టీ20 వరల్డ్‌కప్-2024లో సంచలన విజయాలు నమోదు చేస్తున్న అమెరికా జట్టు ఇప్పుడు కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం న్యూయర్క్ వేదికగా పటిష్టమైన టీమిండియాను అమెరికా ఢీ కొట్టనుంది.
పాక్‌పై విజయం సాధించి మంచి ఊపులో ఉన్న ఆతిథ్య అమెరికా.. భారత్‌పై కూడా సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది. టీమిండియాను అడ్డుకునేందుకు యూఎస్‌ఎ తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంది.
ఈ క్రమంలో యూఎస్‌ఎ కెప్టెన్ మోనాంక్ పటేల్.. భారత ఆటగాళ్లు అక్షర్ పటేల్,జస్ప్రీత్ బుమ్రాతో తనకు ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అక్షర్ పటేల్ తను ఒకే పట్టణం నుంచి వచ్చామని మోనాంక్ పటేల్ తెలిపాడు.
"అండర్-19, అండర్-15 మ్యాచ్‌ల్లో గుజరాత్ తరపున అక్షర్ పటేల్, బుమ్రాతో కలిసి ఆడాను. అక్షర్, నేను ఒకే గ్రామం నుంచి క్రికెట్ కెరీర్ వైపు అడుగులు వేశాము. అక్షర్ మా ఊరిలో చాలా యువకులకు ఆదర్శంగా నిలిచాడు.
అంతేకాకుండా వారికి క్రికెట్ వైపు అడుగులు వేసేందుకు అన్నిరకాలగా అక్షర్ మద్దతుగా నిలిచాడు. ఇప్పుడు బుమ్రా, అక్షర్ భారత జట్టులో కీలక ఆటగాళ్లగా కొనసాగుతుండటం చాలా సంతోషంగా ఉందని" ప్రీమ్యాచ్ కాన్ఫిరెన్స్‌లో మోనాంక్ పటేల్ పేర్కొన్నాడు. కాగా మోనాంక్ పటేల్ భారత సంతతికి చెందిన ఆటగాడు కావడం గమనార్హం.
ఎవరీ మోనాంక్ పటేల్?
31 ఏళ్ల మోనాంక్ పటేల్ గుజరాత్‌లోని ఆనంద్‌లో జన్మించాడు. మోనాంక్ పటేల్ భారత్ వేదికగానే క్రికెట్ వైపు అడుగులు వేశాడు. మోనాంక్ గుజరాత్ తరపున ఏజ్-గ్రూప్ క్రికెట్ ఆడాడు. అదే విధంగా గుజరాత్ అండర్-19 జట్టుకు కూడా పటేల్ ప్రాతినిథ్యం వహించాడు.
ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్‌కు మకాం మార్చిన మోనాంక్.. ఆ దేశం తరపున ప్రొఫిషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. అతడు తొలిసారి టీ20 వరల్డ్‌కప్ అమెరికా క్వాలిఫైయర్స్ కోసం జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
క్వాలిఫైయర్స్ ఒమన్‌తో జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో మోనాంక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అక్కడ నుంచి పటేల్ వెనక్కి తిరిగి చూడలేదు. ఈ క్రమంలోనే స్టీవన్ టేలర్ నుంచి అమెరికా జట్టు పగ్గాలను మోనాంక్ పటేల్ సొంతం చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment