నజ్ముల్ షాంటో- రోహిత్ శర్మ (PC: BCCI)
టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాల్లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య శనివారం నాటి వార్మప్ మ్యాచ్‌కు న్యూయార్క్ వేదికైంది. నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
విరాట్ కోహ్లి మినహా మిగిలిన పద్నాలుగు మంది ఆటగాళ్లు బంగ్లాతో వార్మప్ మ్యాచ్‌లో భాగమయ్యారు. ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించాడు.
అయితే, రెండో ఓవర్లోనే అవుటై పూర్తిగా నిరాశపరిచాడు. బంగ్లాదేశ్ పేసర్ షోరిఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు. ఆరు బంతులు ఎదుర్కొన్న సంజూ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిష్క్రమించాడు.
ఇక వన్‌డౌన్‌లో రిషభ్ పంత్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ క్రమంలో ఐదు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 33 పరుగులు చేయగలిగింది. రోహిత్ శర్మ 19, పంత్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు.
మరోవైపు బంగ్లాదేశ్ జట్టు పదమూడు మంది ఆటగాళ్లతో బరిలోకి దిగింది. టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్‌కు విశ్రాంతినిచ్చినట్లు కెప్టెన్ నజ్ముల్ షాంటో వెల్లడించాడు.
టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్
టీమిండియా:
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్( వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చహల్.
బంగ్లాదేశ్:
లిటన్ దాస్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హ్రిదోయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, జకర్ అలీ(వికెట్ కీపర్), మెహదీ హసన్, రిషద్ హుస్సేన్, షోరిఫుల్ ఇస్లాం, తాంజిద్ హసన్, తన్జీమ్ హసన్ సకీబ్, తన్వీర్ ఇస్లాం.
Comments
Please login to add a commentAdd a comment