టీ20 వరల్డ్‌కప్ 2024లో ఇవాళ (జూన్ 23) ఓ ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. సూపర్-8 గ్రూప్-2లో భాగంగా జరిగే మ్యాచ్‌లో సంచలనాల యూఎస్‌ఏను డిఫెండింగ్ ఛాంసియన్ ఇంగ్లండ్ ఢీకొట్టనుంది. బార్బడోస్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.
గ్రూప్ దశలో పాక్ లాంటి పటిష్ట జట్టుకు షాకిచ్చిన యూఎస్‌ఏ.. సూపర్-8లో పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సెమీస్ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. మరోవైపు ఇంగ్లండ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ గెలుపు, ఓ అపజయంతో గ్రూప్-2 నుంచి విండీస్‌తో పాటు సెమీస్ రేసులో ఉంది. గ్రూప్-2లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన సౌతాఫ్రికా సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది.
పొట్టి ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, యూఎస్‌ఏ జట్లు తలపడటం ఇదే మొదటిసారి. ఇరు జట్ల బలాబలాల బట్టి చూస్తే.. యూఎస్‌ఏపై ఇంగ్లండ్‌కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. బార్బడోస్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి ఈ పిచ్‌పై ఇంగ్లండ్ బ్యాటర్లు చెలరేగిపోవచ్చు.
మరోవైపు యూఎస్‌ఏ కూడా తక్కువ అంచనా వేయడాలనికి వీళ్లేదు. ఆ జట్టు కూడా బ్యాటింగ్‌లో పటిష్టంగా ఉంది. పాక్ లాంటి జట్టుకు షాకిచ్చిన యూఎస్‌ను ఇంగ్లండ్ తక్కవ అంచనా వేయదు. యూఎస్ అమ్ములపొదిలో డాషింగ్ బ్యాటర్లతో సంచలన పేసర్ సౌరభ్ నేత్రావల్కర్ ఉన్నాడు. నేత్రావల్కర్ చెలరేగితే ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పకపోవచ్చు.
తుది జట్లు..
యూఎస్‌ఏ: స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్ (వికెట్‌కీపర్), నితీష్ కుమార్, ఆరోన్ జోన్స్ (కెప్టెన్), కోరీ అండర్సన్, మిలింద్ కుమార్, హర్మీత్ సింగ్, నిసర్గ్ పటేల్, నోస్తుష్ కెంజిగే, అలీ ఖాన్, సౌరభ్ నేత్రావల్కర్
ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (కెప్టెన్/వికెట్‌కీపర్), జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లీ
Comments
Please login to add a commentAdd a comment