ఉదయం లేవగానే పళ్ళు తోముకోవడం అనేది మనం చిన్నప్పటినుంచీ నేర్చుకుంటున్న ప్రాథమిక పాఠం. దంతాల ఆరోగ్యాన్ని(Oral health)కాపాడుకోవాలన్నా, లేదా నోరు పరిశుభ్రంగా ఉండాలన్నా క్రమం తప్పకుండా బ్రష్ చేసుకోవడం అవసరం. లేదంటే నోరు దుర్వాసన రావడం మాత్రమే కాదు. అనేక రోగాలకు దారి చూపించిన వారమవుతాం. పళ్లు తోముకునేందుకు సాధారణంటా అందరూ టూత్ బ్రష్ (tooth brush)నే వాడతాం. వేప పుల్లలతో పళ్లు తోముకునే వారు కూడా ఉన్నప్పటికీ టూత్ బ్రష్ వాడే వారే ఎక్కువ. అయితే ఈ బ్రష్ ఎన్నిరోజులకు ఒకసారి మార్చాలి. ఏళ్ల తరబడి ఒకే టూత్ బ్రష్‌ను వాడవచ్చా? ఇలా వాడితే ఎలాంటి సమస్యలొస్తాయి? వీటి గురించి ఆలోచించారా ఎపుడైనా?
ఎపుడు మార్చాలి?
దంత సంరక్షణ విషయంలో రోజూ బ్రష్ చేయడం ఎంత ముఖ్యమో, సమయానికి బ్రష్ మార్చడమూ అంతే ముఖ్యం. టూత్ బ్రష్ ను ఎన్ని రోజులు ఉపయోగించాలి అనే విషయంలో దంత వైద్యులు కచ్చితమమైన సిఫార్సులున్నాయి. ప్రతి మూడు నుండి నాలుగు నెలలకు మార్చమని సిఫార్సు చేస్తారు. అరిగిపోయిన టూత్ బ్రష్ వాడుతూనే ఉంటానని చెబితే దంతక్షయం, చిగుళ్ల వ్యాధి వంటి అనేక సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ సూచనలను నిర్లక్ష్యం చేసినా, అవగాహనా లేమితో ప్రయత్నించినా నష్టం తప్పదు అరిగిపోయిన లేదా, విరిగిపోయిన లేదా పాడైపోయిన బ్రష్ లను అస్సలు వాడకూడదు. అటువంటి అరిగిపోయిన టూత్ బ్రష్‌ను ఉపయోగించడం వల్ల దంతాల నుండి బ్యాక్టీరియా పోదు సరికదా మరికొన్ని వ్యాధులకుమూలవుతుంది.
శానిటైజ్
బ్రష్‌లను తరచుగా మార్చడంతో పాటు ఉపయోగించిన తర్వాత టూత్ బ్రష్‌ను నీటితో బాగా కడగాలి. కనీసం వారానికి ఒకసారి శానిటైజ్ చేయాలి. వీటికి ప్రత్యేకమైన శానిటైజర్ల పరికరాలున్నాయి. లేని పక్షంలో వేడి నీళ్లలో నానబెట్టి, బాగా కడగాలి. యాంటీమైక్రోబయల్ మౌత్‌వాష్‌లో లేదా నీరు, వెనిగర్, బేకింగ్ సోడా మిశ్రమంలో 30 నిమిషాలు నానబెట్టి శుభ్రం చేసుకోవాలి.
అలాగే బ్రష్ హోల్డర్లను బాత్‌రూంలలో అస్సలు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియా బ్రష్ ద్వారా మన శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ముంది.టూత్ బ్రష్‌లను ఎవరితోనూ పంచుకోవద్దు. ప్రతి ఒక్కరికి వేర్వేరు నోటి బ్యాక్టీరియా ఉంటుంది .సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు ఒకసారి మాన్యువల్ టూత్ బ్రష్‌ను మార్చాలి. ముఖ్యంగా నోటి శస్త్రచికిత్స, రూట్ కెనాల్ థెరపీ, చిగుళ్ల వ్యాధికి చికిత్స వంటి పంటి చికిత్సల తర్వాత.. బ్రష్ కచ్చితంగా మార్చాలని నిపుణులు అంటున్నారు. వైద్యం చేసిన ప్రాంతంలో బ్యాక్టీరియాను ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ ముప్పు తగ్గించడానికి.. కొత్త బ్రష్ వాడటం మంచిది.
చదవండి: 32 ఏళ్ల వయసులో సీఈవో కరిష్మా కీలక నిర్ణయం
అనారోగ్యం తరువాత
జలుబు, ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్ వంటి అంటువ్యాధుల నుంచి కోలుకున్న తర్వాత, టూత్ బ్రష్‌ను కచ్చితంగా మార్చాలి. బాక్టీరియా, వైరస్‌లు మీ టూత్ బ్లష్ పళ్లపై ఉంటాయి. ఇది మళ్లి ఇన్ఫెక్షన్‌కు గురయ్యే అవకాశాన్ని పెంచుతుంది.క్ష్మక్రిములు వ్యాప్తి చెందే ప్రమాదాన్ని నివారించాలంటే ఏదైనా అనారోగ్యం నుంచి కోలుకున్న తరువాత పాత బ్రష్‌ను వదిలేసి, కొత్త బ్రష్‌ను ఎంచుకోవాలి. అలాగే పాతబ్రష్‌ను బ్రష్‌నుంచి కూడా తొలగించడం కూడా చాలా ఉత్తమం. ఈ విషయంలో పిల్లల బ్రష్ విషయంలో మరింత అప్రమత్తత అవసరం. ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వాడుతున్నా కూడా చాలా త్వరగా బ్రష్‌ను మార్చాల్సి ఉంటుంది. ప్రతి రెండు మూడు నెలలకోసారి దాని తలను(Head) మార్చుకోవాలి. ఎందుకంటే సాధారణ బ్రష్‌లతో పోలిస్తే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లు ఇంకా వేగంగా అరిగిపోతాయి.
Comments
Please login to add a commentAdd a comment