నక్క జిత్తులు ఫలించలేదు...!
అనాదిగా వస్తున్న ‘ఆహార గొలుసు’ నియమం ప్రకారం కొండచిలువను చంపి తినాలన్న గుంట నక్క.. అనూహ్యంగా దాని చేతిలో చిక్కి ప్రాణాలు కోల్పోయింది. మనుగడకోసం జరిగిన ఈ భీకర పోరాటం తాలూకు ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. న్యూసౌత్ వేల్స్ (బ్రిటన్)కు చెందిన తండ్రీ కొడుకులు పనిమీద పట్నం పోయి ఊరికి తిరిగి వస్తూ మధ్యలో కాసేపు కారు ఆపారు. పక్కనుంచే గట్టిగా కసా–బుసా శబ్ధాలు వినిపించడంలో అటుగా కదిలారు. తీరాచూస్తే.. కొండచిలువ–నక్కల పోరాటం. అప్పటికే నక్క తన కోరపళ్లతో కిండచిలువ తలను నమిలే ప్రయత్నం చేసింది.
తనను తాను కాపాడుకునే క్రమంలో ఆ రెండు మీటర్ల భారీ కొండచిలువ... నక్కను అమాంతం చుట్టేసి నలిపేసింది. దీంతో ఊపిరాడక నక్క చచ్చిపోయింది. ఈ దృశ్యాలను మొబైల్ ఫోన్లో చిత్రీకరించిన సాహస తండ్రీ కొడుకులు.. ఇంకాస్త దగ్గరికి వెళ్లి నక్క నోట్లో నుంచి కొండచిలువ తలను బయటికి తీశారు. నక్కను చుట్టుముట్టిన కొండచిలువను కూడా వేరు చేసేందుకు ప్రయత్నించేశారట. కానీ విజయగర్వంతో ఊగిపోతున్న ఆ కొండచిలువ వీళ్లకేసి బుసలు కొట్టడంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి వచ్చేశారట!