Aaron Jones
-
దంచికొట్టిన రోస్టన్, జోన్స్.. కింగ్స్‌దే సీపీఎల్ టైటిల్
కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)-2024 చాంపియన్‌గా సెయింట్ లూసియా కింగ్స్ జట్టు అవతరించింది. గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగిన ఫైనల్లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. లూసియా కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ రోస్టన్ ఛేజ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.ఆకట్టుకోలేకపోయిన బ్యాటర్లుగయానా వేదికగా.. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున సెయింట్ లూసియా కింగ్స్- గయానా అమెజాన్ వారియర్స్ మధ్య సీపీఎల్ టైటిల్ పోరు జరిగింది. టాస్ గెలిచిన కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది.దెబ్బ కొట్టిన నూర్ అహ్మద్వారియర్స్ బ్యాటర్లలో టెయిలెండర్ ప్రిటోరియస్ 25 పరుగులతో టాప్ స్కోర్‌గా నిలవడం గమనార్హం. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ షాయీ హోప్ 22 పరుగులు సాధించాడు. ఇక కింగ్స్ బౌలర్లలో స్పిన్నర్ నూర్ అహ్మద్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 19 పరుగులే ఇచ్చి.. మూడు వికెట్లు కూల్చాడు.ఓపెనర్ మొయిన్ అలీ(14), హిట్టర్ షిమ్రన్ హెట్మెయిర్(11) రూపంలో కీలక వికెట్లు తీసి.. వారియర్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బకొట్టాడు. కింగ్స్ జట్టులోని మిగిలిన బౌలర్లలో ఖారీ పియరీ, మాథ్యూ ఫోర్డ్, అల్జారీ జోసెఫ్, రోస్టన్ ఛేజ్, డేవిడ్ వీస్ ఒక్కో వికెట్ పడగొట్టారు.దంచికొట్టిన రోస్టన్, జోన్స్ఇక వారియర్స్ విధించిన నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ లూసియా కింఘ్స్ 18.1 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. టాపార్డర్ విఫలమైనా మిడిలార్డర్ దంచికొట్టడంతో విజయం సాధ్యమైంది. ఓపెనర్లలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(21) ఫర్వాలేదనిపించగా.. జాన్సన్ చార్ల్స్(7) నిరాశపరిచాడు. వన్‌డౌన్ బ్యాటర్ టిమ్ సిఫార్ట్ 10 బంతులు ఎదుర్కొని మూడు పరుగులే చేశాడు.ఇలాంటి దశలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రోస్టన్ ఛేజ్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 39 పరుగులతో దుమ్ములేపాడు. ఐదో స్థానంలో వచ్చిన ఆరోన్ జోన్స్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది 48 రన్స్ చేశాడు. ఇద్దరూ కలిసి అజేయంగా నిలిచి.. లూసియా కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చారు. PC: SLK Xవిజేతల జాబితా ఇదేకాగా సీపీఎల్‌లో లూసియా కింగ్స్‌కు ఇదే మొట్టమొదటి టైటిల్. ఇక 2013లో వెస్టిండీస్ వేదికగా మొదలైన ఈ టీ20 టోర్నీలో జమైకా తలైవాస్ అరంగేట్ర విజేతగా నిలిచింది. తర్వాత వరుసగా బార్బడోస్ ట్రిడెంట్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో రెడ్‌స్టీల్, జమైకా తలైవాస్, ట్రింబాగో నైట్ రైడర్స్, ట్రింబాగో నైట్ రైడర్స్, బార్బడోస్ ట్రిడెంట్స్, ట్రింబాగో నైట్ రైడర్స్, సెయింట కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్, జమైకా తలైవాస్, గయానా అమెజాన్ వారియర్స్.. తాజాగా సెయింట్ లూసియా కింగ్స్ ట్రోఫీలు కైవసం చేసుకున్నాయి.చదవండి: నేను అలా బౌలింగ్ చేయడానికి కారణం వారే: మయాంక్ యాదవ్ The wait is over 🙌 The Saint Lucia Kings are CPL Champions 🇱🇨🏆#CPL24 #CPLFinals #SLKvGAW #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/nqVbnilsAH— CPL T20 (@CPL) October 7, 2024 -
T20 World Cup 2024: క్రిస్ జోర్డన్ హ్యాట్రిక్.. 6 బంతుల్లో 5 వికెట్లు
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇవాళ (జూన్ 23) జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో యూఎస్ఏ-ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. యూఎస్ఏను 115 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డన్ హ్యాట్రిక్ వికెట్లతో (2.5-0-10-4) చెలరేగాడు. యూఎస్ఏ చివరి 5 వికెట్లను 6 బంతుల వ్యవధిలో (W, W, 0,W, W, W) కోల్పోయింది. జోర్డన్ ఒకే ఓవర్లో 4 వికెట్లు తీశాడు, జోర్డన్ తీసిన హ్యాట్రిక్ ఇవాళ రెండవది. ఉదయం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్ కమిన్స్ ఆఫ్ఘనిస్తాన్పై హ్యాట్రిక్ సాధించాడు. ఇది అతనికి వరుసగా రెండో మ్యాచ్‌లో రెండో హ్యాట్రిక్. యూఎస్ఏతో మ్యాచ్‌లో జోర్డన్‌తో పాటు ఆదిల్ రషీద్ (4-0-13-2), సామ్ కర్రన్ (2-0-23-2), రీస్ టాప్లే (3-0-29-1) సత్తా చాటారు. యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో నితీశ్ కుమార్ (30) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కోరె ఆండర్సన్ (29), హర్మీత్ సింగ్ (21), స్టీవ్ టేలర్ (12), ఆరోన్ జోన్స్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో చివరి ముగ్గురు ఆటగాళ్లు డకౌటయ్యారు. -
T20 World Cup 2024: ఇంగ్లండ్-యూఎస్ఏ మ్యాచ్.. తుది జట్లు ఇవే..!
టీ20 వరల్డ్‌కప్ 2024లో ఇవాళ (జూన్ 23) ఓ ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. సూపర్-8 గ్రూప్-2లో భాగంగా జరిగే మ్యాచ్‌లో సంచలనాల యూఎస్ఏను డిఫెండింగ్ ఛాంసియన్ ఇంగ్లండ్ ఢీకొట్టనుంది. బార్బడోస్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం యూఎస్ఏ ఎలాంటి మార్పులు చేయకపోగా.. ఇంగ్లండ్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. మార్క్ వుడ్ స్థానంలో క్రిస్ జోర్డన్ తుది జట్టులోకి వచ్చాడు.కాగా, గ్రూప్ దశలో పాక్ లాంటి పటిష్ట జట్టుకు షాకిచ్చిన యూఎస్ఏ.. సూపర్-8లో పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సెమీస్ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. మరోవైపు ఇంగ్లండ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ గెలుపు, ఓ అపజయంతో గ్రూప్-2 నుంచి విండీస్‌తో పాటు సెమీస్ రేసులో ఉంది.తుది జట్లు..యునైటెడ్ స్టేట్స్: స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్(వికెట్‌కీపర్), నితీష్ కుమార్, ఆరోన్ జోన్స్(కెప్టెన్), కోరీ అండర్సన్, మిలింద్ కుమార్, హర్మీత్ సింగ్, షాడ్లీ వాన్ షాల్క్విక్, నోస్తుష్ కెంజిగే, అలీ ఖాన్, సౌరభ్ నేత్రవల్కర్ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కెప్టెన్/వికెట్‌కీపర్), జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ -
టీ20 వరల్డ్‌కప్‌లో నేటి (జూన్ 23) మ్యాచ్.. సంచలనాల యూఎస్ఏతో డిఫెండింగ్ ఛాంపియన్ 'ఢీ'
టీ20 వరల్డ్‌కప్ 2024లో ఇవాళ (జూన్ 23) ఓ ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. సూపర్-8 గ్రూప్-2లో భాగంగా జరిగే మ్యాచ్‌లో సంచలనాల యూఎస్ఏను డిఫెండింగ్ ఛాంసియన్ ఇంగ్లండ్ ఢీకొట్టనుంది. బార్బడోస్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.గ్రూప్ దశలో పాక్ లాంటి పటిష్ట జట్టుకు షాకిచ్చిన యూఎస్ఏ.. సూపర్-8లో పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సెమీస్ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. మరోవైపు ఇంగ్లండ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ గెలుపు, ఓ అపజయంతో గ్రూప్-2 నుంచి విండీస్‌తో పాటు సెమీస్ రేసులో ఉంది. గ్రూప్-2లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన సౌతాఫ్రికా సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది.పొట్టి ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, యూఎస్ఏ జట్లు తలపడటం ఇదే మొదటిసారి. ఇరు జట్ల బలాబలాల బట్టి చూస్తే.. యూఎస్ఏపై ఇంగ్లండ్‌కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. బార్బడోస్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి ఈ పిచ్‌పై ఇంగ్లండ్ బ్యాటర్లు చెలరేగిపోవచ్చు. మరోవైపు యూఎస్ఏ కూడా తక్కువ అంచనా వేయడాలనికి వీళ్లేదు. ఆ జట్టు కూడా బ్యాటింగ్‌లో పటిష్టంగా ఉంది. పాక్ లాంటి జట్టుకు షాకిచ్చిన యూఎస్‌ను ఇంగ్లండ్ తక్కవ అంచనా వేయదు. యూఎస్ అమ్ములపొదిలో డాషింగ్ బ్యాటర్లతో సంచలన పేసర్ సౌరభ్ నేత్రావల్కర్ ఉన్నాడు. నేత్రావల్కర్ చెలరేగితే ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పకపోవచ్చు.తుది జట్లు..యూఎస్ఏ: స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్ (వికెట్‌కీపర్), నితీష్ కుమార్, ఆరోన్ జోన్స్ (కెప్టెన్), కోరీ అండర్సన్, మిలింద్ కుమార్, హర్మీత్ సింగ్, నిసర్గ్ పటేల్, నోస్తుష్ కెంజిగే, అలీ ఖాన్, సౌరభ్ నేత్రావల్కర్ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (కెప్టెన్/వికెట్‌కీపర్), జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లీ -
T20 WC 2024: టీ20 వరల్డ్‌కప్‌లో అత్యంత చెత్త రికార్డు..
టీ20 వరల్డ్‌కప్-2024ను కెనడా ఓటమితో ప్రారంభించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా టెక్సాస్ వేదికగా యునైటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కెనడా ఓటమి పాలైంది. 195 పరుగుల లక్ష్యాన్ని కెనడా బౌలర్లు కాపాడుకోలేకపోయారు.అమెరికా జట్టు 17.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. అమెరికా మిడిలార్డర్ బ్యాటర్లు ఆండ్రీస్ గౌస్(65), ఆరోన్ జోన్స్(94 నాటౌట్) మెరుపు అర్ధ సెంచరీలతో తమ జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించారు.చెత్త రికార్డు..ఈ మ్యాచ్‌లో కెనడా ఫాస్ట్ బౌలర్ జెరెమీ గోర్డాన్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. జెరెమీ గోర్డాన్‌ను ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్ ఊచకోత కోశారు. తొలి స్పెల్‌లో రెండు ఓవర్లు వేసిన జోర్డాన్ అద్బుతంగా బౌలింగ్ చేసి కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కానీ రెండో స్పెల్‌లో మాత్రం జోర్డాన్ పూర్తిగా తేలిపోయాడు.యూఎస్ఎ ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన జోర్డాన్.. ఏకంగా 33 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్లో జోర్డాన్ రెండు నో బాల్స్, రెండు వైడ్స్‌తో సహా 3 సిక్స్‌లు, రెండు బౌండరీలు ఇచ్చాడు. తద్వారా టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులిచ్చిన రెండో బౌలర్‌గా గోర్డాన్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు అఫ్గానిస్తాన్ బౌలర్ ఇజ్రాతుల్లా దౌలత్‌జాయ్ పేరిట ఉండేది.2012 పొట్టి ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై దౌలత్‌జాయ్ ఒకే ఓవర్లో 32 పరుగులిచ్చాడు. ఇక ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. అగ్రస్ధానంలో ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ వరుసగా 6 సిక్స్‌లు బాది 36 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్‌లో గోర్డాన్ మరో 4 పరుగులిచ్చి ఉంటే బ్రాడ్‌ను అధిగిమించేవాడు. -
టీమిండియాతోనూ ఇలాగే ఆడతాం: యూఎస్ఏ కెప్టెన్
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా జట్టు అదరగొట్టింది. డలాస్ వేదికగా ఆదివారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) జరిగిన మ్యాచ్‌లో కెనడాను చిత్తుచేసి జయభేరి మోగించింది.వైస్ కెప్టెన్ ఆరోన్ జోన్స్ అద్భుత ప్రదర్శన కారణంగా ప్రత్యర్థిని ఏడు వికెట్ల తేడాతో ఓడించగలిగింది. మెగా టోర్నీ అరంగేట్రంలో తమ తొలి మ్యాచ్‌లోనే దూకుడుగా ఆడి.. విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో యూఎస్ఏ గెలుపుపై ఆ జట్టు కెప్టెన్ మొనాక్ పటేల్ స్పందించాడు.ప్రత్యర్థి పాకిస్తాన్ అయినా.. టీమిండియా అయినా‘‘ఆరోన్ జోన్స్ ఎలా ఆడాతాడో మా అందరికీ తెలుసు. ప్రత్యర్థి ఎవరైనా తను మాత్రం దూకుడుగానే ఆడతాడు. ఈరోజు ఇక్కడ మమ్మల్ని సపోర్టు చేయడానికి చాలా మంది వచ్చారు.టోర్నీలో ఇక ముందు కూడా వారందరూ(ప్రేక్షకులు) మాకు ఇలాగే మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నా. ఈ మెగా ఈవెంట్లో మున్ముందు కూడా మేము ఇలాగే ఫియర్లెస్ క్రికెట్ ఆడతాం.ప్రత్యర్థి పాకిస్తాన్ అయినా.. టీమిండియా అయినా మా ఆట తీరులో ఎలాంటి మార్పూ ఉండదు. దూకుడుగానే ముందుకువెళ్తాం’’ అని మొనాక్ పటేల్ చెప్పుకొచ్చాడు.గుజరాత్లో జన్మించిన మొనాక్ పటేల్ కాగా భారత్‌లోని గుజరాత్లో జన్మించిన మొనాక్ పటేల్ అమెరికాలో సెటిలయ్యాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 2019లో యూఎస్ఏ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.ఈ క్రమంలో కెప్టెన్‌గా ఎదిగి వరల్డ్‌కప్‌లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు మొనాక్ పటేల్. ఇక 31 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కెనడాతో మ్యాచ్‌లో తేలిపోయాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు 16 బంతులు ఎదుర్కొని కేవలం 16 పరుగులే చేశాడు. ఇదిలా ఉంటే.. ఇండియా, పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్‌లతో పాటు గ్రూప్-ఏలో ఉన్న యూఎస్ఏ తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్(జూన్ 6)తో తలపడనుంది.టీ20 ప్రపంచకప్-2024 అమెరికా వర్సెస్ కెనడా స్కోర్లు👉వేదిక: డలాస్👉టాస్:అమెరికా.. తొలుత బౌలింగ్👉కెనడా స్కోరు: 194/5 (20)👉అమెరికా స్కోరు: 197/3 (17.4)👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో కెనడాపై అమెరికా విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆరోన్ జోన్స్(40 బంతుల్లో 94 రన్స్, నాటౌట్).చదవండి: జీవితంలో కష్టాలు సహజం.. ఏదేమైనా వదిలిపెట్టను: హార్దిక్ పాండ్యా View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 WC: సిక్సర్ల సునామీ.. క్రిస్ గేల్ తర్వాత ఒకే ఒక్కడు!
టీ20 ప్రపంచకప్-2024లో యునైటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టు శుభారంభం చేసింది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ ఆరంభ మ్యాచ్‌లో కెనడాపై సంచలన విజయం సాధించింది.డలాస్ వేదికగా ఆదివారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) జరిగిన ఈ మ్యాచ్‌లో కెనడాను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. అంతర్జాతీయ టీ20లలో తమ అత్యధిక పరుగుల ఛేదనను నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. View this post on Instagram A post shared by ICC (@icc)ఇక ఈ విజయంలో యూఎస్ఏ వైస్ కెప్టెన్ ఆరోన్ జోన్స్దే కీలక పాత్ర. కెనడా విధించిన 195 పరుగుల లక్ష్య ఛేదనలో అమెరికా జట్టు ఆరంభంలోనే తడబడింది. స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లు స్టీవెన్ టేలర్(0), కెప్టెన్ మొనాక్ పటేల్(16) వికెట్లు కోల్పోయింది.ఆరోన్ జోన్స్ సంచలన ఇన్నింగ్స్ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ ఆండ్రీస్ గౌస్(46 బంతుల్లో 65)తో కలిసి ఆరోన్ జోన్స్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 40 బంతుల్లోనే 94 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక స్ట్రైకురేటు 235తో ఈ మేరకు పరుగుల విధ్వంసం సృష్టించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లతో పాటు ఏకంగా పది సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఆరోన్ జోన్స్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) క్రిస్ గేల్ తర్వాత ఒకే ఒక్కడు!యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ తర్వాత టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో క్రికెటర్‌గా ఆరోన్ జోన్స్ చరిత్రకెక్కాడు. కాగా యూఎస్ఏ విజయంలో కీలక పాత్ర పోషించి.. తొమ్మిదో ఎడిషన్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న తొలి ఆటగాడిగానూ నిలిచాడు.టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు👉క్రిస్ గేల్- 11- ఇంగ్లండ్ మీద- 2016లో..👉క్రిస్ గేల్- 10- సౌతాఫ్రికా మీద- 2007లో..👉ఆరోన్ జోన్స్- 10- కెనడా మీద- 2024లో..👉రిలీ రొసోవ్- 8- బంగ్లాదేశ్ మీద- 2022లో. View this post on Instagram A post shared by ICC (@icc)చదవండి: జీవితంలో కష్టాలు సహజం.. ఏదేమైనా వదిలిపెట్టను: హార్దిక్ పాండ్యా -
T20WC2024 USA vs Canada Highlights: కెనడా జట్టుపై అమెరికా సంచలన విజయం (ఫొటోలు)
-
T20 WC 2024: అమెరికా ధనాధన్...
డాలస్: అమెరికా ఆతిథ్య హోదాలో ఆడిందంతే! టి20 ప్రపంచకప్ ఆడే సత్తా ఆ జట్టుకెక్కడిది అని తేలిగ్గా తీసిపారేసే వారికి మెగా మెరుపులతో టోర్నీకే గొప్ప ఆరంభం ఇచ్చింది అమెరికా. రెండు కొత్త జట్లు (కెనడా, అమెరికా) ప్రపంచకప్‌లో ఆడటం తొలిసారే అయినా... ధనాధన్ షోతో సిసలైన క్రికెట్ వినోదాన్ని పంచాయి. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన గ్రూప్ ‘ఎ’ మొదటి మ్యాచ్‌లో అమెరికా 7 వికెట్ల తేడాతో కెనడాపై ఘనవిజయం సాధించింది.టాస్ నెగ్గిన అమెరికా ఫీల్డింగ్ ఎంచుకోగా, ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్ నవ్‌నీత్ ధలివాల్ (44 బంతుల్లో 61; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), నికోలస్ కిర్టన్ (31 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. శ్రేయస్ మొవ్వ (16 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆరోన్ జాన్సన్ (16 బంతుల్లో 23; 5 ఫోర్లు) ధాటిగా ఆడారు. అలీఖాన్, హర్మిత్ సింగ్, కోరె అండర్సన్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యాన్ని అమెరికా 17.4 ఓవర్లలోనే మూడే వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసి ఛేదించింది. జట్టు ఖాతా తెరువకముందే స్టీవెన్ టేలర్ (0) డకౌటయ్యాడు. మరో ఓపెనర్, కెపె్టన్ మోనంక్ పటేల్ (16) తక్కువే చేశాడు. 42/2 స్కోరు వద్ద కష్టాల్లో ఉన్న అమెరికాను ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆరోన్ జోన్స్ (40 బంతుల్లో 94 నాటౌట్; 4 ఫోర్లు, 10 సిక్స్‌లు) అసాధారణ బ్యాటింగ్‌తో గెలిపించాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడిన జోన్స్... మూడో వికెట్‌కు ఆండ్రీస్ గౌస్ (46 బంతుల్లో 65; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి 131 పరుగులు జోడించి విజయాన్ని ఖాయం చేశాడు. ఈ క్రమంలో ఆరోన్ 22 బంతుల్లో, గౌస్ 39 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. 16వ ఓవర్లో 173 పరుగుల వద్ద ఆండ్రీస్ నిష్క్రమించగా... మరో రెండు ఓవర్లలోనే కోరె అండర్సన్ (3 నాటౌట్)తో కలిసి ఆరోన్ జోన్స్ 14 బంతులు మిగిలుండగానే అమెరికాను గెలిపించాడు. అమెరికా తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 6న పాకిస్తాన్ జట్టుతో, కెనడా తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 7న ఐర్లాండ్‌తో ఆడతాయి. టి20 ప్రపంచకప్‌లో నేడునమీబియా X ఒమన్‌వేదిక: బ్రిడ్జ్‌టౌన్; ఉదయం గం. 6 నుంచిశ్రీలంక X దక్షిణాఫ్రికా వేదిక: న్యూయార్క్; రాత్రి గం. 8 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారంచదవండి: ICC ODI Player Of The Year: అవార్డు అందుకున్న కోహ్లి.. వీడియో వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc)