
న్యూయార్క్: టి20 వరల్డ్ కప్ వేటలో ‘హ్యాట్రిక్’ విజయాన్ని అందుకున్న భారత్ సూపర్–8లోకి అడుగు పెట్టింది.

బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో యూఎస్‌ఏపై ఘన విజయం సాధించింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూఎస్‌ఏ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది.

అనంతరం భారత్ 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 111 పరుగులు చేసి గెలిచింది.

సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్ దూబే (35 బంతుల్లో 31 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు 65 బంతుల్లో అభేద్యంగా 67 పరుగులు జోడించారు.






























