
టి20 ప్రపంచకప్‌లో పెను సంచలనం... టోర్నీ 11వ మ్యాచ్‌లో ‘సూపర్ ఓవర్’ ద్వారా అనూహ్య ఫలితం వచ్చింది. తొలిసారి వరల్డ్ కప్ బరిలోకి దిగిన ఆతిథ్య అమెరికా జట్టు అద్భుతం చేసింది.

అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో సత్తా చాటి మాజీ చాంపియన్ పాకిస్తాన్‌ను చిత్తు చేసింది.

20 ఓవర్ల సమరంలో ఇరు జట్లు సమంగా నిలవడంతో ‘సూపర్ ఓవర్’ అనివార్యమైంది.





























