మానవుడు తాను మనుగడ సాగించడానికి ఇష్టారీతిలో అడవులు నరికి అభివృద్ధి ముసుగులో తానేం చేస్తున్నాడో తెలుసుకోలేకపోయాడు. అక్కడకి ప్రకృతి ప్రకోపిస్తూ ఏదో విధంగా మానవుడికి తెలియజేప్పే యత్నం చేసిన మూర్ఖుల్లా ప్రవర్తిస్తునే ఉన్నారు. ఇలాంటి ప్రకృతి కథ వింటే కనువిప్పు కలుగుతుందేమో. అన్ని జీవులు మనుగడ సాగిస్తే ప్రకృతి అని తెలిపే కథ. ఏదో ఒక్క సంతతే మనుగడ సాగిస్తే ఒక్కసారిగా పరిసరాలపై ఎలా ప్రభావం చూపుతోంది తెలియజేసే గమ్మత్తైన సంఘటన. చిన్నప్పుడూ చదివిన ఆహారపు గొలుసు కథ స్ఫూరింపజేస్తుంది.
ఇంతకీ ఏంటా కథ అంటే.. 1995లో యూఎస్‌లోని ఎల్లో స్టోన్ నేషనల్‌పార్క్ ఒక్కసారిగా జీవకళ తప్పి నిర్జీవంగా కనిపించింది. ఎందువల్లనో గానీ కొలనులు, సెలయేళ్లు, ఎండిపోతూ, చెట్టన్నీ ఆక్కుపచ్చదనాన్ని కోల్పోయినట్లుగా ఉన్నాయి. దీంతో పక్షుల కిలకిలరావాలు, ఇతర సరీసృపాలు సందడి తదితరాలన్నీ కనుమరుగయ్యి నిర్మానుష్యంగా ఉంది. అయితే ఇదే సమయంలో పార్క్ అధికారులు 14 తొడేళ్లను విడుదల చేశారు. వేటాడే జంతువుల లేకపోవడంతో చెట్లను తినే లేళ్లు, తదితర జంతువుల జనాభా పెరిగిపోయింది. అవి మొక్కలు, పచ్చిక బయళ్లును నెమ్మదిగా తినేయడంతోనే ఒక్కసారిగా ఆ అడవి అంత నిర్జీవంగా అయిపోయింది.
ఎప్పుడైతే విడుదలయ్యాయో ఈ తోడేళ్లు ఆ లేళ్లనే వేటాడటం ప్రారంభించాయి. నక్కల వేట ఎప్పుడైతే మొదలైందో ...క్రమంగా ఆ అడవి స్వరూపం మారి ఎవ్వరూ ఊహించని విధంగా అద్భుతంగా రూపుదిద్దుకుంటుంది. చెట్లన్ని చిగురించడం ప్రారంభించాయి. దీంతో కాకులు, గ్రద్దలు, ఇతర పక్కుల రావడం ప్రారంబించాయి. దీంతో పాటు సుంచులు, ఎలుకలు, కుందేళ్లు శబ్దాలతో మళ్లీ అడవి ఇదివరకటి పక్కుకిలకిల రావాలు, శబ్దాలతో కళకళలాడింది. ఎప్పుడూ కనిపించని కొన్ని రకాల జాతులు కూడా దర్శనమిచ్చాయి. కూడా. ఒక్కసారిగా పార్క్ నిర్వాహణధికారులు కూడా ఏదో మిరాకిల్ జరిగినట్లుగా జరిగిందంటూ ఆశ్చర్యపోయారు.
తాము నిర్జీవంగా ఉన్న అడవిని మునిపటిలా పుష్పించే మొక్కలు చెట్లతో పచ్చగా అందంగా ఉండాలనుకున్నాం కానీ కుదరలేదు. ఈ తోడేళ్లు ఇలా అద్భుతం చేసి చూపుతాయని ఊహించలేదన్నారు. ఆఖరికి అడవిలో ఉండే వేటకుక్కలను కూడా చంపేశాయి. గ్రద్దలు, కాకిల జనాభా పెరిగింది. వేటాడే జంతువు..భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండే జంతువుల మధ్య సమతుల్యత ఏర్పడింది. మరోవైపు నదులు, కొలనులు, సెలయేర్లు కూడా ఇదవరకటిలో నీళ్లుతో నిండుగా కళకళలాడుతూ ఉన్నాయి. పరిసరాల సమతుల్యతకు అన్ని జంతువుల మనుగడ అత్యవసరం అనే విషయాన్ని చాటిచెప్పింది. ఈ ఘటన ప్రకృతి ఎంత అపురూపమైందో తెలియజేసింది.
In 1995, 14 wolves were released in Yellowstone National Park. No one expected the miracle that the wolves would bring
— Massimo (@Rainmaker1973) August 25, 2023
[📹 Protect All Wildlife]pic.twitter.com/DMlMDx40TY
(చదవండి: గమ్యస్థానాలకు చేర్చే "ట్రావెలింగ్ పార్క్"..చూస్తే ఫిదా అవ్వడం ఖాయం!)
Comments
Please login to add a commentAdd a comment