క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. భారత్, న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచి (అక్టోబర్ 16) ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగులుతాడని వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్‌కు వేదిక అయిన బెంగళూరులో ఇవాల్టి నుంచే వర్షం ప్రారంభమైంది. వర్షం కారణంగా ఇవాళ జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్ పూర్తిగా రద్దైపోయింది. మ్యాచ్ జరిగే ఐదు రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ ఫోర్‌కాస్ట్‌లో తెలిసింది.
ITS RAINING IN CHINNASWAMY STADIUM 👀
- Bad news for IND vs NZ Test...!!!pic.twitter.com/y3G0poVr8U— Johns. (@CricCrazyJohns) October 15, 2024
కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగనుంది. రెండో టెస్ట్ పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో.. మూడో మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనున్నాయి.
Rain predicted for all 5 days at the Chinnaswamy Stadium for the 1st Test between India and New Zealand. 🌧️ pic.twitter.com/D8Af2HARvR
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 15, 2024
న్యూజిలాండ్‌తో టెస్టులకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
రిజర్వ్ ఆటగాళ్లు: హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.
భారత్‌తో టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ టీమ్
డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, మార్క్ చాప్‌మన్, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్, అజాజ్ పటేల్, బెన్ సియర్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, విలియం ఓ రూర్కే.
చదవండి: Ind vs NZ 2024: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
Comments
Please login to add a commentAdd a comment