన శెట్టూరు మండలం కరిడిపల్లిలో శుక్రవారం సాయంత్రం జరిగింది. గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. శెట్టూరు మండలం కరిడిపల్లికి చెందిన గోవిందయ్య, మహంతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు బన్నీ (10)ఐదో తరగతి, చిన్న కుమారుడు బాలు (7) రెండో తరగతి చదువుతున్నారు. శుక్రవారం కృష్ణాష్టమి సెలవు కావడంతో ఇంటివద్దే ఉన్నారు. సాయంత్రం గ్రామానికి చెందిన హర్షవర్ధన్ అనే మరో బాలుడితో కలిసి అన్నదమ్ములిద్దరూ బహిర్భూమికని గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. బాలు, బన్నీ పోటీపడుతూ నీళ్లున్న గుంత వద్దకు పరుగులు తీశారు. బాలు కాలు జారి గుంతలోకి పడిపోయాడు. తమ్ముడిని కాపాడేందుకని బన్నీ చేయందించాడు. అయితే గుంత లోతుగా ఉండటంతో బాలు మునిగిపోయాడు. అదే క్రమంలో తమ్ముని చేయి పట్టుకున్న బన్నీ కూడా అందులోకి పడిపోయాడు. ఇద్దరూ మునిగిపోతుండటం గట్టున ఉన్న హర్షవర్ధన్ గమనించి పరుగున ఊరిలోకి వెళ్లి బాలు, బన్నీల పిన్నమ్మ ఈశ్వరమ్మకు జరిగిన విషయం చెప్పాడు. వెంటనే ఆమె స్థానికులను పిలిచుకుని చెరువు వద్దకు పరుగులు పెట్టింది. పదిమందికి పైగా గ్రామస్తులు చెరువులోకి దిగి ఇద్దరు చిన్నారులను బయటికి తీసుకొచ్చారు. అయితే అప్పటికీ బన్నీ, బాలు ప్రాణాలు విడిచారు. సంఘటన స్థలాన్ని ఏఎస్ఐ నాగరాజు, ఎంఈఓ శ్రీధర్, వీఆర్వో గంగాధర్‌లు పరిశీలించి, కేసు నమోదు చేశారు. దేవుడా.. ఎంత పనిచేశావయ్యా..! గోవిందయ్య శుక్రవారం గ్రామ సమీపంలోని గొర్రెల మేపుకోసం వెళ్లాడు. భార్య మహంతమ్మ ఓ రైతు పొలంలో టమాట పంటను తొలగించడానికి కూలి పనులకు వెళ్లింది. పొలం పని ముగించుకుని వచ్చాక పిల్లల్ని ఇంటి వద్దే ఉంచి ఆమె గొర్రెల మేపు కోసం వెళ్లిన భర్త వద్దకు వెళ్లింది. సాయంత్రం వేళ ఇద్దరు కుమారులు చెరువులో పడ్డారని వార్త వినగానే తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తూ పరుగులు పెడుతూ చెరువు వద్దకు వచ్చారు. చెరువు గట్టుపై విగత జీవులుగా పడి ఉన్న కుమారులను చూసి రోదించడం అందరినీ కలచివేసింది. ‘ఇంటివద్దే ఆట్లాడుకుంటుంటారనుకునిపోతినే...అంతలోపే ఇలా...దేవుడు ఇంత అన్యాయం చేశాడా...ఒకేసారి ఇద్దరినీ పొట్టన పెట్టుకుంటాడా...అయ్యో..మేము ఏం పాపం చేశాము దేవుడా...’ అంటూ మహంతమ్మ కన్నీటి పర్యంతమైంది. బాధిత కుటుంబానికి పరామర్శ చిన్నారులు మృత్యువాత పడిన సంఘటన తెలుసుకున్న శెట్టూరు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సోమనాథ్‌రెడ్డి, నాయకులు హరినాథ్‌రెడ్డి, ఎంఎస్‌రాయుడు, తిప్పేస్వామి, రామకృష్ణ, తిమ్మరాజు, లింగప్ప, శ్యాంసుందర్‌చౌదరి, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరిలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. -
ఘోర ప్రమాదం.. ఏడుగురు చిన్నారుల మృతి
గాంధీ నగర్ : గుజరాత్లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 10 మందితో వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పక్కనున్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన గుజరాత్‌లోని పంచమహల్‌లో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వాహనం నుంచి ముగ్గురిని రక్షించారు. తీవ్రంగా గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతి చెందిన పిల్లలంతా ఏడు నుంచి పదహారేళ్ల మధ్య వయసువారే. -
కడుపుకోత మిగిల్చిన ఈత సరదా
కేసముద్రం వరంగల్: ఈత సరదా ఓ తల్లికి కడుపుకోతను మిగిల్చింది. బడి నుంచి ఇంటికి వచ్చిన కొడుకు తోటి మిత్రులతో కలిసి చెరువు వద్దకు వెళ్లి నీటిమునిగి మృత్యుఒడిలోకి చేరిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోమటిపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోలెపాక సుమలత, కృష్ణ దంపతులకు ముగ్గురు కుమారులున్నారు. చిన్నకుమారు రోహిత్(9) స్థానిక ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుకుంటున్నాడు. ఈ మేరకు ఎప్పటిలాగే శుక్రవారం పాఠశాలకు వెళ్లి, తిరిగి సాయంత్రం బడి వదిలిపెట్టడంతో ఇంటికి వచ్చి పుస్తకాల బ్యాగ్ ఇంటి వద్ద పెట్టి, బయటకు వచ్చాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ.. ఊరి చివరన ఉన్న చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక రోహిత్ చెరువులోకి దిగాడు. చెరువు అంచున వేసవికాలంలో చేపల కోసం తీసిన పెద్ద గుంతలో రోహిత్ మునిగిపోయాడు. బయట ఉన్న స్నేహితులు భయంతో ఇంటికి పరుగుతీశారు. సాయంత్రం వరకూ రోహిత్ ఇంటికి చేరకపోవడంతో తల్లి చుట్టుప్రక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. గ్రామస్తులు తోటి స్నేహితులను అడుగగా జరిగిన విషయం వెలిపారు. రాత్రి సమయంలో చెరువులోకి కొందరు వ్యక్తులు దిగి గాలించగా మృతదేహం లభ్యమైంది. కొడుకు శవాన్ని చూసిన తల్లి ఒక్కసారిగా కుప్పకూలింది. శనివారం తల్లి సుమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా రోహిత్ మృతి చెందడంతో పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు కన్నీళ్లు పెట్టుకున్నారు. నాడు భర్త.. నేడు కుమారుడు.. కూలీనాలి పనిచేసుకుంటూ జీవనం సాగించే కృష్ణ పాఠశాల ఎస్ఎంసీ వైస్ చైర్మన్‌గా పనిచేశాడు. ఈక్రమంలో గత ఏడాది క్రితం కృష్ణ మృతిచెందడంతో, కుటుంబ భారమంతా భార్య సుమలతపై పడింది. కాగా ఎస్ఎంసీ కమిటీ వైస్‌చైర్మన్‌గా సుమలతను ఎంపిక చేశారు. ఒకవైపు కూలీ పనిచేస్తూ ముగ్గురు పిల్లలను సాకుతూ వస్తుంది. బడిలో చదువుతున్న రోహిత్‌తో ఉపాధ్యాయులు స్నేహభావంతో మెదిలేవారు. రోహిత్ క్రీడల్లో, చదువులో రాణిస్తుండటంతో అతడికి మంచి ప్రోత్సాహన్ని ఇచ్చేవారు. అలాంటి విద్యార్థి మృతిచెందడంతో, తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులకు బాధను మిగిల్చింది. ఇంటిపెద్ద దిక్కును కోల్పోయిన బాధను మరువకముందే కుమారుడు మృతి చెందడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. -
కన్ను మూస్తున్నా..కళ్లు తెరవరేం..
రంపచోడవరం: ఏజెన్సీలో పసిపిల్లలు పిట్టల్లా రాలిపోతున్నా రంపచోడవరం ఐటీడీఏ మొద్దు నిద్ర వదలడం లేదు. ప్రతిరోజూ వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. శుక్రవారం సైతం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి వచ్చిన మారేడుమిల్లి మండలం శ్రీపురానికి చెందిన తొమ్మిది నెలల మడకం వెంకన్నదొర విగతజీవిగా మారాడు. ప్రాణాలు పోయిన పసివాడి తల్లిదండ్రులు కన్నీటితో తల్లడిల్లినా ఐటీడీఏ అధికారులు కనీసం కన్నెత్తి చూడలేదు. మూడు రోజులు నుంచి అనారోగ్యంతో.. మారేడుమిల్లి మండలం శ్రీపురం గ్రామానికి చెందిన మడకం పండుదొర, రాజమణిల తొమ్మిది నెలల కుమారుడు వెంకన్నదొర మూడు రోజుల నుంచి జ్వరంతో బాధ పడుతున్నాడు. స్థానిక వాడపల్లిలో జరిగే సంతలో ఆర్ఎంపీ వైద్యం చేయించారు. ఫలితం లేకపోవడంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చిన తరువాత వైద్య సేవలు అందేలోపే మృతి చెందాడు. దీంతో తండ్రి బాలుడు మృతదేహాన్ని భుజంపై వేసుకుని తమ ఊరుకు వెళ్లే ఆటో స్టాండ్‌కు చేరుకున్నాడు. అయితే ఇక్కడ గ్రామస్థాయిలో ప్రభుత్వ వైద్య సేవలు సక్రమంగా లేకపోవడంతో గిరిజనులకు కష్టాలు తప్పడం లేదు. పిల్లల ఆరోగ్యంపై కానరాని శ్రద్ధ గత ఏడాది రాజవొమ్మంగి, గంగవరం మండలాల్లో గిరిజన చిన్నారులు అనేక మంది మృత్యువాత పడినా ఐటీడీఏ నేటికీ సరైన కార్యచరణ ప్రణాళిక రూపొందిచలేదు. పౌష్టికాహారం అందించి చిన్నారుల ఆరోగ్యం మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోలేదు. గిరిజన చిన్నారులుకు పౌష్టికాహారమే ప్రధాన శుత్రువుగా మారింది. -
తెల్లారిన బతుకులు
సాక్షి, యాదాద్రి/జగదేవ్‌పూర్: విషం కలుపుకుని తిన్నారా? పురుగుల మందు తాగారా? ఫుడ్ పాయిజన్ అయిందా? లేదా కోళ్ల కోసం ఉంచిన కెమికల్ బియ్యమే ప్రాణాలు తీసిందా? అసలు వారివి ఆత్మహత్యలా? హత్యలా? కారణాలేవైతేనేం.. తెల్లారేసరికి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి నిండు జీవితాలు తెల్లారిపోయాయి! రాత్రి భోజనం చేసి పడుకున్న వారంతా తెల్లారేసరికల్లా విగతజీవులుగా కనిపించారు. చనిపోయినవారిలో భార్యాభర్త, వారి ముగ్గురు పిల్లలు, అత్తామామ ఉన్నారు. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. అసలేం జరిగింది? సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం మునిగడపకు చెందిన దుబ్బాసి బాలరాజు(44), నిర్మల(40) దంపతులకు ముగ్గురు సంతానం. కుమార్తె శ్రావణి(14), చింటు(12), బన్ని(8). బాలరాజు అత్తమామ జనగామ జిల్లా చిలుపూరు మండలం లింగంపల్లికి చెందిన బచ్చలి బాల నర్సయ్య(68), బచ్చలి భారతమ్మ(60). రాజాపేటకు చెందిన బెజగం నాగభూషణం కోళ్ల ఫారంలో నెల కిందట బాలరాజు, నిర్మల పనిలో చేరారు. ఒక్కొక్కరికి నెలకు రూ.4 వేల చొప్పున వేతనం మాట్లాడుకున్నారు. యజమాని వారికి కోళ్లఫారం సమీపంలోనే వసతి కల్పించారు. బాలరాజు మామ బాల నర్సయ్య సమీపంలోని పాముకుంట శివారులో సతీశ్‌కు చెందిన దాబా హోటల్లో పనిచేస్తూ రాత్రి సమయంలో ఇక్కడికే వచ్చి పడుకుంటాడు. కొంతకాలంగా బాలరాజు, నిర్మల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతోపాటు బాలరాజు ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య గొడవలు పెరిగినట్లు తెలుస్తోంది. గొడవల నేపథ్యంలోనే నిర్మల తల్లిదండ్రులైన భారతమ్మ, బాలనర్సయ్య ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. గురువారం బాలరాజు, నిర్మల, బాలనర్సయ్య రాజాపేటకు వెళ్లి అక్కడ కల్లు డిపోలో కల్లు సేవించారు. ఇంటికి వస్తూ మధ్యలో చికెన్ తీసుకున్నారు. రాత్రి చికెన్ వండుకొని తిని అందరూ నిద్రపోయారు. కోళ్లఫారం యజమాని నాగభూషణం రాత్రి 9.30 గంటల సమయంలో వచ్చి వీరిని లేపే ప్రయత్నం చేశారు. ఎంతకీ లేవకపోవడంతో వెళ్లిపోయాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మళ్లీ వచ్చి లేపే యత్నం చేశాడు. ఎలాంటి స్పందన లేకపోవడంతో వీరిని పనిలో పెట్టించిన దాబా హోటల్ యజమాని సతీశ్ వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. తర్వాత వారిద్దరు వచ్చి చూశారు. తట్టి లేపే ప్రయత్నం చేసినా స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు మిస్టరీగా కేసు ఏడుగురు మృతి పోలీసులకు మిస్టరీగా మారింది. పురుగుల మందు తాగారా లేక తినే భోజనంలో కలుపుకుని తిన్నారా లేదా ఫుడ్ పాయిజన్ అయిందా అన్న కోణంలో విచారణ ప్రారంభించారు. సంఘటన స్థలాన్ని రాచకొండ జాయింట్ సీపీ తరుణ్ జోషి, భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌టీం, డాగ్స్క్వాడ్తోపాటు పోస్టుమార్టం నివేదిక తర్వాత కారణమేమిటన్న విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. మృతదేహాలకు భువనగిరిలో పోస్టుమార్టం నిర్వహించి.. శుక్రవారం రాత్రి మునిగడపలో అంత్యక్రియలు నిర్వహించారు. ఒకే గదిలో నిర్జీవంగా పడివున్న బాలరాజు కుటుంబ సభ్యులు కెమికల్ కలిపిన బియ్యం తిన్నారా? ఫారాల్లో కోళ్ల దాణాగా బియ్యం, నూకలు నిల్వ చేస్తారు. అవి ముక్కిపోకుండా, చోరీకి గురికాకుండా ఉండడానికి ఒక రకమైన కెమికల్ కలిపి నిల్వ చేస్తారు. ఫారంలోనే పనిచేస్తున్న బాలరాజు.. అవి కెమికల్ కలిపిన బియ్యం అని తెలియకుండా వాటిని తెచ్చి వండుకుని తినడంతో ఘోరం జరిగి ఉండవచ్చని కూడా పలువురు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కారణం ఏమై ఉంటుంది? ఒకే కుటుంబానికి చెందిన ఈ ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారా, తినే ఆహారంలో ఏవైనా విష పదార్థాలు కలిశాయా, లేదా వీరే క్రిమిసంహారక మందులు కలుపుకున్నారా, ఎవరైనా హత్య చేశారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాలరాజు అనారోగ్యానికి గురి కావడంతో భార్యాభర్త మధ్య గొడవలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులతోపాటు కుటుంబ పోషణ కోసం వీరు పలుచోట్లకు మారారు. భార్య నిర్మల ప్రవర్తనపై అనుమానం పెంచుకొని బాలరాజే చికెన్‌లో విషం కలిపి అందరినీ హతమార్చి ఉండొచ్చన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. వీరు స్థానికంగా కల్లు తాగడంతోపాటు కొంత ఇంటికి కూడా తెచ్చుకున్నారు. మృతదేహాల మధ్య ఓ మద్యం బాటిల్‌తోపాటు మూడు క్రిమిసంహారక మందు డబ్బాలు కూడా పడి ఉన్నాయి. దీంతో వారి మరణానికి పురుగుల మందే కారణం అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి..
-
బంధువే రాబంధువు
♦ చిన్నారులను హతమార్చిన యువకుడు ♦ గోదారి చూపిస్తానని.. కాలువలో తోశాడు ♦ నిందితుడి ఇంటిని ధ్వంసం చేసిన గ్రామస్తులు కొయ్యలగూడెం: పశ్చిమగోదావరి జిల్లా దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన కైకవరపు చిన్నారావు, మంగ దంపతులకు ప్రశాంత్ (10), విక్కీ(5)లు సంతానం. గత ఆదివారం పాలు తీసుకురావడానికి బయటకు వచ్చిన వారిని చిన్నారావు బంధువైన కైకవరపు రవిశేఖర్ గోదావరి కాలువ చూపిస్తానంటూ బైక్‌పై ఎక్కించుకుని పట్టిసీమ ఎత్తిపోతల పథకం జీరో పాయింట్ వద్దకు తీసుకువెళ్లాడు. కాలువ చూస్తున్న ఇద్దరు చిన్నారులను వెనుక నుంచి ప్రవాహంలోకి నెట్టివేయడంతో వారు మృత్యువాత పడ్డారు. ప్రశాంత్ మృతదేహం పోలవరం మండలం రేపల్లెవాడ, ఇటికిలకోట సమీపంలో మంగళవారం ఉదయం లభించగా, విక్కీ మృతదేహాన్ని గోపాలపురం మండలం వేళ్ళచింతలగూడెం సమీపంలో గుర్తించారు. చిన్నారులు అదృశ్యమైన రోజునే వారి తండ్రి కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అప్పటికే చిన్నారులను బలితీసుకున్న రవిశేఖర్ ఏమీ ఎరగని వాడిలా చిన్నారావుతోపాటు పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. చిన్నారుల అదృశ్యం మెట్టప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో డీఎస్పీ చిటికెన మురళీకృష్ణ దర్యాప్తు చేపట్టారు. 24వ తేదీ దిప్పకాయలపాడు వెళ్లి విచారణ చేపట్టిన అనంతరం రవిశేఖర్‌పై పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. ఫోన్‌కాల్స్‌తో పోలీసుల వల దిప్పకాయలపాడు చిన్నారుల మృతికి కారణమైన రవిశేఖర్‌ని పోలీసులు ఫోన్ కాల్స్‌తో పట్టుకోగలిగారు. డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో రవిశేఖర్‌ను అనుమానించి 24వ తేదీ రాత్రి అతనికి ఫోన్ చేసి చిన్నారులు ఇరువురూ సేఫ్‌గా ఇంటికి తిరిగి వచ్చారని తెలిపారు. దీంతో పోలీసులకే రవిశేఖర్ పలుసార్లు తిరిగి ఫోన్ చేసి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, వారిని ఎవరైనా ఏదైనా చేశారా అంటూ పదే పదే సందేహాలు వ్యక్తంచేయడం పోలీసుల అనుమానానికి మరింత బలమైన ఆధారం ఏర్పడింది. ఇరువురు చిన్నారులు దిప్పకాయపాడు ఇంటి వద్దకు వచ్చారని పోలీసులు తెలపగా రవిశేఖర్ మాత్రం దిప్పకాయలపాడు రాకపోవడంతో నిందితుడు అతనే అని అనుమానించారు. దీంతో అతని గురించి విచారణ చేపట్టి పట్టుకుని కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించారు. విచారణలో రవిశేఖర్ నిజం వెల్లడించాడు. ఆ సమాచారంతో తెల్లవారు ప్రాంతంలో పోలీసులు కాలువ వెంబడి గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహాలు లభ్యమయ్యాయి. వివాహేతర సంబంధమే కారణం చిన్నారులను బలితీసుకోవడానికి కారణం వివాహేతర సంబంధం అని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. చిన్నారుల తల్లితో రవిశేఖర్ గతంలో వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. అయితే రెండు నెలలుగా ఆమె రవిశేఖర్‌తో కలవడానికి విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో పిల్లలే అడ్డుగా భావించిన రవిశేఖర్ వారిని చంపడానికి ప్రణాళికను సిద్ధం చేసుకుని ఈ నెల 23న కాలువలోకి నెట్టి హతమార్చినట్లు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. గ్రామస్తుల ఆగ్రహం కొయ్యలగూడెం : చిన్నారులను హతమార్చిన యువకుడు రవిశేఖర్‌ను తమకు అప్పగించండి, వాడికి సరైన శిక్షను అమలు చేసి మరొక వ్యక్తి ఇటువంటి అకృత్యం చేయకుండా ఉండటానికి గుణపాఠం నేర్పుతాం అంటూ దిప్పకాయలపాడు గ్రామస్తులు మంగళవారం తీవ్ర ఆగ్రహావేశాలతో పేర్కొన్నారు. చిన్నారులు ప్రశాంత్, విక్కీలను రవిశేఖర్ దారుణంగా హతమార్చాడన్న విషయం తెల్లవారే సరికల్లా దావానలంలా చేరడంతో దిప్పకాయలపాడు దళితవాడలో 500 మందికి పైగా ప్రజలు చేరుకుని రవిశేఖర్ ఇంటిని ధ్వంసం చేశారు. ఆగ్రహం చల్లారక అతని తండ్రి కాంతారావుపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను పక్కకు తోశారు. అయినా స్థానికులు శాంతించకపోవడంతో కాంతారావును పోలీసు జీపులో ఎక్కించుకుని కొయ్యలగూడెం తరలిస్తుండగా మహిళలు జీపునకు అడ్డంగా కూర్చొని అందోళనకు దిగారు. జీపు టైర్లలో గాలిని తీసివేసి కాంతారావును తమకు అప్పగించాలని నినాదాలు చేశారు. అప్పటికే కొందరు పెద్దలు నిందితుడు రవిశేఖర్ అని, కాంతారావు, అతని మరో కొడుకు, కుటుంబ సభ్యులకు ఏ సంబంధం లేదని నచ్చజెప్పారు. దీంతో వివాదం కొంత సర్దుమణిగింది. -
కుంటలో పడి నలుగురు చిన్నారుల మృతి
గుంటూరు క్రైం: గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో పడి నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ సంఘటన నగర శివారులోని ఓబులనాయుడుపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది. గుంటూరు రూరల్ మండలం చౌడవరం గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు ఈత కొట్టడానికి కుంటవద్దకు వెళ్లారు. కుంట లోతు ఎక్కువగా ఉండటంతో.. ప్రమాదవశాత్తు అందులో మునిగి మృతి చెందారు. ఇది గుర్తించిన స్థానికులు మృతదేహాలను బయటకు వెలికితీసి పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారుల మృతిలో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి -
వాగులో పడి ఇద్దరు చిన్నారుల మృతి
ఖమ్మం: ఖమ్మం జిల్లా పాల్వంచలో విషాదం చోటు చేసుకుంది. దుస్తులు ఉతకడానికి వాగుకు వెళ్లిన ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందారు. ఈ సంఘటన మండలంలో కుంటినాగులగూడెంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రోహిణి(12) ఏడో తరగతి, మోకాళ్ల శిరీష(15)పదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరు ఈ రోజు గ్రామ శివారులోని ముర్రేడు వాగుకు దుస్తులు ఉతకడానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రోహిణి వాగులో పడి మునిగి పోయింది. ఇది గుర్తించిన శిరీష ఆమెను రక్షించడానికి యత్నించి తాను కూడా వాగులో పడిపోయింది. విషయం తెలుసుకున్న స్థానికులు మృతదేహాలను వెలికి తీశారు. స్నేహితులిద్దరి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.