వింత ఘటన: ఓ మహిళ టూత్‌బ్రెష్‌ని అనుకోకుండా మింగేసింది! అంతే.. | Woman Nearly Chokes To Death On Food Then Swallows Toothbrush | Sakshi
Sakshi News home page

వింత ఘటన: ఓ మహిళ టూత్‌బ్రెష్‌ని అనుకోకుండా మింగేసింది! అంతే..

Dec 6 2023 1:40 PM | Updated on Dec 6 2023 1:40 PM

Woman Nearly Chokes To Death On Food Then Swallows Toothbrush - Sakshi

ఏదైనా వస్తువు నోట్లో సరదాగా పెట్టుకుని అనుకోకుండా మింగడం జరగుతుంది. ఇది అత్యంత సాధారణ విషయం. ప్రమాదకరమైన వస్తువు కాకపోతే వైద్యులు లేద పెద్దవాళ్ల సాయంతో బయటకు తెచ్చేస్తారు. అసలు దంతాలను క్లీన్‌ చేసుకునే టూత్‌ బ్రెష్‌ని మింగడం గురించి విన్నారా?. అస్సలు అదే ఎలా జరుగుతుంది అనిపిస్తుంది కదా!కానీ ఇక్కడొక మహిళ ఏం చేసిందో గానీ అమాంతం టూత్‌బ్రెష్‌ని అయితే మింగేసింది. ఇక ఆ తర్వాత ఆమె పరిస్థితి..మాటలకందనిది.

స్పానిష్‌కి చెందిన 21 ఏళ్ల హీజియా అనే మహిళ టర్కీ మాంస ఫుల్‌గా లాంగించింది. ఆ తర్వాత దంతాల్లో ఇరుక్కుపోయిన పదార్థాలను టూత్‌ బ్రెష్‌తో  క్లీన్‌ చేసుకుంటుండగా పొరపాటున \మింగేసింది. అది గొంతులో అడ్డుపడి నరకయాతన అనుభవించింది. ఒకరకంగా చెప్పాలంటే ఊపిరాడక చావు అంచెలదాక వెళ్లిందనే చెప్పాలి. ఏం చేయాలో తోచక తండ్రిని సాయం కోరగా..ఏదైనా బలవంతంగా ప్రయత్నిస్తే..ఎక్కడ? ఆమె గొంతుకు సమస్య వస్తుందన్న భయంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించాడు.

అక్కడ ఈ ఇబ్బందికర పరిస్థితిని వివరించగా..వైద్యులు సైతం ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇదంతా నిజమేనా? అన్న సందేహం వచ్చింది. చివరికి ఎక్స్‌రే తీయగా నిజంగానే ఇరుక్కుపోయిందని గుర్తించారు. దీంతో సర్జన్లు సుమారు రెండు నుంచి మూడు నిమిషాలు స్టడీ చేసి అన్నవాహికలో ఇరుక్కుపోయిన ఆ టూత్‌బ్రెష్‌ని సర్జరీ అవసరం లేకుండానే ఓ వైద్య​ పరికరంతో బయటకు తీశారు. జస్ట్‌ 40 నిమిషాల్లో విజయవంతంగా ఈ ప్రక్రియనంతా పూర్తి చేశారు వైద్యులు. ఏదీ ఏమైనా ఇది అత్యంత విచిత్రమైన ఘటన కదూ.! 

(చదవండి: ముక్కు క్యాన్సర్‌ అంటే..? దీని కారణంగా ఓ మహిళ మొత్తం ముక్కునే..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement