లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా వాసులను గత రెండు నెలలుగా తోడేళ్లు చుక్కలు చూపిస్తున్నాయి. దాదాపు 30 గ్రామాల ప్రజలకు వణికించేస్తున్నాయి. రాత్రి సమయాల్లో గ్రామాలపై దాడులు చేసి. ఇళ్లలోని చిన్నారులను ఎత్తుకెళ్లి చంపి తింటున్నాయి. నెలన్నర వ్యవధిలోనే తోడేళ్ల దాడిలో తొమ్మిది మంది చనిపోయారు. మరణించిన వారిలో ఎనిమిది మంది చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. దీంతో బహ్రైచ్‌లోని 35 గ్రామాలకు హై అలర్ట్ ప్రకటించారు.
తాజాగా తోడేళ్ల బీభత్సానికి రెండేళ్ల బాలిక బలైంది. మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున జరిగిన తోడేళ్ల తాడిలో అంజలి అనే బాలిక మృతిచెందింది. మరో ముగ్గురు గాయపడగా.. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓవైపు తోడేళ్లను బంధీంచేందుకు అటవీ శాఖ అధికారుల వేట కొనసాగుతుండగానే ఈ దాడులు వెలుగుచూశాయి.
గాయపడిన ముగ్గురిలో కమలా దేవి అనే మహిళ మాట్లాడుతూ.. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో బాత్రూమ్‌కు వెళ్లగా తమపై తోడేలు దాడి చేసినట్లు చెప్పింది. తన మెడ, చెవిని గాయపరిచిందని, వెంటనే కేకలు వేయడంతో అవి పారిపోయినట్లు తెలిపింది.
#WATCH | Uttar Pradesh: On the death of a child attacked by a wolf, Monika Rani, DM Bahraich says, "We have caught 4 wolves, 2 are left... Our team is continuously patrolling, we are trying our best to catch them as soon as possible...I request people to sleep indoors...A… pic.twitter.com/Obk5dSqMKt
— ANI (@ANI) September 2, 2024
బహ్రైచ్ జిల్లా కలెక్టర్ మోనికా రాణి మాట్లాడుతూ.. తోడేళ్ల డుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి లోపలే నిద్రించాలని సూచించారు. ఇప్పటి వరకు ‘ఆపరేషన్ బేడియా’ కింద నాలుగు తోడేళ్ళను పట్టుకున్నామని మరో రెండింటి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. తమ అధికారుల బృందం నిరంతరం పెట్రోలింగ్ చేస్తోందని, మిగిలిన తోడేళ్ళను వీలైనంత త్వరగా పట్టుకోవడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా బహ్రైచ్ తోడేళ్ల ఘటనలు పొరుగున ఉన్న బిహార్‌లో భయాందోళన సృష్టిస్తోంది. బిహార్‌లోని మక్సుద్‌పూర్ కోటలో తోడేళు అనుకొని పలువురు నక్కను అంతమొందించారు. దారుణంగా కొట్టి చంపారు. అయితే దీనిపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు మీడియానే కారణమని ఆరోపిస్తునున్నారు.
తోడేళ్ల గురించి అనవసరమైన భయాందోళనలు వ్యాప్తి చేయకుండా నియంత్రించాల్సిన బాధ్యత మీడియాపై ఉందని వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ అనిష్ అంధేరియా పేర్కొన్నారు. బహ్రైచ్‌లో తోడేళ్లు పిల్లలను చంపినట్లు వస్తున్న ఆరోపణలపై విస్తృతమైన కవరేజీ ఇవ్వడం ద్వారా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాలలో ఇలాంటి అనాగరిక చర్యలకు జాతీయ, ప్రాంతీయ మీడియా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment