టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా జట్టు అదరగొట్టింది. డలాస్ వేదికగా ఆదివారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) జరిగిన మ్యాచ్‌లో కెనడాను చిత్తుచేసి జయభేరి మోగించింది.
వైస్ కెప్టెన్ ఆరోన్ జోన్స్ అద్భుత ప్రదర్శన కారణంగా ప్రత్యర్థిని ఏడు వికెట్ల తేడాతో ఓడించగలిగింది. మెగా టోర్నీ అరంగేట్రంలో తమ తొలి మ్యాచ్‌లోనే దూకుడుగా ఆడి.. విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో యూఎస్‌ఏ గెలుపుపై ఆ జట్టు కెప్టెన్ మొనాక్ పటేల్ స్పందించాడు.
ప్రత్యర్థి పాకిస్తాన్ అయినా.. టీమిండియా అయినా
‘‘ఆరోన్ జోన్స్ ఎలా ఆడాతాడో మా అందరికీ తెలుసు. ప్రత్యర్థి ఎవరైనా తను మాత్రం దూకుడుగానే ఆడతాడు. ఈరోజు ఇక్కడ మమ్మల్ని సపోర్టు చేయడానికి చాలా మంది వచ్చారు.
టోర్నీలో ఇక ముందు కూడా వారందరూ(ప్రేక్షకులు) మాకు ఇలాగే మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నా. ఈ మెగా ఈవెంట్లో మున్ముందు కూడా మేము ఇలాగే ఫియర్‌లెస్ క్రికెట్ ఆడతాం.
ప్రత్యర్థి పాకిస్తాన్ అయినా.. టీమిండియా అయినా మా ఆట తీరులో ఎలాంటి మార్పూ ఉండదు. దూకుడుగానే ముందుకువెళ్తాం’’ అని మొనాక్ పటేల్ చెప్పుకొచ్చాడు.
గుజరాత్‌లో జన్మించిన మొనాక్ పటేల్
కాగా భారత్‌లోని గుజరాత్‌లో జన్మించిన మొనాక్ పటేల్ అమెరికాలో సెటిలయ్యాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 2019లో యూఎస్‌ఏ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.
ఈ క్రమంలో కెప్టెన్‌గా ఎదిగి వరల్డ్‌కప్‌లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు మొనాక్ పటేల్. ఇక 31 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కెనడాతో మ్యాచ్‌లో తేలిపోయాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు 16 బంతులు ఎదుర్కొని కేవలం 16 పరుగులే చేశాడు.
ఇదిలా ఉంటే.. ఇండియా, పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్‌లతో పాటు గ్రూప్-ఏలో ఉన్న యూఎస్‌ఏ తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్(జూన్ 6)తో తలపడనుంది.
టీ20 ప్రపంచకప్-2024 అమెరికా వర్సెస్ కెనడా స్కోర్లు
👉వేదిక: డలాస్
👉టాస్:అమెరికా.. తొలుత బౌలింగ్
👉కెనడా స్కోరు: 194/5 (20)
👉అమెరికా స్కోరు: 197/3 (17.4)
👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో కెనడాపై అమెరికా విజయం
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆరోన్ జోన్స్(40 బంతుల్లో 94 రన్స్, నాటౌట్).
చదవండి: జీవితంలో కష్టాలు సహజం.. ఏదేమైనా వదిలిపెట్టను: హార్దిక్ పాండ్యా
Comments
Please login to add a commentAdd a comment