Australia Woman
-
బండరాళ్ల మధ్య తలకిందులుగా ఇరుక్కున్న మహిళ..!
పాపం.. రెండు బండరాళ్ల మధ్య ఇరుక్కుని ఓ మహిళ నరకం అనుభవించింది. ఆమెను రక్షించేందుకు స్నేహితులు ప్రయత్నాలు ఫలించలేదు. చేసేది లేక ఎమర్జెన్సీ సర్వీస్‌కు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన ఎమర్జెన్సీ సర్వీస్...న్యూ సౌత్ వేల్స్: పర్వత ప్రాంతంలోని బండరాళ్ల మధ్య నడుస్తున్న మహిళ చేతిలోని సెల్‌ఫోన్ జారిపడింది. ఫోన్‌ను అందుకునే క్రమంలో ఆమె రెండు బండరాళ్ల మధ్య సందులో తలకిందులుగా ఇరుక్కుపోయారు. సుమారు ఏడు గంటల యాతన అనంతరం ఆమెను సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆ్రస్టేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో ఉన్న హంటర్ వ్యాలీలో నెలారంభంలో చోటు చేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.బాధిత మహిళ పేరు మటిల్డా కాంప్‌బెల్. రాళ్ల మధ్య మూడుమీటర్ల సందులో ఇరుక్కుపోయిన మటిల్డాను కాపాడేందుకు ఆమె స్నేహితులు ఎంతగానో ప్రయత్నించారు. వీలు కాకపోవడంతో ఎమర్జెన్సీ సర్వీస్‌కు సమాచారమిచ్చారు. వారు వచ్చి అర టన్ను బరువున్న ఒక రాయిని పక్కకు జరపగలిగారు. అయినప్పటికీ, మటిల్డాను రక్షించడం సవాల్‌తో కూడుకున్న వ్యవహారమనే అంచనాకు వచ్చారు.‘పదేళ్లుగా ఎన్నో ఘటనలను దగ్గర్నుంచి చూస్తున్నా. కానీ, ఇటువంటిది ఇదే మొదటిసారి’అని ఎమర్జెన్సీ సరీ్వస్ పారామెడిక్ పీటర్ వాట్స్ పేర్కొన్నారు. ‘మటిల్డా ఇరుక్కుపోయిన ప్రాంతం ఎస్ ఆకారంలో ఉంది. అందుకే, ఆమె కాళ్లు ఇరుక్కున్న బండరాళ్లను కదలకుండా ఉంచుతూనే ఆమె పట్టేంత జాగాను ఏర్పాటు చేయడం ఎంతో క్లిష్టమైన వ్యవహారం. దాదాపు ఏడుగంటల శ్రమ అనంతరం ఆమెను సురక్షితంగా బయటకు తేగలిగాం’అని తెలిపారు.చదవండి: ట్రంప్ గెలిస్తే.. పుతిన్ కీవ్‌లో కూర్చుంటారు.. కమలా హారిస్ వార్నింగ్అయినా కూడా ఆమెకు గీసుకుపోయిన గాయాలే తప్ప, ఎటువంటి హాని కలగకపోవడం ఆశ్చర్యపరిచే విషయమని చెప్పారు. ఇంతా చేసినా మటిల్డా ఫోన్ మాత్రం దొరకలేదని వాట్స్ చెప్పారు. ఇంత జరిగినా, ఫోన్‌ను పోగొట్టుకోవాల్సి వచ్చినందుకు మటిల్డా విచారం వ్యక్తం చేయడం కొసమెరుపు..! -
అంతర్జాతీయ క్రికెట్‌కు ఆస్ట్రేలియా సీనియర్ గుడ్‌బై
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్లో మరో శకం ముగిసింది. ఆ జట్టు సీనియర్ క్రికెటర్ రేచల్ హేన్స్ గురువారం అంతర్జాతీయం సహా అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై ప్రకటించింది. 2009లో క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రేచల్ హేన్స్ దశాబ్దానికి పైగా ఆసీస్ క్రికెట్లో ప్రధాన బ్యాటర్‌గా సేవలందించింది. ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా మహిళల జట్టు గెలిచిన ఆరు మేజర్ టోర్నీల్లో రేచల్ హేన్స్ ఉండడం విశేషం. ఇక ఆస్ట్రేలియా తరపున రేచల్ హేన్స్ 6 టెస్టుల్లో 383 పరుగులు, 77 వన్డేల్లో 2585 పరుగులు, 84 టి20ల్లో 850 పరుగులు చేసింది. హేన్స్ ఖాతాలో రెండు వన్డే సెంచరీలు ఉన్నాయి. కాగా టెస్టుల్లో అరంగేట్రం ఇచ్చిన డెబ్యూ మ్యాచ్‌లోనే హేన్స్ 98 పరుగులు చేసి ఆకట్టుకుంది. హేన్స్ కెరీర్‌ను రెండు భాగాలుగా విడదీయొచ్చు. 2009 నుంచి 2013 వరకు, ఆ తర్వాత నాలుగేళ్ల పాటు క్రికెట్‌కు దూరమైన హేన్స్ 2017 నుంచి 2022 వరకు ఆటలో కొనసాగింది. ఇక హేన్స్ చివరగా బర్మింగ్హమ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో టీమిండియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆడింది. ఈ మ్యాచ్ గెలిచిన ఆస్ట్రేలియా స్వర్ణ పతకం గెలిచింది. ఇక హేన్స్ పలు సందర్భాల్లో జట్టును నడిపించింది. 2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఒక మ్యాచ్‌లో జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ భుజం గాయంతో పక్కకు తప్పుకోవడంతో నాయకత్వ బాధ్యతలు నిర్వహించింది. ఆ తర్వాత 2018లో తొలిసారి వైస్ కెప్టెన్ అయిన రేచల్ హేన్స్ 2020లో టి20 వరల్డ్ కప్, 2022లో వన్డే వరల్డ్‌కప్‌ను గెలవడంలో.. కామన్వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియా స్వర్ణం గెలవడంలోనూ కీలకపాత్ర పోషించింది. ''ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ ఒక రేచల్ హేన్స్ సేవలు కోల్పోనుంది. దాదాపు దశాబ్దానికి పైగా క్రికెట్లో సేవలందించిన రేచల్ హేన్స్ ఇవాళ ఆటకు వీడ్కోలు పలకడం మా దురదృష్టం. ఇన్నేళ్లలో ఆమె జట్టు తరపున ఎన్నో విజయాల్లో పాలు పంచుకుంది. రేచల్ హేన్స్ ఆడిన కాలంలో ఆస్ట్రేలియా ఆరు మేజర్ టోర్నీలు గెలవడం ఆమెకు గర్వకారణం. మలి ప్రయాణం సాఫీగా సాగిపోవాలని కోరుకుంటున్నాం'' అంటూ ఆస్ట్రేలియా క్రికెట్ చీఫ్ నిక్ హాక్లీ చెప్పుకొచ్చాడు. ఇక బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రేచల్ హేన్స్ ఈ సీజన్ తర్వాత అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకోనుంది. చదవండి: 'కర్మ ఫలితం అనుభవించాల్సిందే'.. ఎంతైనా పాక్ క్రికెటర్! క్రికెట్లో విషాదం.. అంపైర్ అసద్ రౌఫ్ హఠాన్మరణం -
కేకు తినే పోటీలో పాల్గొని మహిళ మృతి
సిడ్నీ : కేకు తినే (ఈటింగ్ కేక్) పోటీలో పాల్గొని మహిళ మృతి చెందిన ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియా డే సందర్భంగా క్వీన్స్‌ల్యాండ్‌లోని బీచ్ హౌస్ హోటల్లో కేకు తినే(ఈటింగ్ కేక్) పోటీలను నిర్వహించారు. ఆస్ట్రేలియాలో ఫేమస్ అయిన ల్యామింగ్టన్ కేకులను ఈ పోటీలో ఉంచారు. ఈ పోటీలో పాల్గొన్న ఓ 60 ఏళ్ల మహిళ ల్యామింగ్టన్ కేకులను వెంట వెంటనే తినడానికి ప్రయత్నించింది. కొన్ని కేక్ పీసులను తిన్న వెంటనే మహిళ స్పృహ తప్పి పడిపోయింది. దీంతో హోటల్ యాజమాన్యం ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందారని వెల్లడించారు. మహిళ మృతి పట్ల హోటల్ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది. ఆహ్లాదకరంగా జరుగుతున్న పోటీలో ఇలా మహిళ ప్రాణాలను పోగొట్టుకోవడం తమకు ఎంతో బాధగా ఉందంటూ హోటల్ యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది. మహిళా కుటుంబ సభ్యులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తాము ఫోన్ చేసిన నిమిషాల్లో హోటల్‌కు చేరుకున్న అంబులెన్స్ సర్వీసుకు హోటల్ సిబ్బంది ధన్యవాదాలు తెలిపింది. ఆస్ట్రేలియా డే సందర్భంగా ఆ దేశంలో ప్రతి ఏడాది తిండి పోటీ (ఈటింగ్ కాంపిటీషన్) నిర్వహిస్తారు. కేకులు లేదా ఇతర ఆహార పదార్థాలను తక్కువ సమయంలో ఎక్కువ తినేవారిని విజేతలుగా ప్రకటిస్తారు. విజేతలకు విలువైన బహుమతులను కూడా అందిస్తారు. -
10రోజుల్లో రెండుసార్లు గర్భం దాల్చింది!
బ్రిస్బేన్: బిడ్డకు జన్మనివ్వడం ప్రతి మహిళకు ఓ మధురానుభూతి.. ఇటీవలికాలంలో కొందరు స్త్రీలు పలు కారణాలవల్ల అమ్మ అనిపించుకోలేకపోతుండగా.. ఓ మహిళ మాత్రం అద్భుతమైన రీతిలో పదిరోజుల్లో వ్యవధిలోనే రెండుసార్లు గర్భవతి అయింది. ఒకేరోజు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. వైద్యరంగంలోనే అరుదైన ఈ ఘటన ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో చోటుచేసుకుంది. సూపర్ఫెటేషన్ (ఒకేసారి రెండు అండాలు గర్భంలోకి చేరడం) అనే అరుదైన వైద్యపరిస్థితి వల్ల 10 రోజుల వ్యవధిలోనే కేట్ హిల్ రెండుసార్లు గర్భవతి అయింది. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ కారణంగా 2006 నుంచి ఆమె హార్మోన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న క్రమంలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. అదికూడా భర్తతో ఒకేసారి శృంగారంలో పాల్గొన్నప్పటికీ పదిరోజుల్లో ఆమె రెండుసార్లు గర్భవతి కావడం వైద్యులను విస్మయ పరిచింది. వెంటవెంటనే ఆమె విడుదల చేసిన అండాలు భర్త వీర్యంతో రెండుసార్లు ఫలదీకరణం చెందడం వల్ల ఇది సంభవించింది. పురుషుడి వీర్యం పదిరోజులపాటు క్రియాశీలంగా ఉంటుంది. దీంతో ఆమె ఒకేరోజు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరూ ఒకేపోలికతో ఉన్న కవలలు కాదు. ఇద్దరి బరువు, పరిమాణం భిన్నంగా ఉన్నాయి. ఇలాంటి అరుదైన ఘటనలు వైద్యచరిత్రలో ఇప్పటివరకు పది చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.