T20 World Cup 2024: కెనడాతో కీలక సమరం.. టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ | T20 World Cup 2024, Pakistan Vs Canada LIVE Score: Pakistan Chose To Bowl Against Canada, Here Are Playing XI | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: కెనడాతో కీలక సమరం.. టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌

Published Tue, Jun 11 2024 7:51 PM | Last Updated on Tue, Jun 11 2024 8:19 PM

T20 World Cup 2024: Pakistan Chose To Bowl Against Canada, Here Are Playing XI

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా న్యూయార్క్‌ వేదికగా కెనడా-పాకిస్తాన్‌ జట్ల మధ్య ఇవాళ (జూన్‌ 11) కీలక పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. 

సూపర్‌-8 అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే పాకిస్తాన్‌ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా భారీ తేడాతో గెలవాల్సి ఉంది. మరోవైపు కెనడాకు సైతం ఈ మ్యాచ్‌ అంతే కీలకంగా మారింది. కెనడా కూడా సూపర్‌-8 రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌ తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ కీలకమైన నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.

తుది జట్లు..

కెనడా: ఆరోన్ జాన్సన్, నవనీత్ ధలివాల్, పర్గత్ సింగ్, నికోలస్ కిర్టన్, శ్రేయాస్ మొవ్వ(వికెట్‌కీపర్‌), రవీందర్‌పాల్ సింగ్, సాద్ బిన్ జాఫర్(కెప్టెన్‌), డిల్లాన్ హేలిగర్, కలీమ్ సనా, జునైద్ సిద్ధిఖీ, జెరెమీ గోర్డాన్

పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్‌కీపర్‌), సైమ్ అయూబ్, బాబర్ ఆజం(కెప్టెన్‌), ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రౌఫ్, మహ్మద్ అమీర్
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement