టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో ఇప్పటికే సూపర్-8కు చేరుకున్న టీమిండియా.. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్‌కు సిద్దమైంది. గ్రూప్-ఏలో తమకు మిగిలి ఉన్న నామమాత్రపు మ్యాచ్‌లో కెనడాతో ఫ్లోరిడా వేదికగా శనివారం రాత్రి తలపడనుంది.
కాగా ఫ్లోరిడాలోని లాడెర్‌హిల్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాటి అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ రద్దైంది. ఫలితంగా పాయింట్ల పరంగా మెరుగైన స్థితిలో ఉన్న అమెరికా సూపర్-8కు చేరగా.. పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఇక టీమిండియా- కెనడా మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దైపోయినా రోహిత్ సేనకు ఎలాంటి నష్టం లేదు. అదే విధంగా.. ఇప్పటికే రేసు నుంచి నిష్క్రమించిన కెనడాపై కూడా ఇంకెలాంటి ప్రభావం ఉండదు.
ఆ ఇద్దరు అవుట్!
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ జరిగితే మాత్రం టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రవీంద్ర జడేజా స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తుదిజట్టులో ఆడించాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
అదే విధంగా.. శివం దూబే స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా అమెరికాలో జరుగుతున్న టీమిండియా లీగ్ దశ మ్యాచ్‌లలో జడ్డూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
గత మ్యాచ్(అమెరికాతో)లో అతడికి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. మరోవైపు.. వికెట్ కీపర్ కోటాలో మూడు మ్యాచ్‌లు ఆడే ఛాన్స్ కొట్టేసిన రిషభ్ పంత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని జట్టులో తన స్థానం పదిలం చేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో.. మరో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూకు ఒక్క అవకాశం కూడా రాలేదు. అయితే, సూపర్-8కు ముందు అతడికి కెనడాతో మ్యాచ్‌లో ఛాన్స్ ఇస్తే.. ప్రాక్టీస్ దొరుకుతుందని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో శివం దూబే స్థానంలో సంజూను ఆడించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదే విధంగా.. వెస్టిండీస్‌లో సూపర్-8 మ్యాచ్‌ల నేపథ్యంలో.. కుల్దీప్ యాదవ్‌కు కూడా అమెరికాలో తొలి ఛాన్స్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ మ్యాచ్‌లోనైనా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి బ్యాట్ ఝులిపిస్తే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఇప్పటి వరకు టీమిండియా ఆడిన మూడు మ్యాచ్‌లు న్యూయార్క్‌లోనే జరిగాయి.
అక్కడి నసావూ కౌంటీ డ్రాప్ ఇన్- పిచ్ బౌలర్ల పాలిట స్వర్గధామంలా మారి బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఈ క్రమంలో కోహ్లి మూడు మ్యాచ్‌లలో కలిపి కేవలం ఐదు పరుగులే చేశాడు.
అయితే, కెనడాతో మ్యాచ్ జరిగే వేదిక ఫ్లోరిడాలో పరుగులకు ఆస్కారం ఉన్న వికెట్ ఉంటుంది. కాబట్టి ఈసారైనా కింగ్ భారీగా రన్స్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇండియా వర్సెస్ కెనడాతో నామమాత్రపు మ్యాచ్‌కు తుదిజట్ల అంచనా
భారత తుదిజట్టు(అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
కెనడా తుదిజట్టు(అంచనా)
ఆరోన్ జాన్సన్, నవనీత్ ధాలివాల్, పర్గత్ సింగ్, దిల్ప్రీత్ బజ్వా, నికోలస్ కిర్టన్, శ్రేయస్ మొవ్వ (వికెట్ కీపర్), డిల్లాన్ హెయిలిగర్, సాద్ బిన్ జాఫర్ (కెప్టెన్), కలీమ్ సనా, జునైద్ సిద్ధిఖీ, జెరెమీ గోర్డాన్.
చదవండి: పాక్ చెత్త ప్రదర్శన.. సెలక్టర్లపై మాజీ కెప్టెన్ ఫైర్
New York ✅#TeamIndia arrive in Florida 🛬 for their last group-stage match of the #T20WorldCup! 👍 pic.twitter.com/vstsaBbAQx
— BCCI (@BCCI) June 14, 2024
Comments
Please login to add a commentAdd a comment