tooth brush
-
Tooth Brush టూత్ బ్రష్.. దీని కథ తెలుసా?
రోజూ పొద్దున లేచి, పళ్లు తోమిన తర్వాతే ఏదైనా తినాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కొందరు పళ్లు తోమడానికి బద్దకిస్తారు. తోమకుండానే ఉండి΄ోతారు. దీనివల్ల పళ్లు చెడిపోయి, దుర్వాసన వస్తుంది. కాబట్టి పళ్లు తోమడం తప్పనిసరి. పళ్లు తోమేందుకు బ్రష్ వాడతాం కదా, ఆ బ్రష్ చరిత్రేమిటో తెలుసా?పళ్లు తోమేందుకు బ్రష్ కనిపెట్టకముందే ఆదిమానవులు పళ్లు శుభ్రం చేసుకునేందుకు రకరకాల వస్తువులు వాడేవారు. చెట్టు బెరడు, పక్షి రెక్కలు, జంతువుల ఎముకలతో పళ్లను శుభ్రం చేసుకునేవారు. ఆ తర్వాత కాలంలో పళ్లను తోమేందుకు చెట్ల కొమ్మల్ని వాడేవారు. అందులోనూ వేపపుల్లల్ని ఎక్కువగా వాడేవారు. వాటిని నమలుతూ పళ్లను శుభ్రంగా ఉంచుకునేవారు. ఒక వైపు తోమాక, మరో వైపుతో నాలుక శుభ్రం చేసుకునేవారు. ప్రపంచంలో అనేకచోట్ల చెట్ల కొమ్మల్నే పళ్లు శుభ్రం చేసుకునేందుకు వాడినట్లు ఆధారాలున్నాయి. అయితే పుల్లలు వాడకుంటూ బొగ్గు, ముగ్గు, బూడిద, ఇతర పదార్థాలను ఉపయోగించి చేత్తోనే పళ్లు తోమే అలవాటు కూడా చాలామందికి ఉండేది. ఇదీ చదవండి: టూత్ బ్రష్ మారుస్తున్నారా?ఎన్నాళ్లకు మార్చాలి? లేదంటే...!ఆ తర్వాత తొలిసారి చైనాలో బ్రష్ కనిపెట్టారు. ఒక చేత్తో బ్రష్ చివర పట్టుకుంటే మరో వైపు ఉన్న బ్రిజిల్స్ పళ్ల మీద మదువుగా రుద్దుతూ శుభ్రం చేసేవి. ఆ బ్రిజిల్స్ని రకరకాల వస్తువులతో తయారుచేసేవారు. అయితే ఇది కొందరికే అందుబాటులో ఉండేది.1780లో యూకేలో మొదటిసారి విలియం అడ్డీస్ అనే వ్యక్తి జైల్లో ఉండగా, పళ్లను శుభ్రం చేసుకునేందుకు సొంతంగా బ్రష్ తయారుచేసుకున్నాడు. ఆయన బయటకు వచ్చాక వాటిని తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాడు. అలా బ్రష్‌లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఆయన మరణించాక ఆయన కొడుకు ఆ పనిని కొనసాగించాడు. ఆ తర్వాత అనేక కంపెనీలు బ్రష్‌ల తయారీ మొదలుపెట్టాయి. ఇప్పుడు రకరకాల రూపాల్లో బ్రష్‌లు వస్తున్నాయి. చూశారా! ఇవాళ మనం వాడే బ్రష్‌ల వెనుక ఇంత చరిత్ర ఉంది. -
టూత్ బ్రష్ మారుస్తున్నారా?ఎన్నాళ్లకు మార్చాలి? లేదంటే...!
ఉదయం లేవగానే పళ్ళు తోముకోవడం అనేది మనం చిన్నప్పటినుంచీ నేర్చుకుంటున్న ప్రాథమిక పాఠం. దంతాల ఆరోగ్యాన్ని(Oral health)కాపాడుకోవాలన్నా, లేదా నోరు పరిశుభ్రంగా ఉండాలన్నా క్రమం తప్పకుండా బ్రష్ చేసుకోవడం అవసరం. లేదంటే నోరు దుర్వాసన రావడం మాత్రమే కాదు. అనేక రోగాలకు దారి చూపించిన వారమవుతాం. పళ్లు తోముకునేందుకు సాధారణంటా అందరూ టూత్ బ్రష్ (tooth brush)నే వాడతాం. వేప పుల్లలతో పళ్లు తోముకునే వారు కూడా ఉన్నప్పటికీ టూత్ బ్రష్ వాడే వారే ఎక్కువ. అయితే ఈ బ్రష్ ఎన్నిరోజులకు ఒకసారి మార్చాలి. ఏళ్ల తరబడి ఒకే టూత్ బ్రష్‌ను వాడవచ్చా? ఇలా వాడితే ఎలాంటి సమస్యలొస్తాయి? వీటి గురించి ఆలోచించారా ఎపుడైనా?ఎపుడు మార్చాలి?దంత సంరక్షణ విషయంలో రోజూ బ్రష్ చేయడం ఎంత ముఖ్యమో, సమయానికి బ్రష్ మార్చడమూ అంతే ముఖ్యం. టూత్ బ్రష్ ను ఎన్ని రోజులు ఉపయోగించాలి అనే విషయంలో దంత వైద్యులు కచ్చితమమైన సిఫార్సులున్నాయి. ప్రతి మూడు నుండి నాలుగు నెలలకు మార్చమని సిఫార్సు చేస్తారు. అరిగిపోయిన టూత్ బ్రష్ వాడుతూనే ఉంటానని చెబితే దంతక్షయం, చిగుళ్ల వ్యాధి వంటి అనేక సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ సూచనలను నిర్లక్ష్యం చేసినా, అవగాహనా లేమితో ప్రయత్నించినా నష్టం తప్పదు అరిగిపోయిన లేదా, విరిగిపోయిన లేదా పాడైపోయిన బ్రష్ లను అస్సలు వాడకూడదు. అటువంటి అరిగిపోయిన టూత్ బ్రష్‌ను ఉపయోగించడం వల్ల దంతాల నుండి బ్యాక్టీరియా పోదు సరికదా మరికొన్ని వ్యాధులకుమూలవుతుంది. శానిటైజ్బ్రష్లను తరచుగా మార్చడంతో పాటు ఉపయోగించిన తర్వాత టూత్ బ్రష్‌ను నీటితో బాగా కడగాలి. కనీసం వారానికి ఒకసారి శానిటైజ్ చేయాలి. వీటికి ప్రత్యేకమైన శానిటైజర్ల పరికరాలున్నాయి. లేని పక్షంలో వేడి నీళ్లలో నానబెట్టి, బాగా కడగాలి. యాంటీమైక్రోబయల్ మౌత్‌వాష్‌లో లేదా నీరు, వెనిగర్, బేకింగ్ సోడా మిశ్రమంలో 30 నిమిషాలు నానబెట్టి శుభ్రం చేసుకోవాలి.అలాగే బ్రష్ హోల్డర్లను బాత్రూంలలో అస్సలు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియా బ్రష్ ద్వారా మన శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ముంది.టూత్ బ్రష్‌లను ఎవరితోనూ పంచుకోవద్దు. ప్రతి ఒక్కరికి వేర్వేరు నోటి బ్యాక్టీరియా ఉంటుంది .సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు ఒకసారి మాన్యువల్ టూత్ బ్రష్‌ను మార్చాలి. ముఖ్యంగా నోటి శస్త్రచికిత్స, రూట్ కెనాల్ థెరపీ, చిగుళ్ల వ్యాధికి చికిత్స వంటి పంటి చికిత్సల తర్వాత.. బ్రష్ కచ్చితంగా మార్చాలని నిపుణులు అంటున్నారు. వైద్యం చేసిన ప్రాంతంలో బ్యాక్టీరియాను ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ ముప్పు తగ్గించడానికి.. కొత్త బ్రష్ వాడటం మంచిది. చదవండి: 32 ఏళ్ల వయసులో సీఈవో కరిష్మా కీలక నిర్ణయంఅనారోగ్యం తరువాతజలుబు, ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్ వంటి అంటువ్యాధుల నుంచి కోలుకున్న తర్వాత, టూత్ బ్రష్‌ను కచ్చితంగా మార్చాలి. బాక్టీరియా, వైరస్లు మీ టూత్ బ్లష్ పళ్లపై ఉంటాయి. ఇది మళ్లి ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశాన్ని పెంచుతుంది.క్ష్మక్రిములు వ్యాప్తి చెందే ప్రమాదాన్ని నివారించాలంటే ఏదైనా అనారోగ్యం నుంచి కోలుకున్న తరువాత పాత బ్రష్‌ను వదిలేసి, కొత్త బ్రష్‌ను ఎంచుకోవాలి. అలాగే పాతబ్రష్ను బ్రష్‌నుంచి కూడా తొలగించడం కూడా చాలా ఉత్తమం. ఈ విషయంలో పిల్లల బ్రష్ విషయంలో మరింత అప్రమత్తత అవసరం. ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వాడుతున్నా కూడా చాలా త్వరగా బ్రష్‌ను మార్చాల్సి ఉంటుంది. ప్రతి రెండు మూడు నెలలకోసారి దాని తలను(Head) మార్చుకోవాలి. ఎందుకంటే సాధారణ బ్రష్‌లతో పోలిస్తే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లు ఇంకా వేగంగా అరిగిపోతాయి. -
వెదురు బ్రష్‌లు ఎప్పుడైనా చూశారా..?
సహజ సిద్ధంగా లభించే వెదురుతో తయారు చేసిన బ్రష్‌లు ఎప్పుడైనా చూశారా.. వినడానికి కాస్త కొత్తగా అనిపించినా ఈ రకం బ్రష్‌లు చాలా కాలంగా వినియోగంలో ఉన్నాయి. ఉదయం లేచి ప్లాస్టిక్‌తో తయారైన బ్రష్‌లు వినియోగిస్తున్నంతగా వెదురు బ్రష్‌లకు ప్రచారం లభించలేదు. అయితే గత కొన్నేళ్లుగా ప్రకృతి ప్రేమికులు మాత్రం ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు వెదురు బ్రష్‌ల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ బ్రష్‌ల స్థానంలో వెదురు వస్తువులను అందుబాటులోకి తెస్తున్నారు. పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, తదితర ప్రదేశాల్లో తమవంతు కృషి చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటి వరకూ సుమారు 30 వేల మంది ఇలా ప్లాస్టిక్ నుంచి వెదురు బ్రష్‌లకు మారినట్లు పేర్కొంటున్నారు.హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్కు, యూసఫ్‌గూడ, కృష్ణకాంత్ పార్కు, మన్సూరాబాద్ పెద్దచెరువు, పీర్జాగూడ, భాగ్యనర్ నందనవనం పార్కు తదితర ప్రదేశాల్లో విశ్వ సస్టైనబుల్ ఫౌండేషన్ సభ్యులు వెదురు బ్రష్‌ల వినియోగం గురించి అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఎక్స్చేంజ్ కార్యక్రమంలో సేకరించిన ప్లాస్టిక్ బ్రష్‌లను విశాఖలోని రివర్స్ ఇంజినీరింగ్ ప్లాంట్‌కు తరలించి, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ తయారీకి వినియోగిస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకూ ఈ టూత్ బ్రష్‌ల ఎక్స్చేంజ్ కార్యక్రమం ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరులోనూ ఈ తరహా కార్యక్రమాలను చేపడుతున్నారు. మనమూ ఈ తరహా వెదురు బ్రష్‌లను ట్రై చేద్దామా.. సామాజిక బాధ్యతగానే..బ్రష్ అనేది నిత్యం ప్రతి ఒక్కరూ వినియోగించే వస్తువు. అయితే మార్కెట్లో ఎక్కువగా ప్లాస్టిక్‌తో తయారు చేసినవి ప్రాచుర్యంలో ఉన్నాయి. ఫలితంగా ఎలాంటి దుష్ప్రభావాలు ఉన్నాయి, వాటి స్థానంలో ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి రెండు నెలలకు ఒక బ్రష్ పడేసినా కోట్ల బ్రష్‌లు వ్యర్థాల్లో కలిసిపోతున్నాయి. వాటిని నియంత్రించాలన్నదే మా ఆలోచన. మేం వ్యాపార ధోరణతో కాకుండా సామాజిక బాధ్యతగా ఈ ప్రమోషన్ వర్క్ చేస్తున్నాం. శనివారం కేబీఆర్ పార్కు దగ్గర ఏర్పాటు చేసిన స్టాల్‌కు వాకర్స్ వచ్చి విషయం అడిగి తెలుసుకున్నారు. చాలా మంది మేమూ మారతాం అంటున్నారు. బ్రష్‌లను తీసుకుంటున్నారు. – అనూప్‌కుమార్, వాలంటీర్, విశ్వ సస్టైనబుల్ ఫౌండేషన్ -
బ్రష్ మార్చి ఎంతకాలం అయ్యింది..?
మనలో చాలామంది టూత్‌బ్రష్‌ను ఏళ్ల తరబడి వాడేస్తుంటారు. మరీ ఏళ్లు కాకపోయినా బ్రిజిల్స్ అంటే మనం పళ్లు తోముకునే భాగం బాగుంటే కనక కనీసం ఏడాదికి తగ్గకుండా వాడతారు. అయితే టూత్‌బ్రష్‌ను అంతకాలం పాటు వాడటం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్యనిపుణులు.టూత్‌బ్రష్‌ను ఇంతకాలం లోపు మార్చాలనే విషయంలో నిర్దిష్టమైన మార్గదర్శకం అంటూ ఏమీ లేకపోయినప్పటికీ మూడు నాలుగు నెలలకోసారి మార్చడం మంచిదంటున్నారు వైద్యులు. అదేవిధంగా బ్రిజిల్స్ వంగి΄ోయినప్పుడు, లేదా కొన్ని బ్రిజిల్స్ ఊడిపోయినప్పుడు... ఊడుతున్నట్లుగా ఉన్నప్పుడు వెంటనే బ్రష్ మార్చడం మంచిది. బ్రష్‌ను, టంగ్క్లీనర్ను బాత్రూమ్లో కాకుండా బయట ఎక్కడైనా పెట్టుకోవాలి. మరో ముఖ్యవిషయం... ఏదైనా జబ్బు పడి కోలుకున్న తర్వాత అప్పటివరకు వాడుతున్న బ్రష్ కొత్తదైనా సరే, దానిని పారేసి, కొత్త బ్రష్ కొనుక్కోవడం మంచిది. ఎందుకంటే జబ్బుపడ్డప్పుడు ... అంటే వైరల్ ఫీవర్స్, డెండ్యూ, మలేరియా, టైఫాయిడ్... మరీ ముఖ్యంగా దంత వ్యాధులతో బాధపడుతున్ననప్పుడు తప్పనిసరిగా బ్రష్ మార్చడం అవసరం. ఇంటిల్లిపాదీ ఒకే బాక్స్‌లో బ్రష్‌లు పెట్టుకోవడం సాధారణం.. అటువంటప్పుడు రోజూ బ్రష్ చేసుకునేముందు శుభ్రంగా కడుక్కోవడం మంచిది.(చదవండి: స్ట్రాంగ్ రోగ నిరోధక శక్తికి సరిపోయే బూస్టర్స్ ఇవే..!) -
ఈ టీత్ క్లీనర్ ఉంటే..ముత్యాల్లాంటి పలువరుస మీ సొంతం!
ముత్యాల్లాంటి పలువరుస ముఖానికి ఎనలేని అందాన్ని తీసుకొస్తుంది. నవ్వినా.. మాట కలిపినా.. పలువరుసే ఎదుటివాళ్లను ఆకర్షిస్తుంది. అలా పళ్లు తెల్లగా మెరిసిపోవాలంటే.. నోటి దుర్వాసన మాయం కావాలంటే వెంటనే ఈ ప్రొఫెషనల్ టీత్ క్లీనర్‌ని తెచ్చేసుకోండి. మరీ ముఖ్యంగా స్మోకింగ్, వైన్, కాఫీ అలవాటున్నవాళ్లు దీంతో ఉపశమనం పొందొచ్చు. ఈ డెంటల్ కాలిక్యులస్ రిమూవల్ టూల్.. సాఫ్ట్, నార్మల్, మీడియం, స్ట్రాంగ్, సూపర్ స్ట్రాంగ్ వంటి ఐదు అడ్జస్టబుల్ మోడ్స్‌తో పని చేస్తుంది. ఇది చిగుళ్ల ఇరుకుల్లో, దంతాల చుట్టూ పేరుకున్న గారను పూర్తిగా తొలగిస్తుంది. ఈ మెషిన్ కారణంగా పళ్లకు, పళ్ల మీది ఎనామిల్ పొరకు ఎలాంటి నష్టం వాటిల్లదు. దీనికి అడాప్టర్‌తో పాటు.. ల్యాప్టాప్తోనైనా, పవర్ బ్యాంక్తోనైనా, కారులోనైనా చార్జింగ్ పెట్టుకోవచ్చు. సీ టైప్ చార్జర్ అనువైనది. లోపలికున్న దంతాలు, పై పళ్ల లోపలి భాగాలు స్పష్టంగా కనిపించడానికి ప్రత్యేకమైన డెంటల్ మిర్రర్ లభిస్తుంది. దీని హెడ్‌కి ఎల్ఈడీ లైట్ అమర్చి ఉండటంతో పళ్లను తేలికగా శుభ్రం చేసుకోవచ్చు. దీని ధర సుమారుగా 155 డాలర్లు. అంటే 12,893 రూపాయలన్న మాట. ఇతర మోడ్స్, ఆప్షన్స్‌ని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. (చదవండి: పక్షులు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయా? అధ్యయనంలో షాకింగ్ విషయాలు) -
వింత ఘటన: ఓ మహిళ టూత్‌బ్రెష్‌ని అనుకోకుండా మింగేసింది! అంతే..
ఏదైనా వస్తువు నోట్లో సరదాగా పెట్టుకుని అనుకోకుండా మింగడం జరగుతుంది. ఇది అత్యంత సాధారణ విషయం. ప్రమాదకరమైన వస్తువు కాకపోతే వైద్యులు లేద పెద్దవాళ్ల సాయంతో బయటకు తెచ్చేస్తారు. అసలు దంతాలను క్లీన్ చేసుకునే టూత్ బ్రెష్‌ని మింగడం గురించి విన్నారా?. అస్సలు అదే ఎలా జరుగుతుంది అనిపిస్తుంది కదా!కానీ ఇక్కడొక మహిళ ఏం చేసిందో గానీ అమాంతం టూత్‌బ్రెష్‌ని అయితే మింగేసింది. ఇక ఆ తర్వాత ఆమె పరిస్థితి..మాటలకందనిది. స్పానిష్‌కి చెందిన 21 ఏళ్ల హీజియా అనే మహిళ టర్కీ మాంస ఫుల్‌గా లాంగించింది. ఆ తర్వాత దంతాల్లో ఇరుక్కుపోయిన పదార్థాలను టూత్ బ్రెష్‌తో క్లీన్ చేసుకుంటుండగా పొరపాటున \మింగేసింది. అది గొంతులో అడ్డుపడి నరకయాతన అనుభవించింది. ఒకరకంగా చెప్పాలంటే ఊపిరాడక చావు అంచెలదాక వెళ్లిందనే చెప్పాలి. ఏం చేయాలో తోచక తండ్రిని సాయం కోరగా..ఏదైనా బలవంతంగా ప్రయత్నిస్తే..ఎక్కడ? ఆమె గొంతుకు సమస్య వస్తుందన్న భయంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించాడు. అక్కడ ఈ ఇబ్బందికర పరిస్థితిని వివరించగా..వైద్యులు సైతం ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇదంతా నిజమేనా? అన్న సందేహం వచ్చింది. చివరికి ఎక్స్‌రే తీయగా నిజంగానే ఇరుక్కుపోయిందని గుర్తించారు. దీంతో సర్జన్లు సుమారు రెండు నుంచి మూడు నిమిషాలు స్టడీ చేసి అన్నవాహికలో ఇరుక్కుపోయిన ఆ టూత్‌బ్రెష్‌ని సర్జరీ అవసరం లేకుండానే ఓ వైద్య పరికరంతో బయటకు తీశారు. జస్ట్ 40 నిమిషాల్లో విజయవంతంగా ఈ ప్రక్రియనంతా పూర్తి చేశారు వైద్యులు. ఏదీ ఏమైనా ఇది అత్యంత విచిత్రమైన ఘటన కదూ.! (చదవండి: ముక్కు క్యాన్సర్ అంటే..? దీని కారణంగా ఓ మహిళ మొత్తం ముక్కునే..) -
కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పాడేయాల్సిందే!
సాక్షి,న్యూఢిల్లీ : కరోనా వైరస్ సోకిన తరువాత కోలుకోవడం ఒక ఎత్తయితే.. కోలుకున్న తరువాత మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మరో ఎత్తు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నకోవిడ్-19 వ్యాక్సిన్లు వైరస్‌కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పని చేస్తాయని చెబుతున్నప్పటికీ అన్ని పరిస్థితులలోనూ 100 శాతం రక్షణ ఇవ్వలేదని నిపుణులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకున్నవారు, వ్యాధినుంచి కోలుకున్న వారు కూడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమైనది. ముఖ్యగా వైరస్ బారిన పడి కోలుకున్న వారు వెంటనే తమ టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ మార్చాలని దంత వైద్యులు తాజాగా సూచిస్తున్నారు. కరోనా లక్షణాలు వచ్చిన 20 రోజుల తర్వాత వీటిని మార్చాలని పేర్కొన్నారు. లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ డెంటల్ సర్జరీ అధిపతి డాక్టర్ ప్రవేష్ మెహ్రా అభిప్రాయం ప్రకారం వైరస్ నుంచి కోలుకున్నవారు తక్షణమే తమ టూత్ బ్రష్‌లను మార్చాలి. అలా చేయడం వల్ల మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్కు గురికాకుండా కాపాడవచ్చని చెబుతున్నారు. అంతేకాదు అదే వాష్‌రూమ్‌ను ఉపయోగిస్తున్న వారిని కూడా ఇది రక్షిస్తుందంటున్నారు. బ్రష్‌లు, టంగ్ క్లీనర్లు కూడా వైరస్‌ను వ్యాప్తి చేస్తాయనే విషయాన్ని విస్మరించొద్దని డాక్టర్ ప్రవేష్ మెహ్రా వివరించారు. ఈ వాదనను ఆకాష్ హెల్త్‌కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ (డెంటల్) డాక్టర్ భూమికా మదన్ కూడా అంగీకరించారు. సాధారణంగా ఫ్లూ, దగ్గు, జలుబు బారిన పడిన వ్యక్తులకు కోలుకున్న తర్వాత టూత్ బ్రష్, క్లీనర్లను మార్చమని తాను సిఫారసు చేస్తాననీ, ఇపుడు కోవిడ్ బాధితులకు కూడా ఇదే సలహా ఇస్తున్నామని ఆమె తెలిపారు. టూత్ బ్రష్ ఉపరితలంపై బ్యాక్టీరియా / వైరస్ దాగి ఉంటుందని ఇది శ్వాసకోశ అంటువ్యాధులకు కారణమవుతుందని డాక్టర్ వివరించారు. టూత్ బ్రష్ ద్వారా ఎలా వ్యాప్తి చెందుతుంది? సాధారణంగా ఒక వ్యక్తి దగ్గు, తుమ్ము, అరవడం, మాట్లాడటం లేదా నవ్వినప్పుడు విడుదలయ్యే తుంపర్లు , డైరెక్టుగా గానీ, కొంతకాలం గాలిలో ఉండిగానీ ముక్కు లేదా నోటిద్వారా ఇతరుల శరీరంలోకి ప్రవేశిస్తాయి. వ్యాధి సోకిన వ్యక్తి బ్రష్ చేసినపుడు కూడా వైరస్ ఇలాగే వ్యాప్తి చెందుతుంది. కోలుకున్న తరువాత కూడా ఈ వస్తువులను నిరంతరం ఉపయోగించడం వల్ల అధిక సాంద్రత గల సార్స్ సీవోవీ-2 వైరస్ ఇతరులకూ సోకుతుంది. ఈ నేపథ్యంలో ఒక ఇంటిలో ఎవరికైనా కరోనావైరస్ సంక్రమించినట్లయితే, సోకిన వ్యక్తి ఉపయోగించిన టాయిలెట్ వస్తువులను (టూత్ బ్రష్, నాలుక క్లీనర్ మొదలైనవి) బయటకు విసిరేయడం మంచిదని వీరు సూచిస్తున్నారు. చదవండి: ఆక్సిజన్ సరఫరా: కేంద్రానికి చుక్కెదురు సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ వచ్చేసింది: రష్యా సీటీ స్కాన్: ఎయిమ్స్ డైరెక్టర్ వాదనలను ఖండించిన ఐఆర్‌ఐఏ -
ఆకట్టుకున్న ఇన్నోవేటర్స్ స్టార్టప్ కన్క్లేవ్
రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న రూరల్ ఇన్నోవేటర్స్ స్టార్టప్ కన్క్లేవ్ కార్యక్రమాన్ని గురువారం ఉదయం ఉపరాష్ట్రపతి ఆర్.వెంకయ్యనాయుడు ప్రారంభించారు. 23 రాష్ట్రాలకు చెందిన 300 మంది ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 190 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులతో పాటు పారిశుధ్ధ్యం, ఆరోగ్యం, పర్యావరణం తదితర వాటిపై వివిధ రకాల పనిముట్లు, నమూనాలను ఈ స్టాల్స్‌లో ప్రదర్శించారు. స్టాల్స్‌ను ప్రారంభించిన అనంతరం ఉపరాష్ట్రపతి వాటి పనితీరు, ఉపయోగాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాంక్రిపాల్‌యాదవ్, ఉపముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ ఆలీ, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎన్ఐఆర్డీపీఆర్ డీజీ డాక్టర్ డబ్ల్యూఆర్.రెడ్డి, డిప్యూటీ డిజీ రాధికారస్తోగి తదితరులు పాల్గొన్నారు. పంట రక్షణకు లేజర్ పరికరం చిన్న, సన్నకారు రైతులు పండించిన పంట చేతికి వచ్చే సమయంలో అడవి పందులు, ఇతర జంతువుల కారణంగా 20 శాతం పంటను కోల్పొతున్నారు. దీని నివారణకు కరీంనగర్ జిల్లా పోలారం గ్రామానికి చెందిన బి.నాగరాజు లేజర్ టెక్నాలజీతో సౌండ్ సిస్టాన్ని కనుగోన్నాడు. కేవలం రెండు వేల రూపాయలతో పంటను కాపాడుకోవచ్చునని తెలుపుతున్నాడు. రాత్రి సమయంలో పంటలోకి ఏ జంతువులు వచ్చిన లేజర్ కిరణంతో అనుసంధానమైన స్పీకర్ ద్వారా చప్పుడు అవుతుందన్నారు. దీంతో జంతువులు పారిపోతాయన్నారు. ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. గర్భిణులకు ప్రత్యేక పౌష్టికాహారం హైదరాబాద్‌లోని మూడు పాఠశాలలకు చెందిన త్రిపురా, కీర్తి, జెస్సికాలు గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులతో పాటు నిరుపేదలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు కొత్తగా చాక్లెట్ తరహాలో చిరుధాన్యాలు, విటమిన్స్‌తో కూడిన బిస్కెట్లను తయారు చేశారు. వారానికి మూడు బిస్కెట్లను తింటే గర్భిణులలో రక్తహీనత, ఫొలిక్ యాసిడ్, విటమిన్స్‌ల సమస్య ఉండదని తెలుపుతున్నారు. ప్రస్తుతం గర్భిణులు మందు బిల్లలను వేసేందుకు అనాసక్తి చూపుతారన్నారు. గ్రామాల్లో వారికి సరైన పౌష్టికాహారం లేక పుట్టే పిల్లలు సైతం విటమిన్స్ లోపంతో అనారోగ్యంగా పుడతారని, ఈ బిస్కెట్లను తీసుకుంటే వాటిని నివారించవచ్చునని తెలుపుతున్నారు. ఇది కేవలం 20 రూపాయలకు చొప్పున దొరుకుతుందన్నారు. సోలార్ సెల్ఫ్ ఆటో వాటరింగ్ సిస్టమ్ డ్రిప్ ఇరిగేషన్‌తో పండిస్తున్న పంటలకు ఖర్చు తగ్గించేందుకు సోలార్ సెల్ఫ్ ఆటో వాటరింగ్ సిస్టమ్‌ను రూపొందిస్తున్నట్లు చర్లపల్లికి చెందిన మేఘన తెలిపారు. ఇది సోలార్ సిస్టమ్‌తో పూర్తిగా పని చేస్తుందన్నారు. నేలను తడిగా ఉంచడంతో పాటు అతి తక్కువ ఖర్చు అవుతుందన్నారు. చిటికెలో చిరుధాన్యాల డ్రింక్స్ కాఫీ, టీ తరహాలో చిరుధాన్యాలతో ఇన్స్టెంట్ డ్రింక్స్‌ను తయారు చేశారు. కాఫీ, టీలను అందించే యంత్రాన్ని ఉపయోగించి రాగి, జొన్న, తైదులు(అంబలి) తదితర మిలెట్ ద్రవాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఇది మార్కెట్లోకి విక్రయించేందుకు సిద్ధమవుతున్నామని హైదరాబాద్ ప్రగతినగర్‌కు చెందిన కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. అలాగే మైదాను ఉపయోగించకుండా రాగి, సజ్జ, జోన్న, మొక్కజోన్న బిస్కెట్లను తయారు చేస్తున్నామన్నారు. ఇక్రిశాట్‌తో మొట్టమొదటిసారిగా పేటెంట్ హక్కులను పొందామన్నారు. త్వరలో మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఎకో టూత్‌బ్రెష్‌తో ఆరోగ్యం మెండు విజయనగరానికి చెందిన వి.రమేష్, తేజలు ఎకో టూత్‌బ్రెష్‌లను తయారు చేశారు. తాటి పీచును ఉపయోగించి ఈ బ్రెష్‌ను ఉపయోగించుకోవచ్చు. కట్టెతో తయారైన ఈ బ్రెష్‌కు తాటి పీచును జోడించారు. పీచు పాడైన అనంతరం తిరిగి తీసి వాడుకునే సౌకర్యం ఉంది. పది రోజులకు ఒక్కసారి పీచును తీసి వేసి కొత్తగా ఏర్పాటు చేసుకోవాలని రమేష్ తెలిపారు. రూ.10కి ఒక టూత్‌బ్రెష్‌ను విక్రయించేందుకు నిర్ణయించామన్నారు. ఒక్కసారి కొనుగోలు చేస్తే 3–4 సంవత్సరాల వరకు వాడవచ్చునన్నారు. పర్యావరణానికి సైతం ఇది ఎలాంటి హాని ఉండదన్నారు. ప్లాస్టిక్‌తో చేస్తున్న టూత్‌బ్రెష్‌లతో ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. చిగుళ్లకు సైతం ఈ బ్రెష్‌ల వల్ల ఎలాంటి హాని ఉండదన్నారు. -
32 పళ్లు.. 3 క్షణాలు..
మీరు పరమ బద్దకిస్టులా.. పళ్లు తోముకోవడానికి కూడా ఆలోచించే టైపా.. లేదా మీరు బాగా బిజీనా.. అయితే.. ఇది మీలాంటోళ్ల కోసమే.. దీని పేరు యూనికో.. ఇదో స్మార్ట్ బ్రష్. కేవలం 3 క్షణాల్లో మన 32 పళ్లనూ శుభ్రం చేసేస్తుందట. ఇందులో చిన్నచిన్న సైజుల్లో చాలా బ్రష్షులుంటాయి. మైక్రో పంప్ సిస్టం ద్వారా టూత్ పేస్టు ఆయా బ్రష్షులకు చేరుతుంది. దీనికి తగిలించి ఉండే పవర్ యూనిట్ ద్వారా ఆ బ్రష్షులు పనిచేస్తాయి. మన నోటికి సరిపోయేటట్టు 4 రకాల సైజుల్లో దొరుకుతుంది. దీంతోపాటు ఓ బాక్సు ఇస్తారు. బ్రష్షును వాడిన తర్వాత దాన్ని బాక్సులో పెట్టేస్తే.. అందులో ఉండే యూవీ కిరణాల ద్వారా అది క్లీన్ అయిపోతుంది. దాంతోపాటు చార్జింగ్ కూడా అయిపోతుంది. మొబైల్లో వాడుకోవడానికి వీలుగా ఓ యాప్ కూడా ఉంది. దాన్ని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే.. బ్రష్షు పనిచేసే స్పీడు.. సమయాన్ని మనం మార్చుకోవచ్చు. దీని ధర రూ.8,065. -
పంజాబ్ కుర్రాడు.. ప్రపంచ రికార్డు!
న్యూఢిల్లీ: పంజాబ్‌కు చెందిన 25 ఏళ్ల సందీప్‌సింగ్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. నోట్లో ఓ టూత్‌బ్రష్ పెట్టుకొని దానిపై వేగంగా తిరుగుతున్న బాస్కెట్ బాల్‌ను 53 సెకన్లపాటు నిలిపాడు. దీంతో ‘టూత్‌బ్రష్‌పై ఎక్కువ సమయంపాటు బాస్కెట్‌బాల్‌ను తిప్పిన’ రికార్డు సందీప్‌సింగ్ పేరుమీద నమోదైంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను సందీప్‌సింగ్ యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ముందుగా ఓ బాస్కెట్‌బాల్‌ను తీసుకొని దానిని ఓ టూత్‌బ్రష్‌పై పెట్టి వేగంగా తిప్పాడు. ఆ తర్వాత టూత్‌బ్రష్‌ను తిరుగుతున్న బాల్‌తో పాటు నోట్లో పెట్టుకున్నాడు. అలా దానిని 53 సెకన్ల 62 నానో సెకన్లపాటు నిలిపాడు. ఇప్పటివరకు ఎవరూ ఇంతసేపు టూత్‌బ్రష్‌పై బాస్కెట్‌బాల్‌ను నోట్లో పెట్టుకొని నిలపలేదని చెప్పాడు. అయితే దీనిని గిన్నిస్ రికార్డు నిర్వాహకులు ధ్రువీకరించారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అయితే సందీప్ ప్రయత్నంపై అతడి సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
గొంతులోకి టూత్ బ్రష్
మారాల (బుక్కపట్నం) : గ్రామానికి చెందిన చంద్రశేఖర్ కుమారుడు హర్షవర్ధన్ ఆదివారం ఉదయం పళ్లు శుభ్రం చేసుకునేందుకు బ్రష్ చేసుకుంటుండగా పొరపాటున అది గొంతులోకి జారింది. బాలుడి తల్లీదండ్రులు ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లారు. బాలుడు అవ్వతాతల వద్ద ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు రామ్మోహన్ ఆ బాలుడ్ని అనంతపురంలోని ఈఎన్టీ డాక్టర్ శ్రీనాథ్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన చికిత్స చేసి బ్రష్‌ను బయటకు తీశారు. బాలుడికి ప్రాణాపాయం తప్పడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.