T20 World Cup 2024: ఇంగ్లండ్‌-యూఎస్‌ఏ మ్యాచ్‌.. తుది జట్లు ఇవే..! | T20 World Cup 2024: England Won The Toss And Chose Bowl Against US, Here Are Playing XI | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: ఇంగ్లండ్‌-యూఎస్‌ఏ మ్యాచ్‌.. తుది జట్లు ఇవే..!

Published Sun, Jun 23 2024 8:00 PM | Last Updated on Sun, Jun 23 2024 8:00 PM

T20 World Cup 2024: England Won The Toss And Chose Bowl Against US, Here Are Playing XI

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో ఇవాళ (జూన్‌ 23) ఓ ఆసక్తికర మ్యాచ్‌ జరుగనుంది. సూపర్‌-8 గ్రూప్‌-2లో భాగంగా జరిగే మ్యాచ్‌లో సంచలనాల యూఎస్‌ఏను డిఫెండింగ్‌ ఛాంసియన్‌ ఇంగ్లండ్‌ ఢీకొట్టనుంది. బార్బడోస్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రార​ంభమవుతుంది. 

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం యూఎస్‌ఏ ఎలాంటి మార్పులు చేయకపోగా.. ఇంగ్లండ్‌ ఓ మార్పుతో బరిలోకి దిగింది. ‍మార్క్‌ వుడ్‌ స్థానంలో క్రిస్‌ జోర్డన్‌ తుది జట్టులోకి వచ్చాడు.

కాగా, గ్రూప్‌ దశలో పాక్‌ లాంటి పటిష్ట జట్టుకు షాకిచ్చిన యూఎస్‌ఏ.. సూపర్‌-8లో పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సెమీస్‌ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. మరోవైపు ఇంగ్లండ్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ గెలుపు, ఓ అపజయంతో గ్రూప్‌-2 నుంచి విండీస్‌తో పాటు సెమీస్‌ రేసులో ఉంది.

తుది జట్లు..

యునైటెడ్ స్టేట్స్: స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్(వికెట్‌కీపర్‌), నితీష్ కుమార్, ఆరోన్ జోన్స్(కెప్టెన్‌), కోరీ అండర్సన్, మిలింద్ కుమార్, హర్మీత్ సింగ్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, నోస్తుష్ కెంజిగే, అలీ ఖాన్, సౌరభ్ నేత్రవల్కర్

ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement