చిన్నారుల చేతికి గన్స్.. గాల్లో ప్రాణాలు
న్యూయార్క్: అమెరికాలో విచ్చలవిడిగా దాదాపు చాలామంది ఇండ్లలో ఉన్న తుపాకుల కారణంగా వారి ప్రాణాలుపోతున్నాయి. ముఖ్యంగా చిన్నారుల చేతుల్లో అవి ఆటవస్తువులుగా మారి తెలిసి తెలియక వాటి ట్రిగ్గర్స్ నొక్కుతుండటంతో ఆ పిల్లలు, కుటుంబ సభ్యులు మృత్యువాత పడుతున్నారు. ఇలా తమకు తెలియకుండానే తుపాకుల బారిన పడుతున్నవారు ఒకటి నుంచి మూడేళ్లలోపు చిన్నారులే.
ఒక్క ఏడాదిలోనే అభంశుభం తెలియని చిన్నారులు దాదాపు 23మంది మృత్యువాత పడ్డారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో గమనించవచ్చు. గత వారం మిల్ వాకీ అనే చిన్నబేబి కారు నడుపుతున్న తన కన్నతల్లిని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కాల్చి చంపిన విషయం తెలిసిందే. సీటు వెనుకాల నిర్లక్ష్యంగా పడేసిన తుపాకీని ఆపాప చేతుల్లోకి తీసుకొని ట్రిగ్గర్ నొక్కడం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది. ఇలాంటివి ఒక్క ఏప్రిల్ లోనే వరుసగా ఏడు ఘటనలు చోటుచేసుకున్నాయి.
అవి ఏమిటంటే..
ఏప్రిల్, 20న ఇండియానాలో రెండేళ్ల బాలుడు అనుకోకుండా కిచెన్ లో ఉన్న తుపాకీని తీసుకొని తనను తాను కాల్చుకున్నాడు
ఏప్రిల్ 21న కాన్సాస్ లో ఏడాది పాప తన తండ్రి తుపాకీతో ప్రమాదవవాత్తు కాల్చుకొని చనిపోయింది.
ఏప్రిల్ 22న నాచితోచెస్ లో మూడేళ్ల బాలుడు
ఏప్రిల్ 26న డల్లాస్ లో మూడేళ్ల బాలుడు
ఏప్రిల్ 27న మిల్ వాకీలో ఓ పాప తెలియక తన తల్లిని కార్లో కాల్చింది. అదే రోజు.. మూడేళ్ల బాలుడు గ్రౌట్ టౌన్ షిప్ లో తనను కాల్చుకున్నాడు. ఇతడు బ్రతికే అవకాశం ఇంకా ఉంది.
ఏప్రిల్ 29న మూడేళ్ల బాలిక ఆగస్టాలో ఓ కారులో పెట్టిన తుపాకీ తీసుకుంటుండగా దాని తూటా పాప అరచేతిలో నుంచి దూసుకెళ్లింది. ఇలా దాదాపు ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే చిన్నపిల్లల చేతుల్లోకి తుపాకులు రావడం మూలంగా దాదాపు 23 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇవి గత ఏడాది మొత్తం 18 మాత్రమే ఉన్నాయి. వీటిపై ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే మరో ఎనిమిది నెలల్లో ఎన్ని ఘటనలు జరుగుతాయో..!