jackal
-
UP Bahraich: వేటాడుతున్న తోడేళ్లు.. మరో చిన్నారి మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా వాసులను గత రెండు నెలలుగా తోడేళ్లు చుక్కలు చూపిస్తున్నాయి. దాదాపు 30 గ్రామాల ప్రజలకు వణికించేస్తున్నాయి. రాత్రి సమయాల్లో గ్రామాలపై దాడులు చేసి. ఇళ్లలోని చిన్నారులను ఎత్తుకెళ్లి చంపి తింటున్నాయి. నెలన్నర వ్యవధిలోనే తోడేళ్ల దాడిలో తొమ్మిది మంది చనిపోయారు. మరణించిన వారిలో ఎనిమిది మంది చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. దీంతో బహ్రైచ్‌లోని 35 గ్రామాలకు హై అలర్ట్ ప్రకటించారు.తాజాగా తోడేళ్ల బీభత్సానికి రెండేళ్ల బాలిక బలైంది. మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున జరిగిన తోడేళ్ల తాడిలో అంజలి అనే బాలిక మృతిచెందింది. మరో ముగ్గురు గాయపడగా.. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓవైపు తోడేళ్లను బంధీంచేందుకు అటవీ శాఖ అధికారుల వేట కొనసాగుతుండగానే ఈ దాడులు వెలుగుచూశాయి.గాయపడిన ముగ్గురిలో కమలా దేవి అనే మహిళ మాట్లాడుతూ.. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో బాత్రూమ్కు వెళ్లగా తమపై తోడేలు దాడి చేసినట్లు చెప్పింది. తన మెడ, చెవిని గాయపరిచిందని, వెంటనే కేకలు వేయడంతో అవి పారిపోయినట్లు తెలిపింది.#WATCH | Uttar Pradesh: On the death of a child attacked by a wolf, Monika Rani, DM Bahraich says, "We have caught 4 wolves, 2 are left... Our team is continuously patrolling, we are trying our best to catch them as soon as possible...I request people to sleep indoors...A… pic.twitter.com/Obk5dSqMKt— ANI (@ANI) September 2, 2024 బహ్రైచ్ జిల్లా కలెక్టర్ మోనికా రాణి మాట్లాడుతూ.. తోడేళ్ల డుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి లోపలే నిద్రించాలని సూచించారు. ఇప్పటి వరకు ‘ఆపరేషన్ బేడియా’ కింద నాలుగు తోడేళ్ళను పట్టుకున్నామని మరో రెండింటి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. తమ అధికారుల బృందం నిరంతరం పెట్రోలింగ్ చేస్తోందని, మిగిలిన తోడేళ్ళను వీలైనంత త్వరగా పట్టుకోవడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.ఇదిలా ఉండగా బహ్రైచ్ తోడేళ్ల ఘటనలు పొరుగున ఉన్న బిహార్‌లో భయాందోళన సృష్టిస్తోంది. బిహార్‌లోని మక్సుద్పూర్ కోటలో తోడేళు అనుకొని పలువురు నక్కను అంతమొందించారు. దారుణంగా కొట్టి చంపారు. అయితే దీనిపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు మీడియానే కారణమని ఆరోపిస్తునున్నారు.తోడేళ్ల గురించి అనవసరమైన భయాందోళనలు వ్యాప్తి చేయకుండా నియంత్రించాల్సిన బాధ్యత మీడియాపై ఉందని వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ అనిష్ అంధేరియా పేర్కొన్నారు. బహ్రైచ్‌లో తోడేళ్లు పిల్లలను చంపినట్లు వస్తున్న ఆరోపణలపై విస్తృతమైన కవరేజీ ఇవ్వడం ద్వారా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాలలో ఇలాంటి అనాగరిక చర్యలకు జాతీయ, ప్రాంతీయ మీడియా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. -
వెంటాడి వేటాడేసింది.. ఈ కుక్కకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
విశ్వాసానికి పెట్టింది పేరు శునకం. పెంపుడు జంతువుల్లో బాగా పాపులర్ అయింది కూడా కుక్క. ఇంటి యజమాని, కుటుంబం ఏదైనా అనుకోని ప్రమాదంలో పడినపుడు చాకచక్యంగా వ్యవహరించి కాపాడుతుంది. ఒక్కోసారి ప్రాణాలకు తెగించి మరీ విశ్వాసాన్ని చాటుకుని హ్యాట్సాఫ్ అనిపించుకున్న ఘటనలు చాలానే చూశాం. అయితే పగబట్టి, వెంటాడి వేటాడిన ఘటనలు చాలా అరుదు కదా. ఇలాంటి ఘటన ఒకటి అట్లాంటాలో చోటు చేసుకుంది.వివరాలను పరిశీలిస్తే..తన యజమాని కుటుంబానికి చెందిన గొర్రెలు, మేకల మందకు కాపలాగా ఉంది ఒక కుక్క. దాని పేరు కాస్పర్. ఒకరోజు గొర్రెలమందపై ఒక్కసారిగా 13 తోడేళ్ల గుంపు (కొయెట్, అమెరికన్ జాకల్) దాడి చేసింది దీంతో అక్కడే ఉన్న కుక్క వాటిపై ఎటాక్ చేసింది. ఎనిమిదింటిని అక్కడికక్కడే చంపేసింది.Atlanta Dog fights 13 coyotes attacking his sheep. Kills 8 on the spot. Goes missing 4 days. Comes home after killing the remaining 5. Salute 🫡 pic.twitter.com/OYDKhuzscW— trader (@TicTocTick) June 25, 2024ఇంతటితో దాని కోపం చల్లారలేదు. నాలుగు రోజులు అదృశ్యమై, వాటిని వెదికి పట్టుకొని మరీ వేటాడి, మిగిలిన ఐదు తోడేళ్ల పని కూడా పట్టింది. ఆ తర్వాత మాత్రమే ఇంటికి చేరింది. తీవ్ర గాయాలతో ఇంటికి చేరిన దాన్ని చూసి, ఇక బతకదని భావించారట దాని యజమాని వీర్విల్లే. ఆ తరువాత కొంతకాలం లైఫ్‌లైన్ యానిమల్ ప్రాజెక్ట్ సంరక్షణలో కోలుకుంది హీరో కాస్పర్. గత ఏడాది చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇన్‌స్టా,, ఎక్స్‌లో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. -
నక్క మొహం చూశాడు.. జైలు కెళ్లాడు!
తానొకటి తలిస్తే... మరొకటి జరిగింది. నిద్రలేవగానే నక్క ముఖం చూడటం లక్ అని అతను భావిస్తే... పోలీసులు అతనికి జలక్ ఇచ్చారు. నక్కను బంధించాడని అతడ్ని పోలీసులు జైలుకు పంపించారు. ఈ సంఘటన కర్ణాటకలోని తుమకూరు రూరల్ పరిధిలోని నాగవల్లి గ్రామంలో జరిగింది. నాగవల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్ మూఢనమ్మకాలు అనుసరిస్తాడు. ఎవరికైనా డబ్బులు వస్తే నక్క తోక తొక్కాడు... నక్క ముఖం చూశాడు... అనే సామెతలను బాగా నమ్మేవాడు. ఈ క్రమంలో అతను తన ఇంట్లో రెండు నక్క ఫొటోలను పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా అడవిలో ఉన్న ఒక నక్కను పట్టుకొచ్చి తన కోళ్లఫారం వద్ద బోనులో పెట్టాడు. ప్రతి రోజు ఉదయం దాని ముఖం చూసేవాడు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది పోలీసులకు చెప్పడంతో వారు వచ్చి నక్కను స్వాధీనం చేసుకున్నారు. అడవిలో ఉండాల్సిన నక్కను బోనులో పెట్టడం నేరమని లక్ష్మీకాంత్‌ను అరెస్ట్ చేశారు. నక్కను అటవీ సిబ్బందికి అప్పగించారు. – తుమకూరు -
పిల్లల కథ: మంచి పని.. ఈ కిరీటం నీకే!
విజయపురి రాజు వద్ద రకరకాల కిరీటాలు ఉండేవి. ఒకసారి అడవిలో గుర్రం మీద లేడిని వెంబడిస్తూ వేటాడసాగాడు. ఆ సమయంలో కిరీటం జారి కిందపడింది. రాజు ఆ విషయాన్ని పట్టించుకోకుండా లేడిని తరుముతూ ముందుకెళ్ళిపోయాడు. నక్క, తోడేలు కలసి వస్తూ కిరీటాన్ని చూశాయి. ‘నేను ముందు చూశాను. ఇది నాకు చెందాలి’ అంది నక్క. ‘కాదు.. నేను ముందు చూశాను. నాకే చెందాలి‘ అంది తోడేలు. అలా వాదులాడుకుంటూ న్యాయం కోసం సింహం దగ్గరకు వెళ్లాయి. వాటి సమస్య విన్న సింహం.. జంతువులన్నింటిని సమావేశపరచింది. విషయాన్ని వివరించింది. ‘కిరీటం అడవిలో దొరికింది కాబట్టి.. ఈ అడవికి రాజునైన నాకే చెందుతుంది. ఈ అడవిలోని జంతువులన్నిటికీ ఏడాది సమయం ఇస్తున్నాను. ఈ ఏడాదిలో ఎవరైతే మంచి పనులు చేస్తారో వారికి ఈ కిరీటాన్నిచ్చి గౌరవిస్తాను. అంతవరకూ ఇది నాదగ్గరే ఉంటుంది’ అని చెప్పింది సింహం. సమావేశం ముగిశాక జంతువులన్నీ వెళ్లిపోయాయి. వేట ముగించుకుని రాజు తిరిగి వస్తూ కిరీటం కోసం చూశాడు. ఎక్కడా కనిపించక పోవడంతో నిరాశతోనే రాజ్యానికి వెళ్లిపోయాడు. సంవత్సర కాలం పూర్తయింది. సింహం జంతువులన్నీటినీ సమావేశపరచింది. ‘మహారాజా! నేను కోతిచేష్టలు, ఆకతాయి పనులు మానుకున్నాను. మంచిగా ఉంటున్నాను’ అంది కోతి. ‘మాంసాహారం మానుకుని చిన్నజంతువులను దయతో చూస్తున్నాను’ అంది తోడేలు. నక్క మరికొన్ని జంతువులు కూడా తోడేలు చెప్పిన మాటనే చెప్పాయి. ‘బురదగుంటలో చిక్కుకున్న గాడిదను కాపాడాను’ అంది ఏనుగు. ‘నేను నాట్యంతో ఆనందాన్ని పంచాను’ అంది గుర్రం. ‘నేను కొన్నింటికి చెట్లెక్కడం నేర్పాను’ అంది చిరుత. ‘పిల్లజంతువులను నా వీపు మీద ఎక్కించుకుని అడవంతా తిప్పుతూ ఆనందాన్ని పంచాను’ అంది పెద్దపులి. ఉలుకు.. పలుకూ లేకుండా ఉన్న ఎలుగుబంటిని చూసి సింహం ‘నువ్వేం చేశావో చెప్పు?’ అని అడిగింది. ‘మన అడవి గుండా విజయపురి వైపు వెళ్తున్న ఒక మునితో విజయపురి రాజు వేటకు వచ్చి మమ్మల్ని చంపుతున్నాడు. ఆ క్రమంలోనే ఆయన కిరీటం జారి ఈ అడవిలో పడిపోయింది. కాబట్టి ఇక్కడకు వేటకు రావడం ఆ రాజుకు అరిష్టమని చెప్పి భయపెట్టి.. మా వైపు రానివ్వకుండా చేయండి అని కోరాను. దానికి ఆ ముని.. ఈ అడవికే కాదు ఏ అడవికీ వేటకు వెళ్లకుండా చేస్తానని మాటిచ్చాడు. ఆ ముని వెళ్లి రాజుకు ఏంచెప్పాడో కానీ ఆరోజు నుంచి విజయపురి రాజు వేట మానుకున్నాడు. మన అడవిలో చెట్లు తక్కువగా ఉన్నాయి. నిండుగా చెట్లుంటే అనేక లాభాలు. అందుకే వందలసంఖ్యలో పండ్లమొక్కలను నాటి పెంచుతున్నాను’ అని చెప్పింది ఎలుగుబంటి. ‘ఇతరుల మేలు కోరడం, మొక్కలను పెంచడాన్ని మించిన మంచి పనులేమున్నాయి! ఈ కిరీటం నీకే’ అని ప్రశంసించింది సింహం. ‘మృగరాజా.. బహుమతి కోసం నేను ఈ పనులు మొదలుపెట్టలేదు. చాలా కాలం నుంచే చేస్తున్నాను. మీ ప్రశంసలు అందుకున్నాను. అది చాలు నాకు’ అంటూ వినయంగా కిరీటాన్ని తిరస్కరించింది ఎలుగుబంటి. ఆ రోజు నుంచి ఆ అడవిలోని జంతువులన్నీ ఎలుగుబంటిలా పదిమందికి ఉపయోగపడే పనులు చేయసాగాయి. (క్లిక్: పిల్లల కథ.. ఆనందమాత) -
కొండచిలువతో సీతకోక చిలుక ఏం చెబుతుందో చూడండి!
మనం డిస్కవరీ చానల్స్‌లో కొండచిలువ, అనకొండ లాంటి పాములు ఎలా జంతువులపై దాడి చేసి తినేస్తాయో చూసి ఉంటాం. అవి చూస్తే కాస్త రోమాలు నిక్కబొడుచుకుని వొళ్లు జలదరిస్తుంది. అచ్చం అలాంటి ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అసలు ఇంతకీ ఆ ఫోటోలో ఏం ఉందంటే ఒక కొండచిలువ ఒక నక్కను గొంతు పిసికి చంపుతుంది. అసలు ఏముంది ఇందులో ఇలాంటివి చాలేనే చూశాం అంటారా!. (చదవండి: ఎదురుగా కంగారుల సమూహం.. ఇప్పుడు నేనెలా ఆడాలి?) అసలు విషయం ఇక్కడే ఉంది ఏంటంటే సీతాకోక చిలుక రెక్కలు విప్పుకుని కూర్చొని ఉండగా కొండచిలువ నక్కను గొంతు పిసికి చంపేసింది. అయితే అందులో సీతకోక చిలుక ఎక్కడ ఉందో చెప్పండి" అనే క్యాప్షన్‌ని జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దీంతో నెటిజన్లకు ఆ ఫోటోలో సీతాకోక చిలుక ఎక్కడ ఉంది అంటూ ఆసక్తిగా వీక్షించడంతో అది కాస్త పెద్ద రసవత్తరమైన అంశంగా మారుతుంది. ఇంతకీ ఆ సీతకోక చిలుక కొండచిలువ తలపై ప్రశాంతంగా కూర్చోని ఉంటుంది. నిజానికి చాలా మంది నెటిజన్లు గుర్తించలేకపోతారు. (చదవండి: ఈశ్వర్ అల్లా" అంటే ఇదేనేమో) Python strangles jackal. What do you think the butterfly is saying to the python?#TiredEarth pic.twitter.com/BgEjl3aeOt — Rebecca Herbert (@RebeccaH2030) October 27, 2021 -
నక్క జిత్తులు ఫలించలేదు...!
-
నక్క జిత్తులు ఫలించలేదు...!
అనాదిగా వస్తున్న ‘ఆహార గొలుసు’ నియమం ప్రకారం కొండచిలువను చంపి తినాలన్న గుంట నక్క.. అనూహ్యంగా దాని చేతిలో చిక్కి ప్రాణాలు కోల్పోయింది. మనుగడకోసం జరిగిన ఈ భీకర పోరాటం తాలూకు ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. న్యూసౌత్ వేల్స్ (బ్రిటన్)కు చెందిన తండ్రీ కొడుకులు పనిమీద పట్నం పోయి ఊరికి తిరిగి వస్తూ మధ్యలో కాసేపు కారు ఆపారు. పక్కనుంచే గట్టిగా కసా–బుసా శబ్ధాలు వినిపించడంలో అటుగా కదిలారు. తీరాచూస్తే.. కొండచిలువ–నక్కల పోరాటం. అప్పటికే నక్క తన కోరపళ్లతో కిండచిలువ తలను నమిలే ప్రయత్నం చేసింది. తనను తాను కాపాడుకునే క్రమంలో ఆ రెండు మీటర్ల భారీ కొండచిలువ... నక్కను అమాంతం చుట్టేసి నలిపేసింది. దీంతో ఊపిరాడక నక్క చచ్చిపోయింది. ఈ దృశ్యాలను మొబైల్ ఫోన్లో చిత్రీకరించిన సాహస తండ్రీ కొడుకులు.. ఇంకాస్త దగ్గరికి వెళ్లి నక్క నోట్లో నుంచి కొండచిలువ తలను బయటికి తీశారు. నక్కను చుట్టుముట్టిన కొండచిలువను కూడా వేరు చేసేందుకు ప్రయత్నించేశారట. కానీ విజయగర్వంతో ఊగిపోతున్న ఆ కొండచిలువ వీళ్లకేసి బుసలు కొట్టడంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి వచ్చేశారట!