toddlers
-
AI Pics : ఎంత ముద్దుగుండ్రు..ఒకసారి చూడుర్రి..! (ఫొటోలు)
-
టాడ్లర్స్ డయేరియా.. చంటి పిల్లల్లో నీళ్ల విరేచనాలు
పోరాడే వయసు పిల్లలు... అంటే ఆర్నెల్ల వయసు నుంచి రెండు, మూడేళ్ల లోపు పిల్లల్ని టాడ్లర్స్ అంటారు. ఆ వయసు పిల్లల్లో వచ్చే నీళ్లవిరేచనాల్ని ‘టాడ్లర్స్ డయేరియా అంటారు. ఈ కండిషన్ చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. అయితే ఇలాంటి పిల్లలకు ఇచ్చే ఆహారంలో కాస్తంత పీచుపదార్థాల మోతాదులు తగ్గించాలి. వాళ్లు తాగే ΄పాలలో తీపిదనం ఎక్కువవుతున్నందున ఇలా జరిగే అవకాశముంది. అందుకే పాలలో (జ్యూస్‌ల వంటి వాటిల్లోనూ) చక్కెరని కొంతకలం పాటు మానేయాలి. పాలు తాగే పిల్లలకు పూర్తిగా తల్లి పాలే ఇవ్వాలి. ఇలాంటి పిల్లలకు సరైన ఆహారం ఇవ్వడం, జింక్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు, విటమిన్–ఏ పదార్థాలు ఉండే ఆహారాలు ఇవ్వాలి. అప్పటికీ తగ్గకపోతే వారికి రొటావైరస్ వల్లగానీ లేదా ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇలా అవుతుందేమోనని అనుమానించి, వైద్యనిపుణులకు చూపించాలి. అప్పుడు వారి విరేచనాల సమస్యకు తగిన కారణాన్ని కనుగొని, అందుకు అనుగుణంగా డాక్టర్లు చికిత్స అందిస్తారు. -
ఎన్నోసార్లు ఈ వీడియో చూసి పులకించి పోయాను
-
సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ‘దృశ్యం’
సాక్షి, న్యూఢిల్లీ : ఇది హృదయానికి అతుక్కునే దృశ్యం. స్నేహానికి కొత్త నిర్వచనం. పాపం, పుణ్యం, ప్రపంచమార్గం ఏమీ తెలియని ఇద్దరు బాలమిత్రులు. ఏడాది పాటు కలిసి ఉన్నారు. ఒకరికొకరు విడిపోని ఆప్తులయ్యారు. విధివశాత్తు వారు కేవలం రెండేరెండు రోజులు విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వారు ఒకరికొకరు చూసుకున్నప్పుడు, కలిసికున్నప్పుడు వారు పొందిన అనిర్వచనీయ ఆనందం అంతా ఇంతా కాదు. మనమందరం ముగ్ధులయ్యేంత. ఒకరికొకరు ఆనందంతో రెండు చేతులెత్తి, ఒకరి వద్దకు ఒకరు పరుగెత్తి, చేతులతో చుట్టుముట్టుకుని తన్మయత్వంతో కౌగిలించుకున్నారు. న్యూయార్క్ సిటీలోని ఓ రోడ్డు మీద గురువారం కనిపించిన ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అబ్బురపరుస్తోంది. ఈ ఇద్దరు బాల మిత్రల వయస్సు రెండంటే రెండేళ్లే. వారిలో ఒకరి పేరు మాక్స్వెల్, మరొకరి పేరు ఫిన్నెగన్. మాక్స్వెల్ నాన్న మైఖేల్ సిసినరోస్ కథనం ప్రకారం రాత్రి పూట, నిద్ర వేళల్లో మినహా ఈ ఇద్దరు బాలలు ఒకరిని విడిచి ఒకరు ఉండరట. ఒకరికొకరు కొన్ని క్షణాలు కనిపించకపోతే ఒకరి గురించి ఒకరు వాకబు చేయడం మొదలు పెడతారట. అనకోకుండా మాక్స్వెల్ ఇంటికి సమీపంలోనే నివసించే ఫిన్నెగన్ రెండురోజుల పాటు, కచ్చితంగా చెప్పాలంటే తన తల్లిదండ్రులతోపాటు నగరంలో మరెక్కడికో వెళ్లాల్సి రావడంతో వారిద్దరు పిల్లల మధ్య ఎడబాటు చోటు చేసుకుంది. గురువారం నాడు వారిద్దరు కలుసుకున్నప్పుడు ‘స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం’ అన్న అనుభవం కలిగింది. ఇద్దరు ఒక జాతికి చెందిన పిల్లలు కాకపోవడం మరీ విశేషం. ఒకరు శ్వేత జాతీయుడు, మరొకడు నల్లజాతీయుడు. ‘నిజమైన స్నేహానికి నిలువెత్తు నిర్వచనం. ఈ అమాయక బాలల మధ్య కనిపిస్తున్న అనిర్వచనీయ అనుబంధం. ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఇలాంటి ఆనందాన్నే ఆస్వాదించేందుకు ప్రయత్నిస్తే.. ఒకటి కాదు, రెండు కాదు, నేను ఎన్నోసార్లు ఈ వీడియో చూసి పులకించి పోయాను’ అని ఓ ఫేస్బుక్ యూజర్ తైరా వితాని వ్యాఖ్యానించారు. చదవండి: అర్థరాత్రి కారడవిలో 11 నెలల పాప ఒంటరిపోరాటం.. వైరల్ -
పాపం ఆ తండ్రికి ఎంతటి విషాదం..
ఇజ్రాయెల్: ఇజ్రాయెల్‌లో ఓ తండ్రికి విషాదం మిగిలింది. పాఠాలు చెప్పే క్రమంలో తన ఇద్దరు పిల్లలను కార్లో వదిలి డోర్లు పెట్టి వెళ్లడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరికి 18 నెలలుకాగా, మరొకరికి మూడు నెలలు. ప్రస్తుతం ఇజ్రాయెల్ లోని నెగెవ్ ఎడారిలో విపరీతమైన ఎండలు ఉన్నాయి. బయటకు వెళ్లాలంటే మనుషులు గజగజ వణికిపోతున్నారు. ఈ క్రమంలోనే ఏడారి పక్కనే ఉన్న అల్ కసోమ్ అనే చోట ఓ ఉపాధ్యాయుడు తన ఇద్దరు పిల్లలతో పాఠశాలకు వెళ్లాడు. పాఠాలు చెప్పే క్రమంలో తన ఇద్దరు పిల్లల్ని కారులో వదిలి వెళ్లాడు. పైగా అద్దాలు కూడా మూసి వెళ్లడంతో ఓ పక్క విపరీతమైన ఎండలు, మరోపక్క ఊపిరాడని కారణంగా వారిద్దరు మృత్యువాత పడ్డారు. -
చిన్నారుల చేతికి గన్స్.. గాల్లో ప్రాణాలు
న్యూయార్క్: అమెరికాలో విచ్చలవిడిగా దాదాపు చాలామంది ఇండ్లలో ఉన్న తుపాకుల కారణంగా వారి ప్రాణాలుపోతున్నాయి. ముఖ్యంగా చిన్నారుల చేతుల్లో అవి ఆటవస్తువులుగా మారి తెలిసి తెలియక వాటి ట్రిగ్గర్స్ నొక్కుతుండటంతో ఆ పిల్లలు, కుటుంబ సభ్యులు మృత్యువాత పడుతున్నారు. ఇలా తమకు తెలియకుండానే తుపాకుల బారిన పడుతున్నవారు ఒకటి నుంచి మూడేళ్లలోపు చిన్నారులే. ఒక్క ఏడాదిలోనే అభంశుభం తెలియని చిన్నారులు దాదాపు 23మంది మృత్యువాత పడ్డారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో గమనించవచ్చు. గత వారం మిల్ వాకీ అనే చిన్నబేబి కారు నడుపుతున్న తన కన్నతల్లిని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కాల్చి చంపిన విషయం తెలిసిందే. సీటు వెనుకాల నిర్లక్ష్యంగా పడేసిన తుపాకీని ఆపాప చేతుల్లోకి తీసుకొని ట్రిగ్గర్ నొక్కడం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది. ఇలాంటివి ఒక్క ఏప్రిల్ లోనే వరుసగా ఏడు ఘటనలు చోటుచేసుకున్నాయి. అవి ఏమిటంటే.. ఏప్రిల్, 20న ఇండియానాలో రెండేళ్ల బాలుడు అనుకోకుండా కిచెన్ లో ఉన్న తుపాకీని తీసుకొని తనను తాను కాల్చుకున్నాడు ఏప్రిల్ 21న కాన్సాస్ లో ఏడాది పాప తన తండ్రి తుపాకీతో ప్రమాదవవాత్తు కాల్చుకొని చనిపోయింది. ఏప్రిల్ 22న నాచితోచెస్ లో మూడేళ్ల బాలుడు ఏప్రిల్ 26న డల్లాస్ లో మూడేళ్ల బాలుడు ఏప్రిల్ 27న మిల్ వాకీలో ఓ పాప తెలియక తన తల్లిని కార్లో కాల్చింది. అదే రోజు.. మూడేళ్ల బాలుడు గ్రౌట్ టౌన్ షిప్ లో తనను కాల్చుకున్నాడు. ఇతడు బ్రతికే అవకాశం ఇంకా ఉంది. ఏప్రిల్ 29న మూడేళ్ల బాలిక ఆగస్టాలో ఓ కారులో పెట్టిన తుపాకీ తీసుకుంటుండగా దాని తూటా పాప అరచేతిలో నుంచి దూసుకెళ్లింది. ఇలా దాదాపు ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే చిన్నపిల్లల చేతుల్లోకి తుపాకులు రావడం మూలంగా దాదాపు 23 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇవి గత ఏడాది మొత్తం 18 మాత్రమే ఉన్నాయి. వీటిపై ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే మరో ఎనిమిది నెలల్లో ఎన్ని ఘటనలు జరుగుతాయో..! -
'అమ్మ' కానికి పిల్లలు... భారీ డిస్కౌంట్
ఫేస్బుక్లో ఏ వస్తువు అయినా అమ్మకానికి పెడితే... రెప్పపాటులో అమ్ముడవుతున్నాయి కదా అని తన చిన్నారుల ఇద్దరిని విక్రయానికి పెట్టింది ఓ కన్నతల్లి. అంతేకాకుండా సదరు చిన్నారులను కారులో కూర్చోబెట్టి.... చేతులు బుడిదరంగు ప్లాస్టర్‌తో కట్టేయడమే కాకుండా... వారి నోటికి కూడా ప్లాస్టర్ వేసింది.... దీంతో ఆ చిన్నారుల కన్నీళ్లుతో ఉన్న ఆ ఫోటోలను ఫేస్బుక్లో పెట్టింది. అక్కడితో ఆగకుండా పిల్లలు 'బ్యాడ్'... కావున 45 శాతం డిస్కొంట్‌తో ప్రత్యేక ఆఫర్లో విక్రయిస్తున్నాం.... ఆలస్యం చేస్తే ఆశాభంగం మాత్రం తప్పదని పేర్కొంటూ శుక్రవారం ఫేస్బుక్లో తల్లి జైబేబీ ఫోస్ట్ చేసింది. సదరు చిన్నారుల ఫోటోలు ఫేస్బుక్లో హల్చల్ సృష్టిస్తున్నాయి. అవి కాస్తా యూఎస్ మెంపిస్‌లోని టేనస్సీ పోలీసు ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లడంతో ... వారు అలర్ట్ అయ్యారు. దీనిపై విచారణ చేపట్టారు... ఆ విచారణ కొనసాగుతోంది. కాగా ఈ చిన్నారుల విక్రయానికి సంబంధించిన ఫోటో పోస్టింగ్‌పై పలువురు తల్లిదండ్రులు ఫేస్బుక్లో తీవ్రంగా స్పందించారు. ఇది చాలా దుర్మార్గం... పెద్ద నేరం కూడా.. ఈ ఫోటో చూసిన తర్వాత శ్వాస తీసుకోవడం కూడా మేము మర్చిపోయాము... ఈ ఫోటో చూసి చాలా భావోద్వేగానికి లోనయ్యామన్నారు. వాళ్లు మనుషులేగా ... అదీ చిన్నారులంటూ వారు పిల్లల తల్లి జైబేబీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ పోటో పోస్ట్ చేసిన జైబేబి కుటుంబం ఆలోచనలో పడింది. వెంటనే ఆమె బంధువు డిరియన్ కింగ్ వివరణ ఇచ్చారు. ఈ ఫోటో ప్రాక్టికల్ జోక్ మాత్రమే అంటూ సర్థిచెప్పారు. మా ఇంట్లోని చిన్నారులను తమ కుటుంబమే కాదు స్నేహితులు అందరు ఎంతో ప్రేమగా చూస్తారంటూ పేర్కొన్నారు. కానీ జైబేబి కుటుంబంపై ఆరోపణలు మరింత వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ నుంచి ఆ ఫోటోను జైబేబి తొలగించింది. -
'వారు నేర్చుకోవడం లేదా.. అయితే నవ్వించండి'
లండన్: మీ చిన్నారులు ఏ కొత్త విషయాలు చెప్పినా అస్సలు నేర్చుకోవడం లేదని.. అలవాటు చేసుకోవడం లేదని బాధపడుతున్నారా? వారికి పదే పదే అదే అంశాన్ని నేర్పించేందుకు ప్రాయసపడుతున్నారా? అయితే ఒక్క క్షణం ఆగి అలా చేయడానికి బదులు వారిని ఓసారి నవ్వించే ప్రయత్నం చేయండని చెబుతున్నారు ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు. అలా నవ్వించడం ద్వారా వారు ఎలాంటి విషయాలు చెప్పినా ఇట్టే నేర్చుకొని అలవాటుపడిపోతారని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చెప్పేదిశగా ఏడాదిన్నర చిన్నారులను ప్రయోగానికి తీసుకున్న శాస్త్రవేత్తలు వారికి తలా ఓ బొమ్మ చేతికి ఇచ్చారు. అందులో కొందరు పిల్లలు ఆ బొమ్మతో ఆడుకోగా మరికొందరు మాత్రం తీసుకున్న వెంటనే నేలకేసి కొట్టడం మొదలుపెట్టారు. ఇది చూసి మరో గ్రూపులో ఆడుకుంటున్న పిల్లలు నవ్వుకుంటూ తిరిగి తమ ఆటను కొనసాగించారు. దీని ప్రకారం నవ్వడం ద్వారా పిల్లలు రెట్టింపు ప్రశాంతతను పొంది ఏ అంశాన్నైనా తమలో ఇముడ్చుకునేందుకు కావాల్సిన శక్తిని పొందగలుగుతారని శాస్త్రవేత్తలు తెలిపారు.