టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా భారత్ ఆడబోయే తదుపరి మ్యాచ్ భారీ వర్షాల కారణంగా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ 15న భారత్.. కెనడాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు వేదిక అయిన ఫ్లోరిడాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ అమల్లో ఉంది. మరో నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుందని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
ఫ్లోరిడాలో భారత్-కెనడా మ్యాచ్‌తో పాటు మరో రెండు కీలక మ్యాచ్‌లు జరుగనున్నాయి. జూన్ 14న యూఎస్‌ఏ-ఐర్లాండ్.. జూన్ 16న ఐర్లాండ్-పాకిస్తాన్ జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్-ఏ నుంచి సూపర్-8కు చేరే క్రమంలో యూఎస్‌ఏ, పాకిస్తాన్‌లకు ఈ మ్యాచ్‌లు చాలా కీలకం.
The conditions in Florida is really
Bad right now.
- India vs Canada.
- Pakistan vs Ireland.
- USA vs Ireland.
- All 3 games will be played in Florida in this T20 World Cup 2024.pic.twitter.com/0g1zhWOzEZ— Tanuj Singh (@ImTanujSingh) June 13, 2024
ఇలా జరిగినా పాక్ ఇంటికే..
జూన్ 14న యూఎస్‌ఏ-ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే పాకిస్తాన్ అధికారికంగా గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఎందుకంటే.. అమెరికా ఖాతాలో ఇప్పటికే నాలుగు పాయింట్లు ఉన్నాయి. ఐర్లాండ్‌తో మ్యాచ్ రద్దైతే ఆ జట్టు ఖాతాలో మరో పాయింట్ చేరి మొత్తంగా ఐదు పాయింట్లు అవుతాయి.
మరోవైపు.. పాక్ ఖాతాలో ప్రస్తుతం రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ రద్దైతే.. పాక్ తదుపరి ఆడబోయే మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఓడించినా ఫలితం ఉండదు. ఆ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు మాత్రమే ఉంటాయి. అప్పుడు యూఎస్‌ఏ.. భారత్‌తో పాటు గ్రూప్-ఏ నుంచి సూపర్-8కు అర్హత సాధిస్తుంది. భారత్ ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి సూపర్-8కు క్వాలిఫై అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment