1/13
తోడేళ్ల దాడులు.. ప్రస్తుతం భారత్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర.. ఇలా ఒక్కో రాష్ట్రానికి వీటి దాడులు విస్తరిస్తున్నాయనే కథనాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
2/13
కొన్నిచోట్ల నక్కలను తోడేళ్లుగా భ్రమపడి బంధించడం.. చంపుతున్న ఘటనలూ చూస్తున్నాం. అయితే తోడేళ్లు మనుషులపై దాడి చేయడం కొత్తేంకాదు.
3/13
మన దేశంలో బ్రిటిషర్ల కాలం నుంచే తోడేళ్ల దాడుల ఘటనలను రికార్డులుగా భద్రపర్చడం మొదలుపెట్టారు. ఆ గణాంకాలను పరిశీలిస్తే..
4/13
1875లో.. నార్త్‌వెస్ట్ ప్రావిన్సెస్‌తో పాటు బీహార్‌లోనూ తోడేళ్ల దాడులు విపరీతంగా జరిగాయి.
5/13
ఎంతలా అంటే.. పులుల కంటే తోడేళ్ల దాడుల్లోనే ఎక్కువమంది మరణించారు.
6/13
బీహార్‌లో ఏడాది కాలంలో(1875-76) 721 మంది మరణించగా.. పాట్నా, భగల్‌పూర్ డివిజన్‌లో 185 మరణాలు నమోదయ్యాయి.
7/13
1878లో.. యునైటెడ్ ప్రావిన్స్‌లో తోడేళ్ల దాడుల్లో 624 మంది మరణించారు.
8/13
అయితే వేటగాళ్ల సంఖ్య పెరగడం, అడవులపై మనిషి ఆధిపత్యంతో తర్వాతి కాలంలో దాడులు తగ్గుముఖం పట్టాయి.
9/13
1910-15 మధ్య బీహార్ హజారిబాగ్‌లో 115 మంది పిల్లలు మరణించారు.
10/13
ఇదే హజారిబాగ్‌లో 1980-86 మధ్య 122 మంది మరణించగా, వంద మందికి పైగా గాయపడ్డారు
11/13
ఏప్రిల్ 1989-మార్చి 1995.. సదరన్ బీహార్‌లో తోడేళ్ల దాడుల్లో 92 మంది మరణించారు.
12/13
హిమాలయన్ రీజియన్ చరిత్ర రికార్డులను పరిశీలిస్తే.. 1362 నుంచి 1918 దాకా 7,600 మంది పౌరులు తోడేళ్ల దాడుల్లో మరణించారు.
13/13
ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మార్చి నుంచి తోడేళ్ల దాడి ఘటనలు వరుసగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు పలువురు చిన్నారులు మృతి చెందగా, 30 మందికిపైగా గాయపడ్డారు. ‘ఆపరేషన్ భేడీయా’లో భాగంగా ఉచ్చులు, బోన్లు ఏర్పాటు చేయడంతోపాటు డ్రోన్ల సాయంతో వాటిని ట్రాక్ చేస్తున్నారు. థర్మల్ సెన్సార్ కెమెరాల సహాయంతో వాటిని గుర్తించడానికి అటవీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటిదాకా ఐదు తోడేళ్లను బంధించారు.