పోరాడే వయసు పిల్లలు... అంటే ఆర్నెల్ల వయసు నుంచి రెండు, మూడేళ్ల లోపు పిల్లల్ని టాడ్లర్స్ అంటారు. ఆ వయసు పిల్లల్లో వచ్చే నీళ్లవిరేచనాల్ని ‘టాడ్లర్స్ డయేరియా అంటారు. ఈ కండిషన్ చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. అయితే ఇలాంటి పిల్లలకు ఇచ్చే ఆహారంలో కాస్తంత పీచుపదార్థాల మోతాదులు తగ్గించాలి. వాళ్లు తాగే ΄పాలలో తీపిదనం ఎక్కువవుతున్నందున ఇలా జరిగే అవకాశముంది.
అందుకే పాలలో (జ్యూస్‌ల వంటి వాటిల్లోనూ) చక్కెరని కొంతకలం పాటు మానేయాలి. పాలు తాగే పిల్లలకు పూర్తిగా తల్లి పాలే ఇవ్వాలి. ఇలాంటి పిల్లలకు సరైన ఆహారం ఇవ్వడం, జింక్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు, విటమిన్–ఏ పదార్థాలు ఉండే ఆహారాలు ఇవ్వాలి. అప్పటికీ తగ్గకపోతే వారికి రొటావైరస్ వల్లగానీ లేదా ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇలా అవుతుందేమోనని అనుమానించి, వైద్యనిపుణులకు చూపించాలి. అప్పుడు వారి విరేచనాల సమస్యకు తగిన కారణాన్ని కనుగొని, అందుకు అనుగుణంగా డాక్టర్లు చికిత్స అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment