
పహల్గాం దాడికి పాల్పడింది ఉగ్రవాదులు. ఆ దాడికి మాకు ఏంసంబంధం అండి? ప్రాణాలు రక్షించుకునేందుకు చికిత్స కోసం పాక్ నుంచి వస్తున్నాం. ఇక్కడ మాకు స్థానికులు ఇచ్చే అతిథ్యం మా జీవితాల్లో మరిచిపోలేం. అలాంటిది అర్ధాంతరంగా వైద్యం మధ్యలో వెళ్లిపోమ్మనం బాధాకరంగా ఉంది. శిక్షించాల్సింది ఉగ్రవాదులను తప్ప.. ఏం తప్పు చేయని మమ్మల్ని ఎందుకు శిక్షిచడం. పాక్‌లో పుట్టడమే మేం చేసిన నేరమా? అంటూ పలువురు భావోద్వేగ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


















