పాపం.. రెండు బండరాళ్ల మధ్య ఇరుక్కుని ఓ మహిళ నరకం అనుభవించింది. ఆమెను రక్షించేందుకు స్నేహితులు ప్రయత్నాలు ఫలించలేదు. చేసేది లేక ఎమర్జెన్సీ సర్వీస్‌కు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన ఎమర్జెన్సీ సర్వీస్...
న్యూ సౌత్ వేల్స్: పర్వత ప్రాంతంలోని బండరాళ్ల మధ్య నడుస్తున్న మహిళ చేతిలోని సెల్‌ఫోన్ జారిపడింది. ఫోన్‌ను అందుకునే క్రమంలో ఆమె రెండు బండరాళ్ల మధ్య సందులో తలకిందులుగా ఇరుక్కుపోయారు. సుమారు ఏడు గంటల యాతన అనంతరం ఆమెను సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆ్రస్టేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లో ఉన్న హంటర్ వ్యాలీలో నెలారంభంలో చోటు చేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
బాధిత మహిళ పేరు మటిల్డా కాంప్‌బెల్. రాళ్ల మధ్య మూడుమీటర్ల సందులో ఇరుక్కుపోయిన మటిల్డాను కాపాడేందుకు ఆమె స్నేహితులు ఎంతగానో ప్రయత్నించారు. వీలు కాకపోవడంతో ఎమర్జెన్సీ సర్వీస్‌కు సమాచారమిచ్చారు. వారు వచ్చి అర టన్ను బరువున్న ఒక రాయిని పక్కకు జరపగలిగారు. అయినప్పటికీ, మటిల్డాను రక్షించడం సవాల్‌తో కూడుకున్న వ్యవహారమనే అంచనాకు వచ్చారు.
‘పదేళ్లుగా ఎన్నో ఘటనలను దగ్గర్నుంచి చూస్తున్నా. కానీ, ఇటువంటిది ఇదే మొదటిసారి’అని ఎమర్జెన్సీ సరీ్వస్ పారామెడిక్ పీటర్ వాట్స్ పేర్కొన్నారు. ‘మటిల్డా ఇరుక్కుపోయిన ప్రాంతం ఎస్ ఆకారంలో ఉంది. అందుకే, ఆమె కాళ్లు ఇరుక్కున్న బండరాళ్లను కదలకుండా ఉంచుతూనే ఆమె పట్టేంత జాగాను ఏర్పాటు చేయడం ఎంతో క్లిష్టమైన వ్యవహారం. దాదాపు ఏడుగంటల శ్రమ అనంతరం ఆమెను సురక్షితంగా బయటకు తేగలిగాం’అని తెలిపారు.
చదవండి: ట్రంప్ గెలిస్తే.. పుతిన్ కీవ్‌లో కూర్చుంటారు.. కమలా హారిస్ వార్నింగ్
అయినా కూడా ఆమెకు గీసుకుపోయిన గాయాలే తప్ప, ఎటువంటి హాని కలగకపోవడం ఆశ్చర్యపరిచే విషయమని చెప్పారు. ఇంతా చేసినా మటిల్డా ఫోన్ మాత్రం దొరకలేదని వాట్స్ చెప్పారు. ఇంత జరిగినా, ఫోన్‌ను పోగొట్టుకోవాల్సి వచ్చినందుకు మటిల్డా విచారం వ్యక్తం చేయడం కొసమెరుపు..!
Comments
Please login to add a commentAdd a comment