టీ20 వరల్డ్‌కప్-2024లో మరో మ్యాచ్ వర్షార్పణమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫ్లోరిడా వేదికగా శనివారం భారత్-కెనడా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
భారీ వర్షం కారణంగా స్టేడియం ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారింది. పలుమార్లు పిచ్‌ను పరిశీలించిన అంపైర్‌లు ఆటగాళ్లు భద్రత(గాయాల బారిన పడకుండా) దృష్ట్యా.. చివరికి మ్యాచ్‌ను రద్దు చేశారు. టాస్ పడకుండానే ఈ మ్యాచ్‌ను అంపైర్‌లు రద్దుచేశారు.
దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. కాగా ఇదే స్టేడియంలో శుక్రవారం అమెరికా-ఐర్లాండ్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ మెగా టోర్నీలో ఇప్పటికే టీమిండియా సూపర్-8లో అడుగుపెట్టింది.
వరుసగా మూడు మ్యాచ్‌ల్లో భారత్ అద్భుత విజయాలు నమోదు చేసింది. ఇక సూపర్-8లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్‌లో బార్బోడస్ వేదికగా జూన్ 20న తలపడనుంది. మరోవైపు కెనడా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment