Monank Patel
-
మోనాంక్ పటేల్ సూపర్ సెంచరీ.. యూఎస్ఏ భారీ స్కోర్
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్ 2 మ్యాచ్‌ల్లో భాగంగా కెనడాతో ఇవాళ (ఆగస్ట్ 13) జరుగుతున్న మ్యాచ్‌లో యూఎస్ఏ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ.. మోనాంక్ పటేల్ సూపర్ సెంచరీతో (95 బంతుల్లో 121 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో స్మిత్ పటేల్ (63), షయాన్ జహంగీర్ (57 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. స్టీవెన్ టేలర్ 27, ఆరోన్ జోన్స్ 15, మిలింద్ కుమార్ 0 పరుగులకు ఔటయ్యారు. కెనడా బౌలర్లలో దిల్లన్ హేలిగర్, హర్ష్ థాకర్, సాద్ బిన్ జాఫర్, పర్గత్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. 305 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కెనడా.. 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఆరోన్ జాన్సన్ 42, ఆధిత్య వరదరాజన్ 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కెనడా గెలుపుకు 42 ఓవర్లలో ఇంకా 254 పరుగులు చేయాల్సి ఉంది. -
అక్షర్, బుమ్రాతో నేను కలిసి క్రికెట్ ఆడాను: అమెరికా కెప్టెన్
టీ20 వరల్డ్‌కప్-2024లో సంచలన విజయాలు నమోదు చేస్తున్న అమెరికా జట్టు ఇప్పుడు కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం న్యూయర్క్ వేదికగా పటిష్టమైన టీమిండియాను అమెరికా ఢీ కొట్టనుంది. పాక్‌పై విజయం సాధించి మంచి ఊపులో ఉన్న ఆతిథ్య అమెరికా.. భారత్‌పై కూడా సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది. టీమిండియాను అడ్డుకునేందుకు యూఎస్ఎ తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంది. ఈ క్రమంలో యూఎస్ఎ కెప్టెన్ మోనాంక్ పటేల్.. భారత ఆటగాళ్లు అక్షర్ పటేల్,జస్ప్రీత్ బుమ్రాతో తనకు ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అక్షర్ పటేల్ తను ఒకే పట్టణం నుంచి వచ్చామని మోనాంక్ పటేల్ తెలిపాడు."అండర్-19, అండర్-15 మ్యాచ్‌ల్లో గుజరాత్ తరపున అక్షర్ పటేల్, బుమ్రాతో కలిసి ఆడాను. అక్షర్, నేను ఒకే గ్రామం నుంచి క్రికెట్ కెరీర్ వైపు అడుగులు వేశాము. అక్షర్ మా ఊరిలో చాలా యువకులకు ఆదర్శంగా నిలిచాడు. అంతేకాకుండా వారికి క్రికెట్ వైపు అడుగులు వేసేందుకు అన్నిరకాలగా అక్షర్ మద్దతుగా నిలిచాడు. ఇప్పుడు బుమ్రా, అక్షర్ భారత జట్టులో కీలక ఆటగాళ్లగా కొనసాగుతుండటం చాలా సంతోషంగా ఉందని" ప్రీమ్యాచ్ కాన్ఫిరెన్స్‌లో మోనాంక్ పటేల్ పేర్కొన్నాడు. కాగా మోనాంక్ పటేల్ భారత సంతతికి చెందిన ఆటగాడు కావడం గమనార్హం.ఎవరీ మోనాంక్ పటేల్?31 ఏళ్ల మోనాంక్ పటేల్ గుజరాత్‌లోని ఆనంద్‌లో జన్మించాడు. మోనాంక్ పటేల్ భారత్ వేదికగానే క్రికెట్ వైపు అడుగులు వేశాడు. మోనాంక్ గుజరాత్ తరపున ఏజ్-గ్రూప్ క్రికెట్ ఆడాడు. అదే విధంగా గుజరాత్ అండర్-19 జట్టుకు కూడా పటేల్ ప్రాతినిథ్యం వహించాడు.ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్కు మకాం మార్చిన మోనాంక్.. ఆ దేశం తరపున ప్రొఫిషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. అతడు తొలిసారి టీ20 వరల్డ్‌కప్ అమెరికా క్వాలిఫైయర్స్ కోసం జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.క్వాలిఫైయర్స్ ఒమన్‌తో జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో మోనాంక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అక్కడ నుంచి పటేల్ వెనక్కి తిరిగి చూడలేదు. ఈ క్రమంలోనే స్టీవన్ టేలర్ నుంచి అమెరికా జట్టు పగ్గాలను మోనాంక్ పటేల్ సొంతం చేసుకున్నాడు. -
పాక్‌ను దెబ్బ కొట్టింది మనోళ్లే.. ఎవరీ నేత్రావల్కర్?
టీ20 వరల్డ్‌కప్-2024లో పెను సంచలనం నమోదైంది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న అమెరికా జట్టు పటిష్టమైన పాకిస్తాన్‌కు ఊహించని షాకిచ్చింది. ఈ మెగా టోర్నీలో భాగంగా డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై అమెరికా ఘన విజయం సాధించింది.సూపర్ ఓవర్‌కు దారితీసిన ఈ మ్యాచ్‌లో పాక్‌ను అమెరికా చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం 160 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ కు దిగిన అమెరికా మూడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్లో ఫలితాన్ని నిర్ణయించాల్సింది.సూపర్ ఓవర్లో అమెరికా అదుర్స్..సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా 18 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 1 వికెట్ కోల్పోయి 13 పరుగులు మాత్రమే చేసింది. పాకిస్తాన్ సూపర్ ఓవర్ వేసిన పేసర్ మహ్మద్ అమీర్ ఎక్స్‌ట్రాస్ రూపంలో ఏకంగా 7 పరుగులివ్వడం గమనార్హం. అనంతరం అమెరికా తరపున సూపర్ ఓవర్ బౌలింగ్ చేసిన సౌరభ్ నేత్రావల్కర్ కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు.పాక్‌ను దెబ్బ కొట్టింది మనోళ్లే..ఇక పాకిస్తాన్‌ను ఓడించిన అమెరికా జట్టులో భారత సంతతికి చెందిన ఆటగాళ్లు నలుగురు ఉండటం గమనార్హం. యూఎస్ఎ కెప్టెన్ మోనాంక్ పటేల్‌తో పాటు సౌరభ్ నేత్రావల్కర్, హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్ వంటి ఆటగాళ్లు భారత మూలాలు ఉన్న క్రికెటర్లే.అమెరికా విజయంలో మోనాంక్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. 160 పరుగుల లక్ష్య చేధనలో మోనాంక్ పటేల్(50) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు పేసర్ సౌరభ్ నేత్రావల్కర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. నేత్రావల్కర్ తన నాలుగు ఓవర్ల కోటాలో 18 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్‌కు పాకిస్తాన్ మ్యాచ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఇక అమెరికా విజయంలో కీలక పాత్ర పోషించిన మోనాంక్ పటేల్, సౌరభ్ నేత్రావల్కర్‌ల గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.ఎవరీ సౌరభ్ నేత్రావల్కర్?సౌరభ్ నేత్రావల్కర్ ముంబైలో జన్మించాడు. 32 ఏళ్ల సౌరభ్ 2010 అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుత భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్‌తో కలిసి నేత్రావల్కర్ ఆడాడు. అదే విధంగా దేశవాళీ క్రికెట్లో ముంబైకు నేత్రావల్కర్ ప్రాతినిథ్యం వహించాడు.క్రికెట్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఉద్యోగంపై దృష్టిసారించాడు. 2013లో ముంబై యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన సౌరభ్.. అనంతరం మాస్టర్స్ డిగ్రీ చేయడానికి అమెరికా వెళ్లాడు. 2016లో కార్నెల్ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ డ్రిగీ అందుకున్నాడు.ఆ తర్వాత ఒరాకిల్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టాడు. కానీ క్రికెట్‌పై మక్కువ మాత్రం నేత్రావల్కర్‌కు పోలేదు. జాబ్ చేస్తుండగానే గల్ఫ్ జెయింట్స్, సీపీఎల్‌లో గయానా అమెజాన్ వారియర్స్ తరపున ఆడేవాడు. అనంతరం అమెరికా దేశీవాళీ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తుండండంతో సీనియర్ జట్టులో చోటు దక్కింది. ఎవరీ మోనాంక్ పటేల్?31 ఏళ్ల మోనాంక్ పటేల్ గుజరాత్‌లోని ఆనంద్‌లో జన్మించాడు. మోనాంక్ పటేల్ భారత్ వేదికగానే క్రికెట్ వైపు అడుగులు వేశాడు. మోనాంక్ గుజరాత్ తరపున ఏజ్-గ్రూప్ క్రికెట్ ఆడాడు. అదే విధంగా గుజరాత్ అండర్-19 జట్టుకు కూడా పటేల్ ప్రాతినిథ్యం వహించాడు.ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్కు మకాం మార్చిన మోనాంక్.. ఆ దేశం తరపున ప్రొఫిషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. అతడు తొలిసారి టీ20 వరల్డ్‌కప్ అమెరికా క్వాలిఫైయర్స్ కోసం జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.క్వాలిఫైయర్స్ ఒమన్‌తో జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో మోనాంక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అక్కడ నుంచి పటేల్ వెనక్కి తిరిగి చూడలేదు. ఈ క్రమంలోనే స్టీవన్ టేలర్ నుంచి అమెరికా జట్టు పగ్గాలను మోనాంక్ పటేల్ సొంతం చేసుకున్నాడు. SAURABH NETRAVALKAR - THE MULTI TALENTED GUY! 🥶If being a software engineer at Oracle, defeating Pakistan wasn't enough, he has previously shared his videos on Instagram Playing Ukulele. 😄👌 pic.twitter.com/uIGWofSkPZ— Mufaddal Vohra (@mufaddal_vohra) June 6, 2024 -
T20 WC 2024 : సంచలనం..పాక్‌ను చిత్తు చేసిన అమెరికా (ఫొటోలు)
-
టీమిండియాతోనూ ఇలాగే ఆడతాం: యూఎస్ఏ కెప్టెన్
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా జట్టు అదరగొట్టింది. డలాస్ వేదికగా ఆదివారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) జరిగిన మ్యాచ్‌లో కెనడాను చిత్తుచేసి జయభేరి మోగించింది.వైస్ కెప్టెన్ ఆరోన్ జోన్స్ అద్భుత ప్రదర్శన కారణంగా ప్రత్యర్థిని ఏడు వికెట్ల తేడాతో ఓడించగలిగింది. మెగా టోర్నీ అరంగేట్రంలో తమ తొలి మ్యాచ్‌లోనే దూకుడుగా ఆడి.. విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో యూఎస్ఏ గెలుపుపై ఆ జట్టు కెప్టెన్ మొనాక్ పటేల్ స్పందించాడు.ప్రత్యర్థి పాకిస్తాన్ అయినా.. టీమిండియా అయినా‘‘ఆరోన్ జోన్స్ ఎలా ఆడాతాడో మా అందరికీ తెలుసు. ప్రత్యర్థి ఎవరైనా తను మాత్రం దూకుడుగానే ఆడతాడు. ఈరోజు ఇక్కడ మమ్మల్ని సపోర్టు చేయడానికి చాలా మంది వచ్చారు.టోర్నీలో ఇక ముందు కూడా వారందరూ(ప్రేక్షకులు) మాకు ఇలాగే మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నా. ఈ మెగా ఈవెంట్లో మున్ముందు కూడా మేము ఇలాగే ఫియర్లెస్ క్రికెట్ ఆడతాం.ప్రత్యర్థి పాకిస్తాన్ అయినా.. టీమిండియా అయినా మా ఆట తీరులో ఎలాంటి మార్పూ ఉండదు. దూకుడుగానే ముందుకువెళ్తాం’’ అని మొనాక్ పటేల్ చెప్పుకొచ్చాడు.గుజరాత్లో జన్మించిన మొనాక్ పటేల్ కాగా భారత్‌లోని గుజరాత్లో జన్మించిన మొనాక్ పటేల్ అమెరికాలో సెటిలయ్యాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 2019లో యూఎస్ఏ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.ఈ క్రమంలో కెప్టెన్‌గా ఎదిగి వరల్డ్‌కప్‌లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు మొనాక్ పటేల్. ఇక 31 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కెనడాతో మ్యాచ్‌లో తేలిపోయాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు 16 బంతులు ఎదుర్కొని కేవలం 16 పరుగులే చేశాడు. ఇదిలా ఉంటే.. ఇండియా, పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్‌లతో పాటు గ్రూప్-ఏలో ఉన్న యూఎస్ఏ తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్(జూన్ 6)తో తలపడనుంది.టీ20 ప్రపంచకప్-2024 అమెరికా వర్సెస్ కెనడా స్కోర్లు👉వేదిక: డలాస్👉టాస్:అమెరికా.. తొలుత బౌలింగ్👉కెనడా స్కోరు: 194/5 (20)👉అమెరికా స్కోరు: 197/3 (17.4)👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో కెనడాపై అమెరికా విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆరోన్ జోన్స్(40 బంతుల్లో 94 రన్స్, నాటౌట్).చదవండి: జీవితంలో కష్టాలు సహజం.. ఏదేమైనా వదిలిపెట్టను: హార్దిక్ పాండ్యా View this post on Instagram A post shared by ICC (@icc)