మోనాంక్‌ పటేల్‌ సూపర్‌ సెంచరీ.. యూఎస్‌ఏ భారీ స్కోర్‌ | USA Captain Monank Patel Slams Blasting Century Vs Canada In ICC Cricket World Cup League | Sakshi
Sakshi News home page

మోనాంక్‌ పటేల్‌ సూపర్‌ సెంచరీ.. యూఎస్‌ఏ భారీ స్కోర్‌

Published Tue, Aug 13 2024 7:28 PM | Last Updated on Tue, Aug 13 2024 7:46 PM

USA Captain Monank Patel Slams Blasting Century Vs Canada In ICC Cricket World Cup League

ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ లీగ్‌ 2 మ్యాచ్‌ల్లో భాగంగా కెనడాతో ఇవాళ (ఆగస్ట్‌ 13) జరుగుతున్న మ్యాచ్‌లో యూఎస్‌ఏ భారీ స్కోర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఎస్‌ఏ.. మోనాంక్‌ పటేల్‌ సూపర్‌ సెంచరీతో (95 బంతుల్లో 121 నాటౌట్‌; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. 

యూఎస్‌ఏ ఇన్నింగ్స్‌లో స్మిత్‌ పటేల్‌ (63), షయాన్‌ జహంగీర్‌ (57 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించగా.. స్టీవెన్‌ టేలర్‌ 27, ఆరోన్‌ జోన్స్‌ 15, మిలింద్‌ కుమార్‌ 0 పరుగులకు ఔటయ్యారు. కెనడా బౌలర్లలో దిల్లన్‌ హేలిగర్‌, హర్ష్‌ థాకర్‌, సాద్‌ బిన్‌ జాఫర్‌, పర్గత్‌ సింగ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 305 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కెనడా.. 8 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 51 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఆరోన్‌ జాన్సన్‌ 42, ఆధిత్య వరదరాజన్‌ 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కెనడా గెలుపుకు 42 ఓవర్లలో ఇంకా 254 పరుగులు చేయాల్సి ఉంది. 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement