సాక్షి ప్రతినిధి అనంతపురం: క్రూర జంతువుగా పేరున్న తోడేళ్లు పొదలు, గుట్టలను ఆవాసాలుగా చేసుకుని జీవిస్తాయి. ఒకప్పుడు అటవీ ప్రాంతంలో ఎక్కడ చూసినా కనిపించేవి. గొర్రెలు, మేకల మంద సంచరించే ప్రాంతాల్లో తిరిగేవి. ముఖ్యంగా జీవాలు ఎక్కువగా ఉండే అనంతపురం జిల్లాలో భారీగా ఉండేవి. కానీ ప్రస్తుతం వాటి జాడ మచ్చుకైనా కనిపించడం లేదు. తాజాగా అటవీశాఖ అధికారులు వీటిని అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేర్చారు. రెండేళ్లుగా ఎక్కడా కనిపించడం లేదని వెల్లడిస్తున్నారు.
వేటలో పటిష్టమైన వ్యూహం
తోడేళ్లు గుంపులుగా సంచరిస్తాయి. వేటలో పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేస్తాయి. ఒకటి ముందుగా డెకాయ్ ఆపరేషన్ చేస్తుంది. ఆ తర్వాత మిగతా వన్నీ వస్తాయి. మేక లేదా గొర్రెను తీసుకెళ్లేటప్పుడు గొంతును నోట కరచుకుని, తన ముళ్లతోకతో వెనుక కొడుతూ ఉంటుంది. దీంతో ఆ జీవం దానితో పాటు పరిగెడుతుంది. దీని వల్ల ఈడ్చుకెళ్లే శ్రమ వాటికి తగ్గుతుంది. ఒక తోడేలు ఉందంటే రెండు మూడు నక్కలు కూడా దాని సమీపంలోకి పోలేవు.
రెండు లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో 30కి మించి తోడేళ్లు ఉండేవని అంచనా. కాగా, ఒకప్పుడు ప్రతి జిల్లాలోనూ గుంటనక్కలు కనిపించేవి. ఇప్పుడు వాటి జాడ కూడా లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో నాలుగేళ్లుగా మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే పునుగుపిల్లి కూడా కనుమరుగైనట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
అటవీ విస్తీర్ణం తగ్గడం వల్లే..
జనావాసాలు పెరిగాయి. అడవులు వ్యవసాయ భూములుగా మారాయి. దీంతో వన్యప్రాణుల ఆవాసానికి ఇబ్బందిగా మారింది. కొండలు ఎక్కువగా ఉన్న అనంతపురం లాంటి జిల్లాలే తోడేళ్లకు మంచి ఆవాసాలు. ఇక్కడే వీటి జాడ లేదంటే మిగతా చోట్ల అసలే కనిపించవు. వీటిని కాపాడుకునేందుకు సర్వశక్తులా యతి్నస్తున్నాం.
–సందీప్ కృపాకర్, జిల్లా ఫారెస్టు అధికారి, అనంతపురం
చదవండి: కొరమీను, ఇంగిలాయి, జల్ల, బొమ్మిడాయి, గొరక, వాలుగ.. ఇక్కడ పుట్టినవే!
Comments
Please login to add a commentAdd a comment