టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (జూన్ 11) జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. పాక్ బౌలర్లందరూ తలో చేయి వేయడంతో కెనడా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఓపెనర్ ఆరోన్ జాన్సన్ (44 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో రాణించి కెనడాను ఆదుకున్నాడు.
ఆరోన్ మినహా కెనడా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. నవ్‌నీత్ ధలీవాల్ 4, పర్గత్ సింగ్ 2, నికోలస్ కిర్టన్ 1, శ్రేయస్ మొవ్వ 2, రవీందర్ పాల్ సింగ్ 0, బిన్ జాఫర్ 10, కలీమ్ సలా 13 నాటౌట్, దిల్లన్ హెలీగర్ 9 నాటౌట్ పరుగులు చేశారు. కెనడా స్కోర్‌కు ఎక్స్‌ట్రాల రూపంలో 13 పరుగులు వచ్చాయి. పాక్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్ (4-0-13-2), హరీస్ రౌఫ్ (4-0-26-2), షాహిన్ అఫ్రిది (4-0-21-1), నసీం షా (4-0-24-1), ఇమాద్ వసీం (4-0-19-0) కలిసికట్టుగా రాణించి కెనడాను కట్టడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment