
మణికొండ: ఓ ఇంట్లోకి 12 అడుగుల కొండ చిలువ చొరబడటంతో స్ధానికులు భయాందోళనకు గురైన ఘటన మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అలిజాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గణేష్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లోకి మంగళవారం ఉదయం కొండ చిలువ వచి్చంది. అది అప్పటికే మూడు కుక్క పిల్లలను మింగటంతో కదలలేక ఇంట్లోనే ఉండిపోయింది.
కొండ చిలువను చూ సిన గణేష్ సింగ్ విషయం చుట్టు పక్కల వారికి చెప్పాడు. దీంతో స్థానికంగానే ఉన్న అమర్‌సింగ్ అనే వ్యక్తి దాన్ని పట్టుకుని బయటకు తెచ్చి అలిజాపూర్ పక్కనే ఉన్న గుట్టల్లో దాన్ని వదలిపెట్టాడు. గతంలో పలు మార్లు పాములు వచ్చాయని, కానీ ఇప్పుడు ఏకంగా 12 అడుగుల కొండ చిలువ వచి్చందని అక్కడి స్థానికులు తెలుపుతున్నారు.