Wolves
-
తోడేళ్ల హైజంప్ వేట!
బహ్రాయిచ్: యూపీలోని బహ్రాయిచ్‌లో నరమాంస భక్షక తోడేళ్ల బీభత్సం కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఐదు తోడేళ్లను పట్టుకున్న అటవీశాఖ అధికారులు ఇక ఒక తోడేలు మాత్రమే మిగిలివుందని, దానిని కూడా త్వరలోనే పట్టుకుంటామని స్థానికులకు హామీ ఇచ్చారు. దీంతో ఇక్కడి ప్రజల దృష్టి ఆ ఆరో తోడేలుపైనే నిలిచింది. తాజాగా తోడేళ్ల వేటకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. దానిని చూసినవారంతా భయాందోళనకు గురవుతున్నారు.బహ్రాయిచ్ పరిధిలోని నాన్పరా ప్రాంతంలో రెండు తోడేళ్లు ఏడడుగుల గోడను దూకి, అక్కడ కట్టివున్న ఒక మేకను నోట కరుచుకుని తీసుకువెళుతున్న దృశ్యం ఆ సీసీటీవీలో రికార్డయ్యింది. జనసాంద్రత కలిగిన ఆ ప్రాంతంలో ఇలా జరగడంపై స్థానికులు హడలెత్తిపోతున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో రెండు తోడేళ్లు కనిపిస్తున్నాయి. ఒక తోడేలు ఆ మేక మెడను కొరికి పట్టుకోగా, మరొక తోడేలు ఆ మేక వెనుక భాగాన్ని పట్టుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామస్తులు ఆ మేక కోసం వెదుకగా సమీపంలోని ఒక మామిడి తోటలో ఆ మేక తల, కాలు కనిపించాయి.ఈ ఘటన గురించి ఆ మేక యజమాని మున్నా మాట్లాడుతూ తాము రాత్రి భోజనం చేశాక, అంతా పడుకున్నామని, ఇంటి బయట ఉన్న సిమెంటు స్తంభానికి మేకను తాడుతో కట్టివేశామన్నారు. అయితే రాత్రి 11 గంటల సమయంలో మేక అరుపులు వినిపించి, తామంతా బయటకు వచ్చేసరికి మేకను పట్టుకుని రెండు తోడేళ్లు పరుగులు తీయడం కనిపించిందన్నారు. ఇంతలో చుట్టుపక్కల ఉన్నవారంతా సంఘటనా స్థలానికి వచ్చారన్నారు. ఈ విషయాన్ని వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేశామని, వారు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారన్నారు. ఇది కూడా చదవండి: మారేడుమిల్లిలో వైద్య విద్యార్థుల విహారయాత్ర.. విషాదాంతం -
ఆగని తోడేళ్ల దాడులు.. మేకను నోట కరచుకుని..
బహ్రాయిచ్: యూపీలోని బహ్రాయిచ్‌లో తోడేళ్ల భీభత్సం కొనసాగుతోంది. నాన్పరా తహసీల్ పరిధిలో ఒక ఇంటి బయట కట్టిన మేకను తోడేళ్లు చంపుకుతిన్నాయి. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయ్యింది. దానిలో తోడేళ్లు మేకను తమ నోట కరచుకుని తీసుకువెళుతున్న దృశ్యాలు కనిపించాయి.ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలో నరమాంస భక్షక తోడేళ్లు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పాలనా యంత్రాంగం ఇప్పటి వరకు చాలా తోడేళ్లను పట్టుకున్నప్పటికీ, తోడేళ్ల దాడులు ఆగడం లేదు. తాజాగా బహ్రాయిచ్‌లోని బీజేపీ శాసనమండలి సభ్యుడు పద్మాసేన్ చౌదరి ఫామ్‌హౌస్‌లో నాలుగు తోడేళ్ల గుంపు కనిపించింది. వీటిలో ఒక కుంటి తోడేలు కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెతుకుతున్న తోడేలు ఇదేనని భావిస్తున్నారు. అయితే ఈ కొత్త తోడేళ్ల గుంపు స్థానికులను మరింతగా భయపెడుతోంది.ఆరు తోడేళ్ళ గుంపు మనుషులపై దాడి చేస్తున్నదని గుర్తించిన అటవీశాఖ అధికారులు అతికష్టం మీద ఐదు తోడేళ్లను పట్టుకున్నారు. ఇంకా ఒక తోడేలు మిగిలివుందని చెబుతున్నారు. కాగా ఆ తోడేళ్ల గుంపు నరమాంస భక్షకులుగా మారడానికి కారణమేమిటన్నది పరిశోధించాల్సిన అంశమని అటవీ అధికారి తెలిపారు. తాజాగా తోడేళ్లు కనిపించిన ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించి, విచారణ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: World Rose Day 2024: క్యాన్సర్‌ను జయించాలని కోరుకుంటూ.. -
పులుల కంటే ఎక్కువగా బలిగొన్నాయని తెలుసా?
-
UP: తోడేళ్ల దాడుల వెనక ప్రతీకార కోణం!
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాను తోడేళ్ల గుంపు వణికిస్తోంది. గత కొన్ని నెలలుగా తోడేళ్ల వరుస దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వీటిని పట్టుకోవడం కోసం అధికారులు ‘ఆపరేషన్ భేడియా’ చేపట్టారు.అయినా ఇవి కొన్ని గ్రామాల్లోని ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇప్పటివరకు ఈ తోడేళ్ల దాడిలో మొత్తం ఎనిమిది మంది మృతిచెందగా.. అందులో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. అర్థరాత్రి సమయంలో చిన్నారులనే టార్గెట్ చేస్తున్నాయి ఈ తోడేళ్ల గుంపు.అయితే తాజాగా ఈ తోడేళ్లు సంబంధించి ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సంజయ్ పాఠక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తోడేళ్ల సైతం ప్రతికారం తీర్చుకోవటం కోసం దాడులు చేస్తాయని అన్నారు. ‘‘తోడేళ్లకు ప్రతీకారం తీర్చుకునే అలవాటు ఉంది. వాటి నివాసాలు, పల్లలకు హాని తలపెడితే.. మనుషులపై ప్రతీకారంతో దాడులు చేస్తాయి. ఈ దాడుల వెనక ప్రతీకార కోణం కూడా ఉండవచ్చనే అనుమానం ఉంది’’ అని ఓ జాతీయ మీడియాతో వెల్లడించారు.బహ్రైచ్‌లోని రాముపూర్ సమీపంలోని ఓ చెరుకు తోటలో రెండు తోడేలు పిల్లలను గుర్తించినట్లు గ్రామస్తులు తెలిపారు. భారీ వర్షం కారణంగా ఆ ప్రాంతంలో వరదలు వచ్చాయని, ఆ వరదల్లో తోడేలు పిల్లలు చనిపోయి ఉండవచ్చని తెలిపారు. అయితే.. వాటి తల్లి తోడేలు తమపై ప్రతీకారం తీర్చుకుంటోందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. అటవీ ప్రాంతంలో తోడేళ్ల ఆవాసాలను తొలగించటంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక అవి గ్రామాలుపై దాడులు చేస్తున్నాయని అటవీశాఖ నిపుణులు పేర్కొంటున్నారు. -
రక్తం మరిగిన తోడేళ్లు.. కనిపిస్తే కాల్చివేత!
బహ్రయిచ్: యూపీలోని బహ్రయిచ్ జిల్లాలో తోడేళ్ల భయోత్పాతం కొనసాగుతూనే ఉంది. తాజాగా హర్ది ప్రాంతంలో అవి ఓ పసికందును పొట్టన పెట్టుకున్నాయి. ఇద్దరు వృద్ధురాళ్లపై దాడి చేసి గాయపరిచాయి. దాంతో గత రెండు నెలల్లో తోడేళ్లకు బలైన వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది. వీరిలో ఎనిమిది మంది చిన్నారులే! 34 మంది గాయపడ్డారు. ఆరు తోడేళ్లలో నాలుగింటిని పట్టుకోగా రెండు మాత్రం నిత్యం అధికారులకు చుక్కలు చూపుతున్నాయి. ఆవాసాలు మారుస్తూ, రోజుకో గ్రామాన్ని లక్ష్యం చేసుకుంటూ తప్పించుకుంటున్నాయి. తప్పనిసరైతే వాటిని కాల్చివేయాల్సిందిగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ఆదేశాలిచ్చారు. దాంతో ట్రాంక్విలైజర్లతో షూటర్లను రంగంలోకి దించారు. తోడేళ్లను గుర్తించి పట్టుకునేందుకు, వీలవని పక్షంలో మట్టుపెట్టేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ‘ఆపరేషన్ భేడియా’కీలక దశకు చేరిందని బహ్రయిచ్ డీఎఫ్‌వో అజీత్ ప్రతాప్ సింగ్ తెలిపారు. తోడేళ్ల పీడ విరగడయ్యేదాకా ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.బహ్రయిచ్‌లో మంగళవారం తెల్లవారుజాము 3.35గంటలకు మహసీ సబ్ డివిజన్లోని నౌవన్ గరేతి గ్రామంలో తోడేలు ఓ ఇంట్లో దూరి అంజలి అనే రెండున్నరేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లింది. షాక్‌కు గురైన తల్లి అరిచేలోపే పాపను నోట కరుచుని పారిపోయింది. రెండు గంటల తర్వాత కిలోమీటరు దూరంలో చేతుల్లేకుండా చిన్నారి మృతదేహం దొరికింది. అనంతరం ఉదయాన్నే అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలోని కొటియా గ్రామంలో వరండాలో నిద్రిస్తున్న కమలాదేవి (70) అనే వృద్ధురాలిపై తోడేలు దాడి చేసింది. ఆమె అరుపులతో కుటు ంబీకులు అప్రమత్తమయ్యారు. తీవ్ర గాయాలైన ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మరో అరగంట తరువాత మూడో దాడిలో సుమన్ దేవి (65) అనే మరో వృద్ధురాలు గాయపడింది. సోమవారం రాత్రి పండోహియా గ్రామంలో తోడేళ్ల దాడిలో గాయపడ్డ అఫ్సానా అనే ఐదేళ్ల బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆదివారం రాత్రి హర్ది దర్హియా గ్రామంలో తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిపై తోడేలు దాడి చేసింది. మెడను కరిచి లాక్కెళ్లబోయింది. తో డేలుతో తల్లి ధైర్యంగా పోరాడి తన బాబును కాపాడుకోగలిగింది. అదే రాత్రి మరో 50 ఏళ్ల వ్యక్తిపైనా తోడేలు దాడి జరిగింది.శ్మశాన నిశ్శబ్దం... తోడేళ్ల దెబ్బకు బహ్రయిచ్‌లో మార్కెట్లు మూతపడ్డాయి. వీధులు పగలు కూడా నిర్మానుష్యంగా ఉంటున్నాయి. మహసీ సబ్ డివిజన్లోనైతే జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రభావిత సీతాపూర్, లఖింపూర్ ఖేరి, పిలిభీత్, బిజ్నోర్ డివిజన్లలోనూ తోడేళ్ల భయం నెలకొని ఉంది. ఆ ప్రంతాలకు అదనపు ఫారెస్ట్ గార్డులు, ట్రాప్ బృందాలను పంపుతున్నారు. తోడేళ్లు నిత్యం తమ ఆవాసాలను మారుస్తుండటంతో పట్టుకోవడం కష్టమవుతోందని జిల్లా మేజి్రస్టేట్ మోనికా రాణి తెలిపారు. ‘‘అవి తెలివిగా ప్రతిసారీ కొత్త గ్రామా న్ని లక్ష్యం చేసుకుంటున్నాయి. ఇప్పటిదాకా నాలుగింటిని పట్టుకున్నాం. ఇంకో రెండు దొరకాల్సి ఉంది’’అన్నారు. తమ బృందం నిరంతరం గస్తీ కాస్తోందని, వాటినీ పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ (సెంట్రల్ జోన్) రేణుసింగ్ చెప్పారు. పిల్లలను ఇళ్ల లోపలే ఉంచాలని, రాత్రిపూట తలుపులకు తాళం వేసుకోవాలని అధికారులు లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.వీడియో ఆధారాలడిగారు...తోడేళ్లు తమ ఇళ్ల పక్కనే కనిపిస్తూ వణికిస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. అటవీ అధికారులకు చెబితే వీడియో ఆధారాలు అడుగుతున్నారని మండిపడుతున్నారు. ‘‘మా ఇంటి పక్కన తోడేలు కనిపిస్తే కుక్కనుకొని తరిమికొట్టాం. పొలాల వైపు పరుగెత్తడంతో తోడేలని గుర్తించాం. దాంతో పిల్లలంతా క్షేమంగా ఉన్నారా, లేరా అని చూసుకున్నాం. అంజలి తోడేలు బారిన పడిందని తేలింది’’అని నౌవన్ గరేతికి చెందిన బాల్కే రామ్ వెల్లడించారు. -
UP Bahraich: వేటాడుతున్న తోడేళ్లు.. మరో చిన్నారి మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా వాసులను గత రెండు నెలలుగా తోడేళ్లు చుక్కలు చూపిస్తున్నాయి. దాదాపు 30 గ్రామాల ప్రజలకు వణికించేస్తున్నాయి. రాత్రి సమయాల్లో గ్రామాలపై దాడులు చేసి. ఇళ్లలోని చిన్నారులను ఎత్తుకెళ్లి చంపి తింటున్నాయి. నెలన్నర వ్యవధిలోనే తోడేళ్ల దాడిలో తొమ్మిది మంది చనిపోయారు. మరణించిన వారిలో ఎనిమిది మంది చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. దీంతో బహ్రైచ్‌లోని 35 గ్రామాలకు హై అలర్ట్ ప్రకటించారు.తాజాగా తోడేళ్ల బీభత్సానికి రెండేళ్ల బాలిక బలైంది. మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున జరిగిన తోడేళ్ల తాడిలో అంజలి అనే బాలిక మృతిచెందింది. మరో ముగ్గురు గాయపడగా.. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓవైపు తోడేళ్లను బంధీంచేందుకు అటవీ శాఖ అధికారుల వేట కొనసాగుతుండగానే ఈ దాడులు వెలుగుచూశాయి.గాయపడిన ముగ్గురిలో కమలా దేవి అనే మహిళ మాట్లాడుతూ.. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో బాత్రూమ్కు వెళ్లగా తమపై తోడేలు దాడి చేసినట్లు చెప్పింది. తన మెడ, చెవిని గాయపరిచిందని, వెంటనే కేకలు వేయడంతో అవి పారిపోయినట్లు తెలిపింది.#WATCH | Uttar Pradesh: On the death of a child attacked by a wolf, Monika Rani, DM Bahraich says, "We have caught 4 wolves, 2 are left... Our team is continuously patrolling, we are trying our best to catch them as soon as possible...I request people to sleep indoors...A… pic.twitter.com/Obk5dSqMKt— ANI (@ANI) September 2, 2024 బహ్రైచ్ జిల్లా కలెక్టర్ మోనికా రాణి మాట్లాడుతూ.. తోడేళ్ల డుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి లోపలే నిద్రించాలని సూచించారు. ఇప్పటి వరకు ‘ఆపరేషన్ బేడియా’ కింద నాలుగు తోడేళ్ళను పట్టుకున్నామని మరో రెండింటి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. తమ అధికారుల బృందం నిరంతరం పెట్రోలింగ్ చేస్తోందని, మిగిలిన తోడేళ్ళను వీలైనంత త్వరగా పట్టుకోవడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.ఇదిలా ఉండగా బహ్రైచ్ తోడేళ్ల ఘటనలు పొరుగున ఉన్న బిహార్‌లో భయాందోళన సృష్టిస్తోంది. బిహార్‌లోని మక్సుద్పూర్ కోటలో తోడేళు అనుకొని పలువురు నక్కను అంతమొందించారు. దారుణంగా కొట్టి చంపారు. అయితే దీనిపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు మీడియానే కారణమని ఆరోపిస్తునున్నారు.తోడేళ్ల గురించి అనవసరమైన భయాందోళనలు వ్యాప్తి చేయకుండా నియంత్రించాల్సిన బాధ్యత మీడియాపై ఉందని వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ అనిష్ అంధేరియా పేర్కొన్నారు. బహ్రైచ్‌లో తోడేళ్లు పిల్లలను చంపినట్లు వస్తున్న ఆరోపణలపై విస్తృతమైన కవరేజీ ఇవ్వడం ద్వారా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాలలో ఇలాంటి అనాగరిక చర్యలకు జాతీయ, ప్రాంతీయ మీడియా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. -
డ్రోన్ల సాయంతో నరభక్షక తోడేళ్ల గాలింపు
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో నరమాంస భక్షక తోడేళ్ల కోసం గాలింపు కొనసాగుతోంది. వాటిని పట్టుకునేందుకు పోలీసులు, జిల్లా అటవీ శాఖ అధికారులు డ్రోన్లను ఉపయోగించి మరీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బహ్రైచ్ డివిజన్ సర్కిల్ అధికారి అభిషేక్ సింగ్ మాట్లాడుతూ డ్రోన్ల సాయంతో తోడేళ్ల జాడలు లభించాయన్నారు. జిల్లా అటవీశాఖ అధికారితో పాటు మొత్తం బృందమంతా సెర్చ్ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉందన్నారు. ఒకట్రెండు రోజుల్లో తోడేళ్లను పట్టుకుంటామన్నారు. గత కొన్ని నెలలుగా బహ్రైచ్‌లో స్థానికులను తోడేళ్లు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నరమాంస భక్షక తోడేళ్లు ఈ ప్రాంతంలో ఇప్పటివరకు 8 మందిని చంపాయి. అధికారులు ఇప్పటి వరకు నాలుగు తోడేళ్లను పట్టుకోగా, మరో రెండు తోడేళ్లను పట్టుకునేందుకు అన్వేషణ కొనసాగుతోంది. తోడేళ్లను రక్షించడానికి, పట్టుకోవడానికి పీఎసీకి చెందిన 200 బృందాలు, రెవెన్యూ శాఖకు చెందిన 32 బృందాలు, అటవీ శాఖకు చెందిన 25 బృందాలు రంగంలోకి దిగాయి.మహసీ తహసీల్‌లోని హార్ది, ఖైరీఘాట్ పరిధిలోని దాదాపు 50 గ్రామాల ప్రజలు తోడేళ్ల భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తోడేళ్లను పట్టుకునేందుకు మూడు థర్మల్ డ్రోన్లు, నాలుగు కేజ్‌లు, నెట్, ఆరు ట్రాపింగ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. తాజాగా హార్ది పోలీస్ స్టేషన్ పరిధిలో తోడేలు మరోసారి దాడి చేసింది. ఇంట్లో తల్లితో కలిసి పడుకున్న ఏడేళ్ల చిన్నారిపై తోడేలు దాడి చేసింది. ఈ ఘటన మజ్రా జంగిల్ పూర్వా గ్రామంలో చోటుచేసుకుంది. ఇంట్లోకి చొరబడిన ఆ తోడేలు చిన్నారి మెడను నోటకరచుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా, ఆ చిన్నారి అరుపు విని కుటుంబ సభ్యులు నిద్ర నుంచి లేచారు. దీంతో ఆ తోడేలు పొలాల్లోకి పరుగెత్తింది. -
యూపీ పల్లెల్లో ‘భేడియా’ టెర్రర్!
లక్నో: ఉత్తరప్రదేశ్ బహ్రైచ్ జిల్లా పల్లెలకు కంటి మీద కునుకు కరువైంది. భయం గుప్పిట గడుపుతున్నారు అక్కడి ప్రజలు. తల్లిదండ్రులు.. తమ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. గత 45 రోజుల్లో తోడేళ్ల గుంపు దాడిలో తొమ్మిది మంది బలయ్యారు. ఇందులో ఎనిమిది మంది చిన్న పిల్లలే కావడం గమనార్హం.గ్రామస్తుల భయాందోళనలతో.. తోడేళ్ల గుంపును తరిమికొట్టేందుకు జిల్లా అటవీశాఖ రంగంలోకి దిగింది. తోడేళ్లను తరిమికొట్టేందుకు ఏనుగు పేడ, మూత్రాన్ని అటవీ అధికారులు ఉపయోగిస్తున్నారు. సమీప గ్రామాల్లో తాజాగా.. ఇద్దరు చిన్నారులపై తోడేళ్లు దాడి చేశాయి. అప్రమత్తమై తల్లిదండ్రులు వాటి వెంటపడడంతో.. పిల్లలను వదిలేసి అవి పారిపోయాయి. తీవ్రమైన గాయలైన చిన్నారులకు సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.తోడేళ్ల దాడులు పెరిగిపోవడంపై.. స్థానిక ఎమ్మెల్యే సురేశ్వర్ సింగ్ రంగంలోకి దిగారు. గ్రామస్తులతో కలిసి రాత్రివేళలో ఆయన కాపల కాస్తున్నారు ‘‘అవి ఒకటో రెండో వచ్చి దాడి చేయడం లేదు. గుంపుగా గ్రామాల మీద పడుతున్నాయి. ఇప్పటికే మూడు తోడేళ్లను జిల్లా అటవీ అధికారులు పట్టుకున్నారు. మొత్తం తోడేళ్లు పట్టుబడే వరకు ప్రజలకు రక్షణగా జాగ్రత్తలు తీసుకోవటంపై అవగాహన కల్పిస్తా. నేను నా కార్యకర్తలు నిరంతరం అప్రమత్తంగా ఉంటాం’’ అని అన్నారు.VIDEO | Police and forest department team nabbed a wolf in UP's #Bahrainch, earlier today.The Uttar Pradesh government had launched 'Operation Bhediya' to capture a pack of wolves on the prowl in Mehsi tehsil in Bahraich district that has so far killed seven people.Six… pic.twitter.com/Nx5ZKFAT1e— Press Trust of India (@PTI_News) August 29, 2024ఉత్తరప్రదేశ్‌లో గ్రామాల్లో ఉన్న ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న తోడేళ్లను పట్టుకునేందకు సీఎం యోగి ప్రభుత్వం‘‘ఆపరేషన్ భేడియా’’ను కూడా ప్రారంభించింది. తోడేళ్లను పట్టుకోవడానికి అటవీ శాఖ డ్రోన్ కెమెరాలు, థర్మల్ డ్రోన్ మ్యాపింగ్ పద్ధతులను ఉపయోగిస్తోందని యూపీ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ తెలిపారు. -
ప్రకృతి గొప్పతనం తెలిపే కథ! నక్కలు చేసిన మేలు!
మానవుడు తాను మనుగడ సాగించడానికి ఇష్టారీతిలో అడవులు నరికి అభివృద్ధి ముసుగులో తానేం చేస్తున్నాడో తెలుసుకోలేకపోయాడు. అక్కడకి ప్రకృతి ప్రకోపిస్తూ ఏదో విధంగా మానవుడికి తెలియజేప్పే యత్నం చేసిన మూర్ఖుల్లా ప్రవర్తిస్తునే ఉన్నారు. ఇలాంటి ప్రకృతి కథ వింటే కనువిప్పు కలుగుతుందేమో. అన్ని జీవులు మనుగడ సాగిస్తే ప్రకృతి అని తెలిపే కథ. ఏదో ఒక్క సంతతే మనుగడ సాగిస్తే ఒక్కసారిగా పరిసరాలపై ఎలా ప్రభావం చూపుతోంది తెలియజేసే గమ్మత్తైన సంఘటన. చిన్నప్పుడూ చదివిన ఆహారపు గొలుసు కథ స్ఫూరింపజేస్తుంది. ఇంతకీ ఏంటా కథ అంటే.. 1995లో యూఎస్‌లోని ఎల్లో స్టోన్ నేషనల్పార్క్ ఒక్కసారిగా జీవకళ తప్పి నిర్జీవంగా కనిపించింది. ఎందువల్లనో గానీ కొలనులు, సెలయేళ్లు, ఎండిపోతూ, చెట్టన్నీ ఆక్కుపచ్చదనాన్ని కోల్పోయినట్లుగా ఉన్నాయి. దీంతో పక్షుల కిలకిలరావాలు, ఇతర సరీసృపాలు సందడి తదితరాలన్నీ కనుమరుగయ్యి నిర్మానుష్యంగా ఉంది. అయితే ఇదే సమయంలో పార్క్ అధికారులు 14 తొడేళ్లను విడుదల చేశారు. వేటాడే జంతువుల లేకపోవడంతో చెట్లను తినే లేళ్లు, తదితర జంతువుల జనాభా పెరిగిపోయింది. అవి మొక్కలు, పచ్చిక బయళ్లును నెమ్మదిగా తినేయడంతోనే ఒక్కసారిగా ఆ అడవి అంత నిర్జీవంగా అయిపోయింది. ఎప్పుడైతే విడుదలయ్యాయో ఈ తోడేళ్లు ఆ లేళ్లనే వేటాడటం ప్రారంభించాయి. నక్కల వేట ఎప్పుడైతే మొదలైందో ...క్రమంగా ఆ అడవి స్వరూపం మారి ఎవ్వరూ ఊహించని విధంగా అద్భుతంగా రూపుదిద్దుకుంటుంది. చెట్లన్ని చిగురించడం ప్రారంభించాయి. దీంతో కాకులు, గ్రద్దలు, ఇతర పక్కుల రావడం ప్రారంబించాయి. దీంతో పాటు సుంచులు, ఎలుకలు, కుందేళ్లు శబ్దాలతో మళ్లీ అడవి ఇదివరకటి పక్కుకిలకిల రావాలు, శబ్దాలతో కళకళలాడింది. ఎప్పుడూ కనిపించని కొన్ని రకాల జాతులు కూడా దర్శనమిచ్చాయి. కూడా. ఒక్కసారిగా పార్క్ నిర్వాహణధికారులు కూడా ఏదో మిరాకిల్ జరిగినట్లుగా జరిగిందంటూ ఆశ్చర్యపోయారు. తాము నిర్జీవంగా ఉన్న అడవిని మునిపటిలా పుష్పించే మొక్కలు చెట్లతో పచ్చగా అందంగా ఉండాలనుకున్నాం కానీ కుదరలేదు. ఈ తోడేళ్లు ఇలా అద్భుతం చేసి చూపుతాయని ఊహించలేదన్నారు. ఆఖరికి అడవిలో ఉండే వేటకుక్కలను కూడా చంపేశాయి. గ్రద్దలు, కాకిల జనాభా పెరిగింది. వేటాడే జంతువు..భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండే జంతువుల మధ్య సమతుల్యత ఏర్పడింది. మరోవైపు నదులు, కొలనులు, సెలయేర్లు కూడా ఇదవరకటిలో నీళ్లుతో నిండుగా కళకళలాడుతూ ఉన్నాయి. పరిసరాల సమతుల్యతకు అన్ని జంతువుల మనుగడ అత్యవసరం అనే విషయాన్ని చాటిచెప్పింది. ఈ ఘటన ప్రకృతి ఎంత అపురూపమైందో తెలియజేసింది. In 1995, 14 wolves were released in Yellowstone National Park. No one expected the miracle that the wolves would bring [📹 Protect All Wildlife]pic.twitter.com/DMlMDx40TY — Massimo (@Rainmaker1973) August 25, 2023 (చదవండి: గమ్యస్థానాలకు చేర్చే "ట్రావెలింగ్ పార్క్"..చూస్తే ఫిదా అవ్వడం ఖాయం!) -
రోళ్లపాడులో తోడేళ్లు
ఆత్మకూరు రూరల్ (నంద్యాల): ‘ఇండియన్ ఊల్ఫ్’గా చెప్పుకునే తోడేళ్ల జనాభా దేశవ్యాప్తంగా మూడు వేల వరకు ఉండొచ్చని అటవీ శాఖ అంచనా. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిదిలోని రోళ్లపాడు పక్షుల అభయారణ్యంలోనూ తోడేళ్లు ఒకప్పుడు గణనీయంగానే ఉండేవి. కొన్నేళ్ల క్రితం వీటి ఉనికి ఇక్కడ పూర్తిగా కనుమరుగైంది. అనూహ్యంగా ఈ ఏడాది జనవరిలో అభయారణ్యంలో ఒక అధికారికి తోడేలు కనిపించగా.. అటవీ శాఖ అధికారులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆ తరువాత వాటి ఉనికిపై ప్రత్యేక దృష్టి సారించగా.. రెండు తోడేళ్ల కుటుంబాలు ఇక్కడి అభయారణ్యంలో సంచరిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. తోడేళ్లు సంఘ జీవనానికి పెట్టింది పేరు. ఇవి ప్రత్యేకమైన గుంపులుగా నివసిస్తాయి. ఈ గుంపును ‘ప్యాక్’ అంటారు. ఒక ప్యాక్‌లో 8 వరకు తోడేళ్లు ఉంటాయి. దేశంలో 10 తోడేళ్ల అభయారణ్యాలు అంతరించిపోతున్న తోడేళ్లను సంరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో 10 అభయారణ్యాలను ఏర్పాటు చేసింది. రాజస్థాన్‌లో కైలాదేవి అభయారణ్యం, కుంబాల్ ఘర్ అభయారణ్యం, తోడ్ ఘర్ రోలి అభయారణ్యం, మౌంట్ ఆబు అభయారణ్యం, గుజరాత్‌లోని బ్లాక్ బక్ అభయారణ్యం, కఛ్ బస్టర్డ్ అభయారణ్యం, నారాయణ్ సరోవర్ అభయారణ్యం, శూల్ పాణేశ్వర్ అభయారణ్యం, కర్ణాటకలోని రాణి బెన్నూర్ బ్లాక్ బక్ అభయారణ్యం, మహారాష్ట్రలోని రెహే కురి బ్లాక్ బక్ అభయారణ్యాలలో తోడేళ్లను సంరక్షిస్తున్నారు. బట్టమేక పక్షుల అభయారణ్యంలో.. ఏపీలో తోడేళ్ల సంరక్షణకు ప్రత్యేకించి అభయారణ్యాలు ఏర్పాటు చేయనప్పటికీ బట్టమేక పక్షుల సంరక్షణకు ఏర్పాటు చేసిన రోళ్లపాడు అభయారణ్యంలో కృష్ణజింకలతో కలసి తోడేళ్లు సహవాసం చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. తోడేళ్లు తన సహజ జాతి మాంసాహార జంతువులైన హైనాలు, నక్కల తరహాలో వేరే జంతువులు వేటాడి తినగా మిగిలిన మాంసాన్ని తినే జీవులు కావు. ఇవి తమ ఆహారాన్ని స్వయంగా వేటాడి సంపాదించుకుంటాయి. తమకు అందుబాటులో ఉండే కృష్ణ జింకలు, సమీప గ్రామాల్లో ఉండే మేకలు, గొర్రెలను ఇవి వేటాడుతుంటాయి. తోడేళ్ల ఉనికిని ఇటీవల గుర్తించాం రోళ్లపాడు బట్టమేక పక్షుల అభయారణ్యంలో తోడేళ్ల ఉనికిని ఇటీవల గుర్తించాం. ఒకప్పుడు ఈ అభయారణ్యం పరిధిలో విస్తారంగా కనిపించిన ఇండియన్ ఊల్ఫ్ తదనంతరం అదృశ్యమైంది. అనూహ్యంగా ఇటీవల మాకు తోడేళ్లు కనిపించడం సంతోషదాయకం. రెండు ప్యాక్‌ల తోడేళ్లు రోళ్లపాడులో ఉండవచ్చని అంచనా. – అలాన్ చోంగ్ టెరాన్, డీడీ, ప్రాజెక్ట్ టైగర్, ఆత్మకూరు -
దశాబ్దం తర్వాత నల్లమలలో తోడేళ్ల జాడ
మార్కాపురం: పదేళ్ల కాలం అనంతరం నల్లమల అటవీ ప్రాంతంలో తోడేళ్ల కదలికలు కనిపించాయి. ఇటీవల దోర్నాల–ఆత్మకూరు సరిహద్దులోని రోళ్లపాడు వద్ద తోడేళ్లు కనిపించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇవి దోర్నాల– ఆత్మకూరు–శ్రీశైలం అటవీ ప్రాంతాల మధ్య కొద్ది సంఖ్యలో సంచరిస్తున్నాయి. వీటి అరుపు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇవి గుంపులుగా సంచరిస్తూ..జింకలు, గొర్రెలు, మేకలు, కుందేళ్లను చంపి తింటాయి. అత్యంత వేగంగా పరిగెడతాయి. పాతికేళ్ల క్రితం మార్కాపురం, పెద్దారవీడు, తర్లుపాడు, అర్థవీడు, దోర్నాల తదితర ప్రాంతాల్లో ఇవి ఉండేవి. పంట పొలాలకు రక్షణ చర్యలో భాగంగా రైతులు కరెంటు తీగలు పెట్టడంతో జంతువుల్ని వేటాడేందుకు పొలాల్లోకి వచ్చి విద్యుత్ వైర్లు తగిలి చనిపోయి వాటి సంఖ్య క్రమేపి తగ్గిపోయింది. గడిచిన పదేళ్ల కాలంలో నల్లమలలో తోడేళ్ల జాడ లేకపోవడంతో పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో నెల క్రితం రోళ్లపాడు అటవీ ప్రాంతంలో తోడేళ్ల జాడ ట్రాప్డ్ కెమెరాల్లో కనిపించింది. వాటి సంరక్షణకు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వన్య ప్రాణులను చంపవద్దు వన్య ప్రాణులను ఎవరూ చంపవద్దు. ఉచ్చులేసి వేటాడొద్దు. ఇటీవల రోళ్లపాడు ప్రాంతంలో తోడేళ్లు సంచరించాయి. రైతులు పొలాలకు విద్యుత్ కంచె వేయవద్దు. వన్య ప్రాణులను వేటాడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – ఎ.విగ్నేష్, డిప్యూటీ డైరెక్టర్, అటవీ శాఖ -
అంతరిస్తున్న తోడేళ్లు! ఉమ్మడి అనంతపురంలో భారీగా తగ్గిన వన్యప్రాణులు
సాక్షి ప్రతినిధి అనంతపురం: క్రూర జంతువుగా పేరున్న తోడేళ్లు పొదలు, గుట్టలను ఆవాసాలుగా చేసుకుని జీవిస్తాయి. ఒకప్పుడు అటవీ ప్రాంతంలో ఎక్కడ చూసినా కనిపించేవి. గొర్రెలు, మేకల మంద సంచరించే ప్రాంతాల్లో తిరిగేవి. ముఖ్యంగా జీవాలు ఎక్కువగా ఉండే అనంతపురం జిల్లాలో భారీగా ఉండేవి. కానీ ప్రస్తుతం వాటి జాడ మచ్చుకైనా కనిపించడం లేదు. తాజాగా అటవీశాఖ అధికారులు వీటిని అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేర్చారు. రెండేళ్లుగా ఎక్కడా కనిపించడం లేదని వెల్లడిస్తున్నారు. వేటలో పటిష్టమైన వ్యూహం తోడేళ్లు గుంపులుగా సంచరిస్తాయి. వేటలో పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేస్తాయి. ఒకటి ముందుగా డెకాయ్ ఆపరేషన్ చేస్తుంది. ఆ తర్వాత మిగతా వన్నీ వస్తాయి. మేక లేదా గొర్రెను తీసుకెళ్లేటప్పుడు గొంతును నోట కరచుకుని, తన ముళ్లతోకతో వెనుక కొడుతూ ఉంటుంది. దీంతో ఆ జీవం దానితో పాటు పరిగెడుతుంది. దీని వల్ల ఈడ్చుకెళ్లే శ్రమ వాటికి తగ్గుతుంది. ఒక తోడేలు ఉందంటే రెండు మూడు నక్కలు కూడా దాని సమీపంలోకి పోలేవు. రెండు లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో 30కి మించి తోడేళ్లు ఉండేవని అంచనా. కాగా, ఒకప్పుడు ప్రతి జిల్లాలోనూ గుంటనక్కలు కనిపించేవి. ఇప్పుడు వాటి జాడ కూడా లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో నాలుగేళ్లుగా మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే పునుగుపిల్లి కూడా కనుమరుగైనట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అటవీ విస్తీర్ణం తగ్గడం వల్లే.. జనావాసాలు పెరిగాయి. అడవులు వ్యవసాయ భూములుగా మారాయి. దీంతో వన్యప్రాణుల ఆవాసానికి ఇబ్బందిగా మారింది. కొండలు ఎక్కువగా ఉన్న అనంతపురం లాంటి జిల్లాలే తోడేళ్లకు మంచి ఆవాసాలు. ఇక్కడే వీటి జాడ లేదంటే మిగతా చోట్ల అసలే కనిపించవు. వీటిని కాపాడుకునేందుకు సర్వశక్తులా యతి్నస్తున్నాం. –సందీప్ కృపాకర్, జిల్లా ఫారెస్టు అధికారి, అనంతపురం చదవండి: కొరమీను, ఇంగిలాయి, జల్ల, బొమ్మిడాయి, గొరక, వాలుగ.. ఇక్కడ పుట్టినవే! -
15వేల ఏళ్ల కిందటే కుక్కలు ఉన్నాయి!
మానవులకు మంచి విశ్వాసపాత్రులైన కుక్కల పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి? వీటి మూలాలు ఎక్కడ?.. ఈ అంశాలపై చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. కుక్కలు తోడేళ్ల నుంచి పరిణామం చెందాయనే విషయాన్ని చాలావరకు అంగీకరిస్తున్న శాస్త్రవేత్తలు వాటి మూలాల విషయంలోనే భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యూరప్‌లో, తూర్పు దేశాలలో, సైబెరియాలో, దక్షిణ చైనాలో వీటి మూలాలు ఉన్నట్టు గతంలో భావించారు. తాజాగా విస్తృతంగా జరిగిన పరిశోధనల్లో కుక్కల జన్మస్థలం మధ్య ఆసియా అని తేలింది. నేపాల్, మంగోలియాలో వాటి మూలాలు ఉన్నట్టు గుర్తించారు. ఇవి 15 ఏళ్ల కిందటే భూమి మీద ఉనికిలోకి వచ్చాయని నిర్ధారించారు. కార్నెల్ యూనివర్సిటీకి చెందిన లారా ఎం షనాన్, ఆడమ్ ఆర్ బాయ్కో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం కుక్కలపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరిపింది. కేవలం మేలుజాతి కుక్కలపైనే కాకుండా, వీధి కుక్కలు, పల్లె కుక్కలు.. ఇలా భూమిపై ఉన్న వందకోట్ల కుక్కలకు చెందిన వివిధ తెగలపై అధ్యయనం చేశారు. కుక్కలకు చెందిన విభిన్న జాతులు, తెగలకు చెందిన మూడు రకాల డీఎన్ఏలను షనాన్ విశ్లేషించారు. ఇందుకోసం భారత్‌తోపాటు 38 దేశాలకు చెందిన 549 పల్లె కుక్కలు, 161 జాతులకు చెందిన 4,500 కుక్కలపై అధ్యయనం చేశారు. తద్వారా జన్యుపరంగా తమ పూర్వీకులకు దగ్గరగా ఉన్న ఆధునిక కుక్కలు, వాటి భౌగోళిక ప్రాంతాన్ని అంచనా వేశారు. మధ్య ఆసియా, ముఖ్యంగా నేపాల్, మంగోలియాలోని పూర్వీకుల నుంచి ప్రస్తుతమున్న అన్ని కుక్కలు వచ్చాయని తమ అధ్యయనంలో తేలిందని బాయ్కో తెలిపారు. అయితే శుకనాలు కచ్చితంగా ఎంతకాలం కిందట ఉనికిలోకి వచ్చాయో తెలియనప్పటికీ, సుమారు 15వేల సంవత్సరాల కిందట అవి ఆవిర్భవించి ఉంటాయని చెప్పారు. ఈ పరిశోధన అంశాలను అమెరికా నుంచి వెలువడుతున్న 'ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్' జర్నల్‌లో ప్రచురించారు.