Bacterial infections
-
బాక్టిరియాతో డ్రెస్సింగ్.. గాయలను త్వరగా తగ్గిస్తుంది!
మన శరీరంలో ఎప్పుడైనా దెబ్బలు తగిలితే బ్యాండేజీ వేసుకుంటాం. ఇక గాయం మానడానికి చాలా రోజులే పడుతుంది. ఈ క్రమంలో బాక్టీరియా చేరకుండా వైద్యుల సూచనతో డ్రెస్సింగ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఓ కొత్తరకమైన డ్రెస్సింగ్‌ను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇది ఏకంగా గాయాన్ని మాయం చేస్తుందట. దీర్ఘకాలిక గాయాలకు చికిత్స చేస్తున్నప్పుడు వాటికి బాక్టీరియా దరిచేరకుండా నిత్యం డ్రెస్సింగ్ చేయడం మనకు తెలిసిందే. అయితే ప్రతిసారి డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు పేషెంట్స్‌కి నొప్పి కలగడం సహజమే. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు కనిపెట్టిన కొత్తరకం డ్రెస్సింగ్ గాయాలను త్వరగా మానేలా చేస్తుందట. గాయపడిన ప్రాంతంలో నొప్పి కలిగించే బయోఫిల్మ్‌లను నాశనం చేసేలా MIT, స్విట్జర్లాండ్‌కు చెందిన డాక్టర్. కున్ రెన్ నేతృత్వంలోని సైంటిస్టులు బయో-కె+ అనే అక్వాసెల్ను కనుగొన్నారు. ఇందులో మూడు రకాల లాక్టోబాసిల్లి ప్రోబయోటిక్ అనే బాక్టిరియా ఉంటుందట. ఇది బయోఫిల్మ్ pH స్థాయిపై దాడిచేసి దానిని నాశనం చేస్తుందట. ఈ కొత్తరకమైన డ్రెస్సింగ్ టెక్నాలజీతో 99.999% వ్యాధికారకాలను చంపేసి గాయం తాలూకూ నొప్పిని తగ్గించిందని పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా ఇందులోని ప్రోబయోటిక్ బ్యాక్టీరియా..గాయాన్ని త్వరగా మానేలా చేయడమే కాకుండా కొత్త చర్మం రావడానికి సహాయపడిందని సైంటిస్టులు తెలిపారు. -
స్మార్ట్‌ఫోన్‌లో వేల కొద్ది బాక్టీరియా.. ఇలా క్లీన్ చేసుకోండి
నిత్యం మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్.. ఎన్నో వేల బ్యాక్టీరియా, వైరస్‌లకి ఆలవాలమనే సంగతి తెలిసిందే! దాన్ని పర్ఫెక్ట్గా శానిటైజ్ చేయాలంటే.. ఇలాంటి స్టెరిలైజర్ డిసిన్ఫెక్షన్ బాక్స్ ఉండాల్సిందే. ఇందులో 3 నిమిషాలు పెట్టి.. ఆన్ బటన్ నొక్కితే చాలు. 99.99 శాతం క్రిములు నాశనం అవుతాయి. ఫోన్ నీట్‌గా మారిపోతుంది. ఇక ఈ బాక్స్‌లో బండి తాళాలు, ఇంటి తాళాలు, మాస్కులతో పాటు.. కళ్లజోడు, బ్లూటూత్, పెన్నులు, నగలు వంటివెన్నో శుభ్రం చేసుకోవచ్చు. ఈ బాక్స్‌ని హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ముందుగానే చార్జింగ్ పెట్టుకుని, వైర్లెస్ మెషిన్లా వాడుకోవచ్చు. భలే ఉంది కదూ! -
'మాంసం తినే బ్యాక్టీరియా'!.. దీని బారిన పడితే..అంతే సంగతులు!
యూఎస్‌లోని తూర్పు తీర వెంబడి సముద్ర జలాల్లో ఈ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది విబ్రియో వల్నిఫికస్ అనే ప్రాణాంతక గాయాల ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఈ బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్లు నెక్రోటైజింగ్ ఫాసిటిస్‌కు దారితీస్తుంది. దీంతో ఓపెన్ గాయం చుట్టూ మాంసం కుళ్లపోవడం ప్రారంభమవుతుంది. దీన్నే మాంసం తినే బ్యాక్టీరియాగా చెబుతారు. ఈ నైక్రోటైజింగ్ ఫాసిటస్ అనేది ఒకటికంటే ఎక్కువ రకాల బ్యాక్టీరియాల వల్ల సంభవిస్తుంది. దీని బారిన పడిన కేసుల్లో చాలావరకు ప్రాణాలు కోల్పోయే అవకాశం గానీ అవయవాన్ని కోల్పోయే ప్రమాదం గానీ ఉంటుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్ బారినే జెన్నిఫర్ బార్లో అనే అట్లాంట మహిళ పడి మరణం అంచులాదాకి వెళ్లొచ్చింది. అసలేం జరిగిందంటే.. జెన్నిఫర్ బార్లో(33) అనే అట్టాంట మహిళ యూఎస్‌లోని బహామాస్ పర్యటనలో ఉన్నప్పుడు..సముద్రపు నీరు కారణంగా చిన్నపాటి గాయం అయ్యింది. చాలా చిన్ననీళ్ల ఒరిపిడి గాయం. అదికాస్త పెద్దదిగా అయ్యి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్కి గురవ్వుతుందని ఊహించను కూడా ఊహించం. అయితే బార్లో కూడా పెద్ద గాయం కాదనే అనుకుంది. చిన్న పాటి క్రీమ్‌లు వంటివి రాసి గాయం పెద్దది కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటిని తీసుకుంది. తగ్గిపోతుందనుకుంటే రోజు రోజుకి పెరుగుతుందేంటి అని ఆశ్చర్యపోయింది కూడా. రెండు వారాలకు పైగా కోమాలోనే.. చిన్న గాయం ఏదో పెద్ద రాడ్‌తో కొట్టినట్ల, లేదా పడిపోతే తగిలిన గాయం మాదిరిగా ఇంత నొప్పి వస్తోందేంటి అని కూడా అనుకుంది. అంతే ఓ రోజు తన నివాసంలోనే హఠాత్తుగా స్ప్రుహ కోల్పోయి పడిపోయింది. ఇది గమనించిన ఆమె సోదరుడు వెంటనే ఆస్పత్రికి హుటాహుటినా తరలించాడు. అక్కడ వైద్యుల ఆమె సెప్టిక్ షాక్‌తో బాధపడుతున్నట్లు నిర్థారించారు. కాలు బాగా వాచిపోయి నొప్పిగా ఉండటమేగాక అక్కడ చర్మం అంతా వేడిగా ఉంది. బ్యాక్టీరియా ఆమె రక్త ప్రవాహంలో ప్రవేశించడంతో బార్లో సుమారు రెండు వారాల పాటు కోమాలోనే ఉండిపోయింది. ఆమె కిడ్నీ, లివర్ ఫెయిల్ అయిన లక్షణాలు కనిపించాయి. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కూడా ఎదురైంది. వైద్యులు కూడా ఆమె దీని నుంచి ఆరోగ్యంతో బయటపడదనే భావించారు. ఆశలన్ని వదులేసి మరీ తమ వంతు ప్రయత్నంగానే వైద్యులు ఆమెకు చికిత్స చేయడం ప్రారంభించారు. ఆమె తొడలో చనిపోయిన కణజాలాన్ని తొలగించడానికి ఏకంగా 12 సర్జరీలు చేశారు. ఆమె కాలును తొలగించకుండానే నయం అయ్యేలా ఎన్నో ప్రయత్నాలు చేశారు. 30కి పైగా సర్జరీలు.. కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక వైద్యులు చివరికి ఆమె కాలును తొలగించారు. ప్రస్తుతం ఆమె కాలు లేకుండా ఎలా దైనందిన జీవితాన్ని లీడ్ చేయాలో నేర్చుకునే పనిలో పడింది. అంతేగాదు ఈ గాయం కారణంగా కాలుని తొలగించకుండా ఉండేలా తొడలోని కణజాలన్ని తొలగించేందుకు గానూ సుమారు 30కి పైగా సర్జరీలు చేయించుకున్నప్పటికీ కాలు కోల్పోక తప్పలేదు బార్లోకి. కాగా, యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం..1996 నివేదికలో యూఎస్‌లో ఏడాదికి 500 నుంచి 1500 దాక నెక్రోటైజింగ్ ఫాసిటిస్‌కి సంబంధించని కేససులు ఉన్నాయని పేర్కొంది. వాటిలో దాదాపు 20 శాతం ప్రాణాంతకంగా ఉన్నాయని వెల్లడించింది. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా ప్రతి ఐదుమందిలో ఒకరు చనిపోయే అవకాశం ఉంటుందని కూడా తెలిపింది. దయచేసి బీచ్‌ల వద్ద సముద్రపు నీటిలో ఎంజాయ్ చేసేటప్పుడూ జాగ్రత్తగా ఉండండి. ఏదైన గాయమైన జాగుకతతో వ్యవహరించండి. (చదవండి: సరోగసీకి ప్రత్యామ్నాయం!.భవిష్యత్తులో వేలాది మహిళలకు..) -
కండ్లకలక వస్తే అలా మాత్రం చేయకండి, కంటిచూపు పోతుంది
కండ్లకలక.. దీన్నే పింక్ ఐ లేదా ఐ ఫ్లూ అని అంటారు. కొంతకాలంగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో కండ్లకలక కేసులు కలవర పెడుతున్నాయి. ఇది తరచుగా బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అసలే వర్షకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడే ప్రజలకు కండ్లకలక ఇప్పుడు మరో సమస్యగా మారింది. ఐ ఫ్లూ కరోనాలా అంటువ్యాధిగా మారుతోంది. కండ్లకలక వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్లను చూసినా ఈ వ్యాధి ఇతరులకు సోకుతుందా? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. కంటిలో చిన్న నలక పడినా ఆ బాధ వర్ణనాతీతం. అందుకే కంటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేశ వ్యాప్తంగా గత కొన్నాళ్లుగా కండ్లకలక కేసులు కలవర పెడుతున్నాయి. వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చే కలకలు ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా గుంపుగా ఉన్న ప్రదేశాల్లో ఈ వ్యాధి సొందరగా ఇతరులకు సోకుతుంది. కండ్లకలక వచ్చిన రోగి నుంచి ఈజీగా ఎనిమిది మందికి వ్యాధి సోకే అవకాశం ఉంది.ఇంట్లో ఒకరికి వస్తే అందరికీ వస్తుంది. వ్యాధి నయం కావడానికి దాదాపు 10 రోజులు పడుతుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే కంటిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి చూపు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. కండ్లకలక లక్షణాలు కళ్లు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతుంది. కంటి నుంచి కంటిన్యూగా నీరు కారుతుంది, కంటిరెప్పలు ఉబ్బిపోతాయి. సరిగా చూడలేకపోవడం, లైట్ వెలుతురును కూడా తట్టుకోలేకపోవడం దీని లక్షణాలు కండ్లకలక వస్తే జ్వరం, తేలిపాటి గొంతునొప్పి కూడా బాధిస్తుంది. కండ్లకలక వస్తే ఏం చేయాలి? కండ్లకలక సోకితే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. కండ్లకు గోరువెచ్చటి కాపడాలు, మంట నుంచి ఉపశమనం పొందడానికి అనెల్జెసిక్స్ వాడొచ్చు. కంటి సమస్యలు రాకుండా ఉండేందుకు యాంటీ బయోటిక్ డ్రాప్స్ వాడాలి. కండ్ల కలక వచ్చిన వ్యక్తులకు దూరంగా ఉండాలి. వాళ్లు వాడిన వస్తువులు వాడొద్దు. కంటిని తరచుగా నీటితో కడుక్కోవాలి. దీంతో తొందరగా తగ్గిపోతుంది. నీళ్లు ఎక్కువగా తీసుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన డైట్‌ను పాటించాలి. కండ్లకలక వస్తే ఇలా అస్సలు చేయొద్దు కండ్లకలక చిన్న సమస్యే అని సొంత వైద్యం చేసుకోవద్దు కళ్లను తరచూ తాకొద్దు, దీనివల్ల సమస్య మరింత పెరుగుతంది ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నప్పడు జనంలోకి తిరగడం వంటివి చేయొద్దు సమస్య చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ సలహా మేరకు చికిత్స తీసుకోవడం ఉత్తమం. కళ్ల కలక లక్షణాలు! 👁🗨కళ్ళలో నొప్పి, మంట, దురద 👁🗨కళ్ళు ఎర్రగా మారడం 👁🗨కళ్ళ నుంచి తరుచుగా నీరు కారడం 👁🗨కళ్ళు వాపు 👁🗨నిద్ర లేచిన తర్వాత కనురెప్ప అతుక్కుపోవడం 👁🗨నిర్లక్ష్యం చేస్తే కండ్ల నుంచి చీము కారడం#Conjuctivitis #HealthForAll #SwasthaBharat #EyeFlu #EyeConjuctivitis pic.twitter.com/rMmPxOdB0g — PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 2, 2023 #Conjuctivitis#HealthForAll#SwasthaBharat pic.twitter.com/1r7hp7II4D — Ministry of Health (@MoHFW_INDIA) August 2, 2023 వాళ్లను చూస్తే కండ్లకలక వస్తుందా? కండ్లకలక వచ్చినవారిని నేరుగా చూస్తే ఇతరులకు కూడా ఆ వ్యాధి సోకుతుందా? అంటే అది ఒట్టి అపోహ మాత్రమే అంటున్నారు వైద్యులు. వైరల్ కన్జక్టివిటిస్ ఉన్న వాళ్లను చూస్తే ఇది వ్యాపించదు. ఈ వ్యాధి ప్రధానంగా చేతుల ద్వారా ఇతరులకు సోకుంది. కండ్లకలక వచ్చిన వాళ్లు వాడిన వస్తువులను తాకడం, ఉపయోగించడం వల్ల ఈ వ్యాధి అంటుకుంటుంది. అలాగే వాళ్లు మాట్లాడేటప్పుడు నోటి తుంపర్ల నుంచి కూడా ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. అంతేకానీ కండ్ల కలక సోకిన వాళ్లు మరొకరిని చూసినంత మాత్రాన్నే వ్యాధి సోకే అవకాశమే లేదు. ఇక సన్ గ్లాసెస్ లేదా ముదురు కళ్లద్దాలు ధరించడం వల్ల కండ్లకలక ఇతరులకు వ్యాపించదు అనే సందేహం చాలామందికి వెంటాడుతుంది. కానీ ఇందులో నిజం లేదు. కళ్లద్దాలు ధరించడం వల్ల అసౌకర్యాన్ని కొంతమేరకు అధిగమించే అవకాశం ఉంటుంది. కానీ వ్యాధిని నిరోధించే ఛాన్స్ లేదు. ✅గత కొద్ది రోజులుగా కళ్ల కలక 👁️కేసులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ✅మరి ఇలాంటి సమయంలో చేయాల్సినవి, చేయకూడనివి తెలిస్తే త్వరగా నయం అవుతుంది. ✅అవేంటో కింది ఇన్ఫోగ్రాఫ్ ద్వారా తెలుసుకోండి#Conjuctivitis #HealthForAll #SwasthaBharat #EyeFlu #EyeConjuctivitis pic.twitter.com/EZ7TLH6axd — PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 2, 2023 -
టాడ్లర్స్ డయేరియా.. చంటి పిల్లల్లో నీళ్ల విరేచనాలు
పోరాడే వయసు పిల్లలు... అంటే ఆర్నెల్ల వయసు నుంచి రెండు, మూడేళ్ల లోపు పిల్లల్ని టాడ్లర్స్ అంటారు. ఆ వయసు పిల్లల్లో వచ్చే నీళ్లవిరేచనాల్ని ‘టాడ్లర్స్ డయేరియా అంటారు. ఈ కండిషన్ చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. అయితే ఇలాంటి పిల్లలకు ఇచ్చే ఆహారంలో కాస్తంత పీచుపదార్థాల మోతాదులు తగ్గించాలి. వాళ్లు తాగే ΄పాలలో తీపిదనం ఎక్కువవుతున్నందున ఇలా జరిగే అవకాశముంది. అందుకే పాలలో (జ్యూస్‌ల వంటి వాటిల్లోనూ) చక్కెరని కొంతకలం పాటు మానేయాలి. పాలు తాగే పిల్లలకు పూర్తిగా తల్లి పాలే ఇవ్వాలి. ఇలాంటి పిల్లలకు సరైన ఆహారం ఇవ్వడం, జింక్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు, విటమిన్–ఏ పదార్థాలు ఉండే ఆహారాలు ఇవ్వాలి. అప్పటికీ తగ్గకపోతే వారికి రొటావైరస్ వల్లగానీ లేదా ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇలా అవుతుందేమోనని అనుమానించి, వైద్యనిపుణులకు చూపించాలి. అప్పుడు వారి విరేచనాల సమస్యకు తగిన కారణాన్ని కనుగొని, అందుకు అనుగుణంగా డాక్టర్లు చికిత్స అందిస్తారు. -
ఐదు బ్యాక్టీరియాలకు.. భారత్‌లో 6.8 లక్షల మంది బలి
న్యూఢిల్లీ: ఈ.కోలి. ఎస్ నిమోనియా, కె.నిమోనియా, ఎస్.ఏరియస్, ఎ.మౌమనీ. ఈ ఐదు రకాల బ్యాక్టీరియాలు 2019లో భారత్‌లో ఏకంగా 6.8 లక్షల మంది ఉసురు తీశాయని లాన్సెట్ జర్నల్ అధ్యయనంలో వెల్లడైంది. ‘‘2019లో ప్రపంచం మొత్తమ్మీద సంభవించిన మరణాలకు గుండె సంబంధిత వ్యాధుల తర్వాత బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లే రెండో అతి పెద్ద కారణంగా నిలిచాయి. ప్రతి ఎనిమిది మరణాల్లో ఒకటి వీటి ఫలితమే. 33 రకాల సాధారణ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు 77 లక్షల మరణాలకు కారణమయ్యాయి. వీటిలోనూ కేవలం ఐదు బ్యాక్టీరియాల వల్ల సగానికి పైగా మరణాలు సంభవించాయి’’ అని అధ్యయనం పేర్కొంది. ప్రజారోగ్యం దృష్ట్యా బ్యాక్టీరియాలను అదుపు చేయడం తక్షణావసరమని హెచ్చరించింది. ‘‘పటిష్టమైన ఆరోగ్య, వ్యాధి నిర్ధారణ వ్యవస్థల నిర్మాణం, మెరుగైన అదుపు చర్యలు, యాంటీబయాటిక్‌ల వాడకాన్ని గరిష్ట స్థాయికి పెంచడం వంటి చర్యలు చేపట్టాలి’’ అని వాషింగ్టన్ వర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ డైరెక్టర్, అధ్యయన కర్త క్రిస్టోఫర్ ముర్రే సూచించారు. చాలా ఇన్ఫెక్షన్లు తదితరాలకు మనకిప్పటిదాకా కారణాలు తెలియకపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. పలు గణాంకాలతో పాటు 3.43 కోట్ల మంది వైద్య రికార్డులను పరిశీలించారు. ‘‘2019లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన 1.37 కోట్ల ఇన్ఫెక్షన్ సంబంధిత మరణాల్లో సగానికి పైగా బ్యాక్టీరియానే కారణం. 77 లక్షల బ్యాక్టీరియా సంబంధిత మరణాల్లో మూడొంతులకు పైగా శ్వాస, రక్త, ఉదర సంబంధిత ఇన్ఫెక్షన్లే. బ్యాక్టీరియాల్లో ఒక్క ఎస్.ఏరియస్ రకమే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా 1.1 కోట్ల మరణాలకు కారణమైంది. వయసుపరంగా కూడా 15 ఏళ్ల పై బడ్డ వారిలో అత్యధికంగా 9.4 లక్షల మందిని ఇది బలి తీసుకుంది’’ అని పరిశోధకులు తేల్చారు. సహారా ఆఫ్రికా ప్రాంతంలో అత్యధికంగా ప్రతి లక్ష మంది జనాభాకు 230 మంది బ్యాక్టీరియాకు బలైనట్టు వివరించారు. అదే పశ్చిమ యూరప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా వంటి సంపన్న ప్రాంతాల్లో ఈ సంఖ్య అత్యల్పంగా ప్రతి లక్ష మందికి 52గా ఉందని చెప్పారు. ఇదీ చదవండి: Bruce Lee Death Reason: ఓవర్‌గా వాటర్ తాగితే.. బ్రూస్లీలా మరణం ఖాయమంటున్న పరిశోధకులు! -
కరోనా తరహా కొత్త మహమ్మారుల జాబితా తయారీ!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా సమీప భవిష్యత్తులో కరోనా తరహా మహమ్మారులకు కారణం కాగల వైరస్‌లను గుర్తించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) రంగంలోకి దిగింది. మనకింకా ఆనుపానులు తెలియని డిసీజ్ ఎక్స్ ఈ జాబితాలో ముందు వరుసలో ఉంది. ప్రస్తుత జాబితాలో దానితో పాటు కొవిడ్–19, ఎబోలా, మార్బర్గ్, లాసా ఫీవర్, మిడిలీస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (ఎంఈఆర్ఎస్), నిఫా, సార్స్, రిఫ్ట్ వ్యాలీ ఫీవర్, జికా వైరస్ తదితరాలున్నాయి. పరిశోధనలో తెరపైకి వచ్చే కొత్త వైరస్‌లతో జాబితాను సవరించనున్నారు. ‘‘ఇందుకోసం పలు బ్యాక్టీరియా కారకాలపై నిశితంగా దృష్టి పెట్టాం. వీటిలో డిసీజ్ ఎక్స్ అత్యంత ప్రమాదకరమైన అంతర్జాతీయ అంటువ్యాధిగా మారే ఆస్కారముంది’’ అని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. 300 మందికి పైగా శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో తలమునకలుగా ఉన్నారు. 25కు పైగా వైరస్, బ్యాక్టీరియా కుటుంబాలపై పరిశోధనలు చేయనున్నారు. ఇలాంటి జాబితాను తొలిసారిగా 2017లో డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసింది. దాన్ని 2018లో సవరించారు. భావి మహమ్మారిని ముందుగానే గుర్తించి దీటుగా ఎదుర్కొనేందుకు రాబోయే జాబితా కరదీపిక కాగలదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు. ఈ జాబితాను 2023 మార్చిలోగా విడుదల చేయొచ్చని భావిస్తున్నారు. ఇదీ చదవండి: China Sheep Walking Video: చైనాలో గొర్రెల వింత ప్రవర్తన.. ఎట్టకేలకు వీడిన మిస్టరీ! -
Beard Shaving: రోజూ షేవింగ్ చేసుకునే అలవాటు ఉందా? అయితే..
ప్రస్తుత కాలంలో నున్నగా షేవ్ చేసుకునే వారికంటే నిండుగా గడ్డం పెంచుకునే వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. గడ్డం పెంచుకోవడం... లేదా రెగ్యులర్‌గా షేవింగ్ చేసుకోవడం... ఎవరిష్టం వాళ్లది. అయితే రోజూ షేవింగ్ చేసుకోవడం వల్ల కొన్ని లాభాలున్నాయి. అవేంటో చూద్దాం.. కొన్ని ఇంటర్వ్యూలకు హాజరయ్యేటప్పుడు నీట్‌గా షేవింగ్ చేసుకుని రమ్మనడం మామూలే. మిలటరీలో అయితే రెగ్యులర్ షేవింగ్ తప్పనిసరి. ఇంతకీ రెగ్యులర్ షేవింగ్ లాభాలేమిటంటారా... అక్కడికే వస్తున్నాం.... ►షేవింగ్ చేసుకోవడం వల్ల యంగ్‌గా... ఎనర్జిటిక్‌గా కనిస్తారు. ముఖంపై ఉండే జుట్టు శుభ్రపడుతుంది. ►ఇది చర్మ సమస్యలను కొన్నింటిని తగ్గిస్తుంది. అలాగే చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తుంది. ►షేవింగ్‌కు సంబంధించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఉదయం నిద్రలేచి షేవింగ్ చేసుకునే వారు మరింత ఉత్సాహంగా ఉంటారట. బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి.. ►అలాగే పనులకు వెళ్లే వారు ఉదయాన్నే షేవ్ చేసుకోవడం వల్ల ఆ పనిని సక్రమంగా.. మరింత సామర్థ్యంతో పనిచేస్తారని కొన్ని పరిశోధనలలో తేలింది. ►గడ్డంలో ఎన్నో రకాల బ్యాక్టీరియా ఉంటుంది. ఇది చర్మాన్ని పాడుచేస్తుంది. దీంతో ముఖంపై మచ్చలు ఏర్పతాయి. రోజూ షేవింగ్ చేయడం వల్ల ఈ బ్యాక్టీరియా తొలగిపోతుంది. ►షేవింగ్ చేసేటప్పుడు ఉపయోగించే ప్రీషేవ్ ఆయిల్, షేవింగ్ క్రీమ్, జెల్ లేదా బామ్ వంటివన్నీ మీ చర్మ పీహెచ్ స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. చదవండి: Hair Fall Control: అల్లం, ఆవాలు, లవంగాలతో.. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా, పొడవుగా! Health Tips: తరచు ఒళ్లు నొప్పులా? కారణాలు తెలుసుకోండి.. అంతేగానీ వెంటనే టాబ్లెట్ వేసుకుంటే! -
కో–ఇన్ఫెక్షన్స్.. ఏకకాలంలో అనేక జ్వరాలు..!
ఇటీవలి కాలంలో ప్రతి ఇంటా ఎవరో ఒకరు జ్వరంతో బాధపడటం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈమధ్యకాలంలో వరసగా వర్షాలు అందరినీ బెంబేలెత్తించాయి. నిన్న మొన్నటి కరోనా కాలం తర్వాత... అదే సంఖ్యలో మూకుమ్మడి జ్వరాలు ఇటీవల నమోదయ్యాయి. అయితే ఇప్పటి జ్వరాల్లో ఓ ప్రత్యేకత ఉందంటున్నారు వైద్య నిపుణులు. కొందరిలో ఒకే సమయంలో రెండు రకాల జ్వరాలు నమోదవ్వడం ఇటీవల నమోదైన ధోరణి. ఇలా ఒకే సమయంలో అనేక ఇన్ఫెక్షన్లు రావడాన్ని వైద్యనిపుణులు తమ పరిభాషలో ‘కో–ఇన్ఫెక్షన్స్’గా చెబుతున్నారు. ఆ ‘కో–ఇన్ఫెక్షన్ల’పై అవగాహన కోసమే ఈ కథనం. ఓ కేస్ స్టడీ: ఇటీవల ఓ మహిళ జ్వరంతో ఆసుపత్రికి వచ్చింది. తొలుత ఆమెలో డెంగీ లక్షణాలు కనిపించాయి. పరీక్షలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం డాక్టర్లు చూశారు. ఆ తర్వాత ఆమెకు ఆయాసంగా ఉండటం, ఊపిరి అందకపోవడం గమనించారు. అప్పుడు పరీక్షిస్తే ఆమెకు కోవిడ్ కూడా ఉన్నట్లు తేలింది. ఇలా ఒకేసారి రెండు రకాల జ్వరాలు (ఇన్ఫెక్షన్లు) ఉండటాన్ని ‘కో–ఇన్ఫెక్షన్స్ అంటారు. ఇలా రెండ్రెండు ఇన్ఫెక్షన్లు కలసి రావడం కాస్తంత అరుదు. కానీ ఇటీవల ఈ తరహా కేసులు పెద్ద ఎత్తున రావడం విశేషం. ఇక ఈ కేస్ స్టడీలో కోవిడ్ కారణంగా బాధితురాలిని నాన్–ఇన్వేజివ్ వెంటిలేషన్ మీద పెట్టి, ఆక్సిజన్ ఇస్తూ... రెండు రకాల ఇన్ఫెక్షన్లనూ తగ్గించడానికి మందులు వాడాల్సి వచ్చింది. వైరల్, బ్యాక్టీరియల్ జ్వరాలు కలగలసి... సాధారణంగా జ్వరాలతో బయటపడే ఇన్ఫెక్షన్లు రెండు రకాలుగా ఉంటాయి. వాటిల్లో మొదటివి బ్యాక్టీరియల్ జ్వరాలు. రెండోవి వైరల్ జ్వరాలు. అయితే ఇటీవల బ్యాక్టీరియల్ జ్వరాల్లోనే రెండు రకాలుగానీ లేదా ఒకేసారి రెండు రకాల వైరల్ ఇన్ఫెక్షన్లుగానీ... లేదంటే ఒకేసారి వైరల్‌తో పాటు బ్యాక్టీరియల్ జ్వరాలుగానీ కనిపిస్తున్నాయి. అంతేకాదు... ఒకే సమయంలో అనేక ఇన్ఫెక్షన్లతో పాటు ఒకే సమయంలో కుటుంబసభ్యుల్లో అనేక మంది జ్వరాల బారినపడటం అనేకమందికి ఆందోళన కలిగిస్తోంది. బ్యాక్టీరియల్ జ్వరాలతో కలగలసి... బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల విషయానికి వస్తే కొందరిలో వైరల్ జ్వరాలతో పాటు టైఫాయిడ్ ఎక్కువగా కనిపిస్తోంది. మరికొందరిలో ఎలుకలతో వ్యాపించే బ్యాక్టీరియల్ జ్వరం ‘లెప్టోస్పైరోసిస్’ కనిపిస్తున్న దాఖలాలూ ఉన్నాయి. ఇటీవల రోజుల తరబడి వర్షాలు కురుస్తుండటంతో బొరియలు వాననీటిలో నిండిపోగా ఎలుకలు ఇళ్లలోకి రావడం పరిపాటిగా మారింది. లెప్టోస్పైరోసిస్ కనిపించడానికి ఇదే కారణం. ఇంకొందరిలో తొలుత జ్వరం రావడం... ఆ తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తాలూకు రెండో పరిణామంగా (సెకండరీ ఇన్ఫెక్షన్ వల్ల) నిమోనియా కేసులూ కనిపిస్తు న్నాయి. ఇక లక్షణాల తీవ్రత ఎక్కువగా లేని కోవిడ్ రకాలతో (ఒమిక్రాన్ వంటి వాటితో) కలిసి ఇతరత్రా జ్వరాలు రావడం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. యాంటీబయాటిక్స్ వద్దు... జ్వరం వచ్చిన వెంటనే కొందరు పారాసిటమాల్‌తో పాటు యాంటీబయాటిక్స్ మొదలుపెడతారు. యాంటీవైరల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్ పనిచేయకపోగా... అవసరం లేకపోయినా వాటిని తీసుకోవడం వల్ల కొన్ని కౌంట్లు మారుతాయి. విరేచనాల వంటివి అయ్యే ప్రమాదం ఉంటుంది. గ్యాస్ట్రైటిస్ వంటి అనర్థాలు వచ్చే ముప్పు ఉంటుంది. అందుకే జ్వరం వచ్చిన మొదటి రోజు నుంచే కాకుండా... మూడోనాడు కూడా జ్వరం తగ్గకపోతే... అప్పుడు మాత్రమే డాక్టర్‌ను సంప్రదించి, తగిన మోతాదులోనే యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. ఇన్ఫెక్షన్లు కలగలసి రావడం ఇదే మొదటిసారి కాదు... గతంలోనూ కొన్ని సందర్భాల్లో డెంగీ, స్వైన్ ఫ్లూ, టైఫాయిడ్ లాంటివి కలసి వచ్చిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అయితే ఇటీవల వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురిశాయి. దాంతో దోమల కారణంగా మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటివి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నివారణ... వర్షాకాలంలో పరిసరాల్లో నీళ్లు పేరుకుపోవడంతో దోమలు వృద్ధి చెంది... ఈ జ్వరాలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇంటి పరిసరాల పారిశుద్ధ్య జాగ్రత్తలూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తగినంత అప్రమత్తంగా ఉండాలి. దోమలను ఇంట్లోకి రానివ్వకుండా మెష్ / మస్కిటో రెపల్లెంట్స్ వంటి ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాలి. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇక పెద్దవయసు వారు అప్పటికే మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటితో బాధపడే అవకాశాలున్నందున వాటి పట్ల మరింత అప్రమత్తత వహించాలి. మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారిలో ఇన్ఫెక్షన్లు చాలా తేలిగ్గా సోకే అవకాశాలు ఎక్కువ. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. వెరసి అందరూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. వైరల్ జ్వరాలివే.. వైరల్ జ్వరాల్లో ముఖ్యంగా డెంగీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తోంది. సాధారణంగా అది కోవిడ్‌తో పాటు కలిసి రావడం చాలామందిలో కనిపిస్తోంది. మరికొందరిలో వైరల్ ఇన్ఫెక్షన్లయిన కోవిడ్, ఫ్లూ... ఈ రెండూ కలగలసి వచ్చాయి. ఇంకొందరిలో కోవిడ్, ఫ్లూ, స్వైన్–ఫ్లూ... ఈ మూడింటిలో ఏ రెండైనా కలసి రావడమూ కనిపించింది. లక్షణాలు... వైరల్ జ్వరాల విషయానికి వస్తే... వీటిల్లో జ్వరం తీవ్రత... బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కోవిడ్ వంటివి సోకినప్పుడు జ్వరం, దగ్గు కనిపిస్తుంటాయి. తీవ్రత కొంత తగ్గినప్పటికీ ఇటీవల కోవిడ్‌తో కలసి మరో ఇన్ఫెక్షన్ ఉంటే... ఆయాసం, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలూ ఉండవచ్చు. వెరసి... జ్వరం, స్వల్పంగా జలుబు/ఫ్లూ లక్షణాలు, కొందరిలో ఆయాసం, ఊపిరి సరిగా అందకపోవడం, నీరసం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు ఎక్కువ. డెంగీ కేసుల్లో కొందరిలో ఒంటిపై ర్యాష్ వంటి లక్షణాలతో పాటు రక్తపరీక్షలు చేయించినప్పుడు... ప్లేట్లెట్స్ తగ్గడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. నిర్ధారణ పరీక్షలు... కోవిడ్ నిర్ధారణ కోసం ఆర్టీ–పీసీఆర్ అందరికీ తెలిసిన వైద్య పరీక్షే. డెంగీ నిర్ధారణ కోసం చేసే కొన్ని పరీక్షల్లో ఫలితాలు కొంత ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ఎలాగూ డెంగీలో లక్షణాలకే చికిత్స చేయాల్సి ఉన్నందున... ప్లేట్లెట్ కౌంట్తోనే దీన్ని అనుమానించి... తగిన చికిత్సలు అందించాలి. ఇక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయిన టైఫాయిడ్ నిర్ధారణ కోసం వైడాల్ టెస్ట్ అనే వైద్య పరీక్ష చేయించాలి. అవసరాన్ని బట్టి కొన్ని ఇతర పరీక్షలూ చేయించాలి. చికిత్స వైరల్ జ్వరాలకు నిర్దిష్ట చికిత్స లేనందున జ్వరానికి పారాసిటమాల్ ఇస్తూ... లక్షణాలను బట్టి సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అందించాలి. ద్రవాహారాలు ఎక్కువగా ఇవ్వాలి. ఏవైనా దుష్ప్రభావాలు కనిపిస్తే... వాటిని బట్టి చికిత్సను మార్చాలి. (ఉదా. డెంగీలాంటి కేసుల్లో ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు, వాటిని ఎక్కించడం). ఇక టైఫాయిడ్ వంటి బ్యాక్టీరియల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. అయితే జ్వరం వచ్చిన రెండు, మూడు రోజుల వరకు అది వైరలా, బ్యాక్టీరియలా తెలియదు కాబట్టి కేవలం పారాసిటమాల్ తీసుకుంటూ... ఆ పైన కూడా జ్వరం వస్తూనే ఉంటే వైద్యుల వద్దకు వెళ్లి, పరీక్షలు చేయించి, తగిన చికిత్సలు తీసుకోవాలి. ఇక లెప్టోస్పైరోసిస్ వంటివి కాలేయం, కిడ్నీ వంటి వాటిపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది. సెకండరీ నిమోనియా మరింత ప్రమాదకారి. అందుకే ఈ కేసుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. -డాక్టర్ ఆరతి బెల్లారి, కన్సల్టెంట్ ఫిజీషియన్ -
ప్రకృతి నుంచి లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు
ఎన్నో రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి మానవాళిని కాపాడిన మందు పెన్సిలిన్.. దాని తయారీకి మూలం ఓ ఫంగస్.. ఇప్పుడు కరోనా టెస్టుల కోసం వినియోగిస్తున్న ఆర్టీపీసీఆర్ విధానంలో వాడేది ఓ బ్యాక్టీరియా.. ఇవే కాదు.. మానవాళిని పట్టిపీడిస్తున్న రోగాలు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపినదీ ప్రకృతే. అత్యంత ముఖ్యమైన ఔషధాల తయారీకి స్ఫూర్తినిచ్చినదీ ప్రకృతే.. ఇలా ప్రకృతి ఇచ్చిన కొన్ని ముఖ్యమైన మందులు, వాటి ప్రత్యేకతలేమిటో తెలుసుకుందామా.. జంతువులు, మొక్కల నుంచి.. వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల వల్లగానీ, మన జీవనశైలి వల్లగానీ ఎన్నో రకాల రోగాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వాటికి ఉపశమనం కోసం ఎన్నో ప్రయోగాలు, మరెన్నో పరిశోధనలతో మందులు తయారు చేస్తుంటారు. ఒక్కోసారి కొన్నిరకాల జంతువులు, చెట్లలోని రసాయనాల సమ్మేళనాలు నేరుగా రోగాలు, ఆరోగ్య సమస్యలకు ఔషధాలుగా పనిచేస్తుంటాయి. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగానో, అనుకోకుండానో అలాంటి వాటిని గుర్తించి.. మానవాళికి అందుబాటులోకి తెచ్చారు. మధుమేహానికి మందు ఇచ్చి.. గిలా మాన్స్టర్.. నలుపు, నారింజ రంగుల్లో ఉండే ఒక రకమైన పెద్దసైజు బల్లి. అమెరికా, మెక్సికో దేశాల్లో ఉండే ఈ బల్లి లాలాజలంలో ఎక్సెండిన్–4 అనే హార్మోన్ ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టైప్–2 మధుమేహం చికిత్సలో వాడుతున్న ఎక్సెనటైడ్ ఔషధానికి మూలం ఆ హార్మోనే. టైప్–2 మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి, పేషెంట్లు బరువు తగ్గడానికి ఈ హార్మోన్ తోడ్పడుతుందని నార్త్ కరోలినా వర్సిటీ శాస్త్రవేత్తలు 2007లో గుర్తించారు. దానిని ప్రస్తుతం కృత్రిమంగా తయారు చేస్తున్నారు. కరోనాను గుర్తిస్తున్నది ఇదే.. థర్మస్ అక్వాటికస్ బ్యాక్టీరియా.. 1969లో అమెరికాలోని ప్రఖ్యాత ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లో దీనిని గుర్తించారు. ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకుని ప్రొటీన్ల పునరుత్పత్తి చేయగల సామర్థ్యం ఈ బ్యాక్టీరియాకు ఉంది. దీనిని ఆర్టీపీసీఆర్ టెస్టులో ఉపయోగించినప్పుడు.. సంబంధిత వైరస్ల ప్రొటీన్లను గుర్తించడానికి వీలవుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో దీనిని విస్తృతంగా వినియోగిస్తున్నారు. ►ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లెక్కల ప్రకారం.. ఇండియా, అమెరికా, బ్రిటన్, ఇటలీ, టర్కీ ఈ ఐదు దేశాల్లోనే ఏడాది మే చివరినాటికి ఏకంగా 100 కోట్ల కరోనా టెస్టులు చేశారు. ఫంగస్‌పై పోరు నుంచి.. కేన్సర్ చికిత్సకు.. పాక్లిటాక్సెల్.. కేన్సర్ చికిత్సలో ఉపయోగించే అత్యంత కీలకమైన ఔషధం. పసిఫిక్ యూ అనే చెట్టు బెరడులో లభించే ఈ రసాయన మిశ్రమాన్ని 1971లోనే గుర్తించారు. అది కేన్సర్లపై సమర్థవంతంగా పనిచేస్తుందని 2015లో జరిగిన పరిశోధనల్లో తేల్చారు. దాదాపు అన్నిరకాల కేన్సర్లకు చేసే కెమోథెరపీ చికిత్సలో ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన అత్యవసర మందుల జాబితాలో ఈ పాక్లిటాక్సెల్ ఔషధం కూడా ఉండటం గమనార్హం. నిజానికి పసిఫిక్ యూ చెట్లు ఈ రసాయన సమ్మేళనాన్ని ఎందుకు ఉత్పత్తి చేస్తాయో తెలుసా.. తమపై ఫంగస్‌లు పెరిగి తెగుళ్లు కలిగించకుండా ఉండటం కోసమే. వాటి ఇమ్యూనిటీ మనకు ఔషధంగా మారింది. సూక్ష్మజీవులను నాశనం చేసే కప్ప మాగేనిన్.. ఆఫ్రికన్ క్లాడ్ రకం కప్ప చర్మంలో ఉండే ఓ ప్రత్యేకమైన ప్రొటీన్. చాలా రకాల బ్యాక్టీరియాలు, ఫంగస్‌లు, ఇతర సూక్ష్మజీవులను నాశనం చేయగల సామర్థ్యం దీని సొంతం. కొన్నేళ్ల కింద ఆ కప్పలపై పరిశోధనలు చేస్తున్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. వాటి శరీరంపై గాయాలైనా ఇన్ఫెక్షన్లు పెద్దగా సోకడం లేదని గుర్తించారు. దానికి కారణం ఏమిటని పరిశోధించి ‘మాగేనిన్’ ప్రొటీన్‌ను గుర్తించారు. ఇది సూక్ష్మజీవుల పైపొరను ధ్వంసం చేస్తోందని తేల్చారు. అయితే ఈ ప్రొటీన్‌ను మానవ వినియోగానికి అనుగుణంగా మార్చడం, వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడంపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. మరెన్నో మందులు.. ►జ్వరం, నొప్పులతోపాటు మరెన్నో అనారోగ్య లక్షణాలకు ఉపశమనంగా వాడే ఆస్పిరిన్ అనే మందు విల్లో చెట్ల బెరడు, ఆకుల్లో ఉంటుంది. వందల ఏళ్లుగా ప్రజలు దానిని వాడుతూ వచ్చారు. 1850వ దశకంలో ఆస్పిరిన్‌ను కృత్రిమంగా తయారుచేశారు. ►మలేరియాకు మందుగా వినియోగించే క్వినైన్ అనే ఔషధం సింకోనా చెట్ల బెరడు నుంచి వస్తుంది. వందల ఏళ్లుగా దాన్ని వినియోగిస్తున్నారు. 1940వ దశకంలో శాస్త్రవేత్తలు క్వినైన్‌ను కృత్రిమంగా తయారు చేశారు. ►రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ‘స్టాటిన్స్’ను పలు రకాల ఫంగస్ల నుంచి విడుదలయ్యే రసాయనాల నుంచి అభివృద్ధి చేశారు. లక్షల కోట్ల విలువ! మనం పండించే, పెంచే చెట్లు, జంతువులు వంటివి కాకుండా.. సహజ ప్రకృతి నుంచి మనం ఏటా లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను వాడేసుకుంటున్నాం. ప్రపంచ వన్యప్రాణి నిధి (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) అంచనాల ప్రకారం.. భూమ్మీద ఉన్న ప్రకృతిని రూపాయల్లో లెక్కిస్తే.. 92.5 కోట్ల కోట్లు (125 ట్రిలియన్ డాలర్లు) విలువ ఉంటుంది. ప్రకృతిని సంరక్షించుకోకపోవడం వల్ల ప్రస్తుతం ఏటా రూ.35.4 లక్షల కోట్లు (479 బిలియన్ డాలర్లు) నష్టపోతున్నామని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ హెచ్చరించింది. -
విస్తరిస్తున్న కుష్ఠు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో కుష్ఠు వ్యాధి విస్తరిస్తోంది. చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అంటు వ్యాధి కావడంతో ఆందోళనకు గురిచేస్తోంది. తగిన సమయంలో చికిత్స తీసుకోకుంటే దుష్పరిణామాలు ఉండే అవకాశం ఉంది. అవగాహన లేమి, నిరక్షరాస్యత కారణంగా ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. వ్యాధి నిర్మూలన కోసం మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా బుధవారం నుంచి ఫిబ్రవరి 13 వరకు జిల్లాలో పక్షోత్సవాలను వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తోంది. గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేసి వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే జిల్లాలో వ్యాధిగ్రస్తుల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాధిగ్రస్తులు చికిత్స చేసుకోవడానికి ముందుకు రాకపోవడంతో వ్యాధి ముదిరిన తర్వాత ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. 2017–18 సంవత్సరంలో వ్యాధిగ్రస్తులు 64 మంది ఉండగా, 2018 సంవత్సరంలో వ్యాధిగ్రస్తుల సంఖ్య 118కి చేరింది. వ్యాధి నివారణ కోసం రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తులు 108 మంది ఉన్నట్లు వైద్య శాఖ అధికారులు నిర్ధారించారు. కాగా ఇటీవల నిర్వహించిన కుష్ఠు వ్యాధిగ్రస్తుల ఇంటింటి సర్వేలో వీరిని గుర్తించారు. 2017–18 సంవత్సరంలో 137 కేసులు ఉండగా, ఈఏడాది 104 కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో మరికొంత మంది వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర జిల్లాలతో పోల్చితే కుష్ఠు వ్యాధిగ్రస్తులు జిల్లాలో ఎక్కువగానే ఉన్నారు. 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 92 మంది, ఐదు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 16 మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. స్పర్ష లేని మచ్చలు ఉన్నవారు దాదాపు 10వేల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వీరికి వైద్య పరీక్షలు చేస్తే ఎంతమందికి వ్యాధి ఉందో.. లేదో తేలుతుందని పేర్కొంటున్నారు. కాగా అత్యధికంగా ఆదిలాబాద్ మండలంలో 30 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. జిల్లాలో కుష్ఠు నివారణ కార్యక్రమం 1975 సంవత్సరం నుంచి అమలవుతోంది. అయితే గతం కంటే ప్రస్తుతం వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టిందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. 1991 సంవత్సరం నుంచి ఇప్పటివరకు 38,335 మందికి వ్యాధి నిర్ధారణ కాగా, 38,145 మందికి పూర్తిగా చికిత్స ద్వారా నయం అయిందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో 108 మంది వ్యా«ధిగ్రస్తులు ఎండీటీ చికిత్స పొందుతున్నారని తెలిపారు. మైకోలెప్రి బ్యాక్టీరియాతో.. కుష్ఠు వ్యాధి మైకో బ్యాక్టీరియా లెప్రి అనే బ్యాక్టీరియాతో సోకుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకు వస్తుంది. సరైన సమయంలో వైద్యం చేయించుకోకపోతే ఒకరి నుంచి మరోకరికి వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన తర్వాత 3–15 సంవత్సరాల తర్వాత దుష్పరిణామాలు బయటపడుతాయి. తొలిదశలో వ్యాధిని నిర్ధారించుకొని ఎండీటీ చికిత్స పొందితే అంగవైకల్యం రాకుండా కాపాడవచ్చు. శరీరంలో ఎరుపు రంగు, రాగి రంగు స్పర్శ లేని మచ్చలు ఉంటే వ్యాధిగా గుర్తించవచ్చు. -
కుష్ఠుపై సమరం
ఖమ్మంవైద్యవిభాగం: కుష్ఠు వ్యాధి నిర్మూలన ప్రక్రియలో భాగంగా సోమవారం నుంచి విస్తృత అవగాహన కల్పించనున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 4వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందు కోసం 1470 బృందాలను సిద్ధం చేశారు. గ్రామాల్లో ఇంటింటి సర్వేలో భాగంగా ఏఎన్ఎం పర్యవేక్షణలో ఆశ, మేల్ వలంటీర్ వివరాలు నమోదు చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 9వరకు నిర్వహించి..ఆ ఇంటికి ఎల్ మార్క్ పెడతారు. సదరు గృహంలో వివరాలు తెలపని వారు ఎవరైనా మిగిలి ఉంటే..ఎక్స్ గుర్తు పెడతారు. పూర్తి సమాచారాన్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారా ఆన్లైన్లో నమోదు చేస్తారు. అధికారులు నేరుగా వెళ్లి వారికి మందులిచ్చే ప్రక్రియ చేపట్టనున్నారు. కుష్ఠువ్యాధి గ్రస్తులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకే ఇంటింటి సర్వే ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా మైకుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల్లో చైతన్యం కల్పించేందుకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8 నుంచి 10వ తరగతి లోపువారికి ఈ నెల 24న వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. జిల్లాలో ఈ ఏడాది 81కేసులు నమోదు ఖమ్మం జిల్లాలో ఈ సంవత్సరం..81 కుష్ఠు కేసులు నమోదయ్యాయి. గతేడాది 131 కేసులు ఉన్నాయి. ముఖ్యంగా తిరుమలాయపాలెం మండలంలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. అలాగే ఖమ్మంఅర్బన్, ఖమ్మం రూరల్....కూసుమంచి మండలాల్లో కూడా వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ప్రజల్లో అవగాహన లేమి కూడా కారణంగా కనిపిస్తోంది. ఎక్కువగా వ్యాప్తి చెందుతుందడటంతో కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాల జాబితాలో ఖమ్మంను చేర్చింది. వ్యాధివ్యాప్తిని అరికట్టేందుకు పలుసార్లు సమీక్ష సమావేశాలు సైతం నిర్వహించారు. కుష్ఠు అంటే..? కుష్టు వ్యాధి మైక్రో బ్యాక్టీరియం లెప్రే లనే సూక్ష్మ క్రిమి వల్ల సంక్రమిస్తుంది. ప్రధానంగా ఇది చర్మం, నరాలకు సోకుతుంది. నెమ్మదిగా పెరిగి వ్యాధి లక్షణాలు బహిర్గతం అయ్యేందుకు సగటున 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. వ్యాధి ఎవరికైనా రావచ్చు. దీనికి వయస్సు, లింగభేదం ఉండదు. వంశపరంపర్యంగా వచ్చే వ్యాధి కాదు. బహుళ ఔషధ చికిత్సతో తీవ్రతనుబట్టి 6 నుంచి 12 నెలల్లో పూర్తిగా నయం చేసుకోవచ్చు. వ్యాధి రకాలు.. కుష్ఠు వ్యాధిని రెండు రకాలుగా పిలుస్తారు. మొదటిది పాసీ బేసిలరీ లెప్రసీ(పీబీ). శరీరంపై ఒకటి నుంచి ఐదు మచ్చలు వస్తాయి. మలీ బేసిలరీ లెప్రసీ(ఎంబీ) రెండో రకానికి చెందినది. శరీరంపై మచ్చలు ఆరు కంటే ఎక్కువగా కనిపిస్తాయి. అంతే కాకుండా ఒకటి కంటే ఎక్కువ నరాలకు సోకడం దీని లక్షణం. కుష్ఠు లక్షణాలు.. కుష్ఠు వ్యాధి మచ్చలు సహజ చర్మపు రంగు కంటే తక్కువ, ఎరుపు లేదా రాగి రంగు కలిగి ఉంటాయి. మచ్చపై స్పర్శ ఉండదు. నొప్పి ఉండదు. ఇవి..దేహంలోని ఏ ప్రదేశంలోనైనా రావచ్చు. చికిత్స విధానం. కుష్ఠువ్యాధి రెండు లేక మూడు ఔషధాల కలయిక గల బహుళ ఔషధ చికిత్స(ఎండీటీ)తో పూర్తిగా నయమవుతుంది. ప్రారంభదశలోనే వ్యాధిని గుర్తించడం, వ్యాధి సోకిన వారికి పూర్తి ఎండీటీ చేయించటం ద్వారా అరికట్టవచ్చు. ఎండీటీ చికిత్స అన్ని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. తక్కువ తీవ్రత కలిగిన వ్యాధిగ్రస్తునికి 6 నెలలు, ఎక్కువ తీవ్రత కలిగిన వ్యక్తులు 12 నెలల పాటు మందులు వాడాలి. మందులు సక్రమంగా వాడితే ఏదశలో ఉన్న కుష్టు వ్యాధి అయినా..నయం అవుతుంది. ప్రారంభ దశలోనే గుర్తిస్తే..అంగవైకల్యాన్ని కూడా నివారించవచ్చు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుష్ఠు వ్యాధికి చికిత్స ఉచితంగా లభిస్తుంది. మైక్రో సెల్యూలార్ రబ్బర్ పాదరక్షలు ఉచితంగా అందిస్తున్నారు. అంగవైకల్యం ఉన్న అర్హులైన వ్యాధి గ్రస్తులకు రీ కన్సట్రక్టివ్ సర్జరీ ఉచితం. రూ.8000 ప్రభుత్వం ద్వారా అందిస్తున్నారు. వందశాతం సర్వే పూర్తి చేస్తాం.. కుష్ఠు వ్యాధి గ్రస్తుల సర్వే వందం శాతం పూర్తి చేస్తాం. రెండు వారాలపాటు ఆశ, మేల్ వాలంటీర్ ద్వారా ప్రతి ఒక్కరి వంటిపైనా ఏమైనా మచ్చలు ఉన్నాయా అని పరీక్షిస్తారు. పూర్తిస్థాయిలో సర్వే చేసిన తర్వాత మచ్చలు ఉన్నవారికి పరీక్షలు చేసి కుష్ఠు వ్యాధి గ్రస్తులను గుర్తిస్తారు. కుష్ఠు రహిత జిల్లాగా తీర్చిదిద్దే వరకు కృషి చేస్తాం. –కళావతిబాయి, డీఎంహెచ్ఓ -
యాండ్రాలజీ కౌన్సెలింగ్
మాటిమాటికీ తిరగబెడుతున్న సమస్య, ఏం చేయాలి? నాకు 38 ఏళ్లు. ప్రతిసారీ నేను సెక్స్ చేసేప్పుడు నాకు పురుషాంగంలోనూ, నా భార్యకు యోనిలో మంట వస్తోంది. ఈ మంటతో ఒక్కోసారి నెలల తరబడి సెక్స్‌కు దూరంగా ఉంటున్నాము. ఇద్దరం చాలాసార్లు యాంటీబయాటిక్స్ వాడాం. వాడినప్పుడు ఒక వారం పాటు బాగానే ఉండి, మళ్లీ సమస్య వస్తోంది. దయచేసి మంచి సలహా ఇవ్వగలరు. - ఒక సోదరుడు, సామర్లకోట కొన్నిసార్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మాత్రమే గాకుండా క్లమిడియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇలా అయ్యే అవకాశం ఉంది. మీ సమస్య నిర్ధారణ కోసం కొన్ని రక్తం, మూత్ర పరీక్షలు చేయించి, ఆరు వారాల పాటు దానికి తగిన యాంటీబయాటిక్స్ వాడాలి. ఈ ఆరు వారాల పాటు కండోమ్ వేసుకునే సెక్స్ చేయాలి. దాంతో ఈ సమస్యను నియంత్రించవచ్చు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కొన్నిసార్లు సిస్టోస్కోపీ వంటి పరీక్షలు అవసరం కావచ్చని అనిపిస్తోంది. ఒకసారి మీకు దగ్గర్లోని యూరాలజిస్ట్ లేదా యాండ్రాలజిస్ట్‌ను కలవండి. నాకు 62 ఏళ్లు. షుగర్, బీపీ సమస్యలు లేవు. నేను నా భార్యతో ఇప్పటికీ సెక్స్ చేస్తూ ఉంటాను. నాకు అంగస్తంభన విషయంలో ఎలాంటి సమస్యలు లేవు. కాకపోతే రాత్రి పూట మూత్రం ఎక్కువగా వస్తోందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రోస్టేట్ గ్రంథి పెరిగిందని అంటున్నారు. సెక్స్ ఎక్కువగా చేయడం వల్ల ప్రోస్టేట్ పెరుగుతుందా? అరవైఏళ్లు పైబడ్డాక సెక్స్ చేయడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? - ఎస్.కె.బి., నేలకొండపల్లి సెక్స్‌కు వయోపరిమితి లేదు. అరవై ఏళ్ల తర్వాత సెక్స్ చేయగలగడమే మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సూచిస్తోంది. ప్రోస్టేట్ గ్లాండ్ పెరగడా నికి, సెక్స్ ఎక్కువగా చేయడానికి కూడా ఎలాంటి సంబంధం లేదు. జన్యుపరంగా కొందరిలో ప్రోస్టేట్గ్లాండ్ వయసు పైబడిన వారిలో పెరిగి, మూత్ర సమస్యలు వస్తూ ఉంటాయి. వీటిని ఎక్కువమందిలో మందులతోనే నయం చేయవచ్చు. ఒకవేళ మూత్రం అస్సలు సరిగా రాకపోతే ఆపరేషన్ లేకుండానే ప్రోస్టేట్గ్లాండ్ను లేజర్‌తో తొలగించినా, సెక్స్ సమస్యలు ఉండవు. కేవలం వీర్యం తక్కువగా వస్తుంది. ఇది మినహా సెక్స్‌లో ఎలాంటి లోపం ఉండదు. ఎనభై ఏళ్లు పైబడిన వారిలో కూడా సెక్స్ చేసేవారిని తరచూ చూస్తూనే ఉంటాం. కాబట్టి సెక్స్ విషయంలో అన్ని అపోహలు వదిలేసి, ప్రోస్టేట్ విషయంలో యూరాలజిస్ట్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి.