
జకార్తా: ఇండోనేసియాలో మంగళవారం(జులై2) భయానక ఘటన జరిగింది. 30 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ ఏకంగా ఒక మహిళను చంపి మింగేయడానికి ప్రయత్నించింది. అసలు ఏం జరిగిందంటే.. ఇండోనేసియాలోని సౌత్ సులవేసిలో ఉన్న లువు ఏజెన్సీ ప్రాంతంలో నివసించే సిరియతి అనే మహిళకు ఐదుగురు సంతానం.
మహిళ తన పిల్లల్లో ఒకరికి ఆరోగ్యం బాగోలేదని మందుల కోసం ఆమె ఇంటి నుంచి బయటికి వచ్చింది. చెట్ల మధ్యలో నుంచి నడుచుకుంటూ మందుల షాపుకు వెళుతోంది. అక్కడే చెట్లపై ఉన్న భారీ కొండచిలువ మహిళపై దాడి చేసి చుట్టచుట్టి నలిపేసింది. తర్వాత మహిళను ఆమె కాళ్లదాకా మింగేసింది.
ఇంతలో అదే దారిలో మహిళ కోసం వెతుకుతూ వస్తున్న భర్తకు భయానక దృశ్యం కనిపించింది. తన భార్యను కొండచిలువ కాళ్లదాకా మింగేయడం కనిపించింది. కోపంతో వెంటనే కొండచిలువను చంపి మహిళను బయటికి తీశాడు. కానీ అప్పటికే ఆమె చనిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment