handgun
-
అమెరికా తుపాకీ సంస్కృతికి నాలుగేళ్ల చిన్నారి బలి
హూస్టన్: ఇంటికో తుపాకీ పథకం అమల్లో ఉందా అన్నట్లు కనిపించే అమెరికాలో గన్ కల్చర్.. నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలను తోడేసింది. టెక్సాస్ రాష్ట్రంలోని హూస్టన్ నగర సమీపంలోని హ్యారిస్ కౌంటీలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. కౌంటీ పోలీసు అధికారి ఎడ్ గోంజాల్వేజ్ తెలిపిన వివరాల ప్రకారం ‘బామెల్ నార్త్ హూస్టన్ రోడ్‌లోని ఓ అపార్ట్మెంట్లోని ఇంట్లో ఐదుగురు పిల్లలు ఆడుకుంటున్నారు. వీరిలో నాలుగు, మూడేళ్ల అక్కాచెల్లెళ్లు ఇంటి పడకగదిలోకెళ్లి అక్కడే ఉన్న సెమీ ఆటోమేటిక్ పిస్టల్‌ను చూశారు. పిస్టల్‌ను చేతిలోకి తీసుకున్న చెల్లెలు వెంటనే అక్కకు గురిపెట్టి కాల్చింది. తుపాకీ శబ్దంతో కుటుంబసభ్యులు హుటాహుటిన అక్కడికొచ్చి చూసేసరికి నాలుగేళ్ల అమ్మాయి రక్తమోడుతూ కనిపించింది. 911కు ఫోన్‌చేసి అత్యవసర సిబ్బంది వచ్చి వైద్యంచేసేలోపే చిన్నారి ప్రాణాలు విడిచింది. లోడ్ చేసిన తుపాకులను జాగ్రత్త చేయాలని ఎంతగా విజ్ఞప్తి చేస్తున్నా తుపాకీ యజమానుల నిర్లక్ష్యం ఇలా ఎందరో అమా యకుల ప్రాణాలను బలికోరుతోంది’ అని ఆయన విచారం వ్యక్తంచేశారు. -
అమెరికాలో మళ్లీ కాల్పులు
కెనోషా: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేగింది. ఇండియానా రాష్ట్రంలో జరిగిన దాడిని మరువక ముందే విస్కాన్సిన్లో తాజా ఘటన చోటుచేసుకుంది. కెనోషా కౌంటీలో ఆదివారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణిం చగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని కౌంటీ షెరిఫ్ డేవిడ్ బెత్ వెల్లడించారు. ఘటనకు ముందుగా నిందితుడు బార్లోనే ఉన్నాడని, అయితే అతన్ని బయటకు పంపడంతో తిరిగి వచ్చి కాల్పులు జరిపినట్లు భావిస్తున్నామన్నారు. ఎవరిని చంపాలో నిందితుడు ముందుగానే నిర్ణయించు కొని వచ్చినట్లు అభిప్రాయపడుతున్నట్లు వెల్లడిం చారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు మరొకరు కూడా ఉన్నట్లు చెప్పారు. దాడి చేసేందుకు ఒక హ్యాండ్‌గన్‌ను ఉపయోగించారని తెలిపారు. నిందితున్ని పట్టుకోవడానికి స్థానికులు సాయం చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్లే ప్రధాన రహదారులను మూసేసి తనిఖీలు చేపట్టారు. ఒమహాలోనూ కాల్పులు.. ఒమహాలోని ఓ మాల్లోనూ ఆదివారం కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఘటనానంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు దాదాపు గంట పాటు మాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆధారాలను సేకరించిన అనంతరం తిరిగి మాల్‌లోకి సందర్శకులను అనుమతించారు. నిందితుడు స్పష్టమైన లక్ష్యంతోనే వచ్చి కాల్పులు జరిపాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఓ మహిళ కాలికి సైతం గాయమైంది. -
వాషింగ్టన్లో సాయుధుడి అరెస్ట్
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లలో భాగంగా రాజధాని వాషింగ్టన్లో ఏర్పాటు చేసిన సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద వెస్లీ అలెన్ బీలెర్ (31) అనే వ్యక్తి శుక్రవారం ఆయుధంతో తిరుగుతూ పట్టుబడడం తీవ్ర కలకలం రేపింది. అనుమానాస్పదంగా సంచరిస్తున్న అతడి కారులో నుంచి లైసెన్స్ లేని 9ఎంఎం హ్యాండ్‌గన్, 500 రౌండ్ల తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వెస్లీని అదుపులోకి తీసుకొని విచారించారు. ఉగ్రవాదులతో అతడికి ఎలాంటి సంబంధాలు లేవని, తెలియకుండా ఆ ప్రాంతంలోకి వచ్చాడని నిర్ధారణ కావడంతో శనివారం విడిచిపెట్టారు. అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నాడన్న ఆరోపణతో కేసు నమోదు చేశారు. భద్రతా సిబ్బందికి ఉచితంగా పిజ్జాలు జో బైడెన్ యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ ఎదుట ప్రమాణ స్వీకారం చేస్తారు. కొద్దిరోజుల క్రితం ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు వీరంగం సృష్టించారు. అప్పటినుంచి ఇక్కడ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భద్రతా సిబ్బంది నిర్విరామంగా పహారా కాస్తున్నారు. వారి శ్రమను చూసి చలించిపోయిన ‘వి ద పిజ్జా’ అనే రెస్టారెంట్ ఉచితంగా పిజ్జాలు అందజేస్తూ అందరి మన్ననలు చూరగొంటోంది. సెక్యూరిటీ సిబ్బందికి భోజనం అందించడానికి రెస్టారెంట్ యాజమాన్యం ప్రజల నుంచి విరాళాలు స్వీకరిస్తోంది. వి ద పిజ్జా ఔదార్యం చూసిన మరికొన్ని రెస్టారెంట్లు కూడా ఉచితంగా భోజనం అందించడానికి ముందుకొచ్చాయి. హ్యాండ్‌గన్, 500 రౌండ్ల తూటాల స్వాధీనం -
దడపుట్టిస్తున్న హ్యాండ్‌గన్స్
అగ్రరాజ్యం అమెరికాను తుపాకీ సంస్కృతి హడలెత్తిస్తోంది. జనసమ్మర్థ ప్రాంతాల్లో అగంతకులు తుపాకులతో విధ్వంసం సృష్టిస్తుండటంతో సామాన్య ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న జాత్యహంకార వ్యాఖ్యల కారణంగానే ఈ తరహా దాడులు జరుగుతున్నాయని డెమొక్రటిక్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే కొందరు మానసిక రోగులు చేసే దాడుల్ని ప్రజలందరికీ ఆపాదించడం సరికాదని రిపబ్లిక్ పార్టీ నేతలు చెబుతున్నారు. చివరికి ఈ విష సంస్కృతి పాఠశాలలకు వ్యాపించిన నేపథ్యంలో తుపాకుల నియంత్రణకు చట్టాల్లో మార్పులు చేయాలని ప్రజలు చెబుతున్నారు. ప్రాణాలు తీస్తున్న హ్యాండ్‌గన్స్.. అమెరికాలో అమాయక ప్రజలను కాల్చిచంపే ఘటనలు గత 30 ఏళ్లలో అధికమయ్యాయి. మదర్‌జోన్స్ అనే ఇన్వెస్టిగేటివ్ మ్యాగజీన్ కథనం ప్రకారం అమెరికాలో 1982 నుంచి ఇప్పటివరకూ ప్రజలు లక్ష్యంగా 110 దాడులు చోటుచేసుకున్నాయి. ఒక్క 2016లోనే దేశంలో తుపాకీ కాల్పుల్లో 38,658 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 22,938 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దుండగులు జరిపిన సామూహిక కాల్పుల్లో 2016లో 71 మంది తుదిశ్వాస విడిచారు. అమెరికాలో హ్యాండ్ గన్స్ కారణంగానే ఎక్కువమంది (64 శాతం) చనిపోతున్నారని ఎఫ్‌బీఐ తెలిపింది. ఈ జాబితాలో రైఫిల్స్, షాట్‌గన్స్, ఇతర ఆయుధాలు తర్వాతి స్థానంలో నిలిచాయంది. అమెరికాలో కేవలం రూ.14,228కే ఓ హ్యాండ్‌గన్ లభ్యమవుతోంది. ఇక పెద్ద తుపాకులైతే రూ.లక్ష వరకూ ధర పలుకుతున్నాయి. ప్రస్తుతం అమెరికన్ల దగ్గర 39 కోట్ల తుపాకులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని తుపాకీ సంస్కృతిపై ప్యూ రీసెర్చ్ అనే సంస్థ ఓ సర్వే చేపట్టింది. ఇందులో 18–29 ఏళ్ల మధ్య వయసున్న యువతలో చాలామంది తుపాకీ హక్కులను కాపాడాలని కోరుకుంటున్నట్లు తేలింది. యువతలో ముఖ్యంగా శ్వేతజాతీయులు తుపాకీ కలగిఉండటాన్ని ఇష్టపడుతున్నట్లు సర్వే పేర్కొంది. అడ్డుగోడ.. ఎన్ఆర్ఏ తుపాకుల అమ్మకాన్ని నియంత్రించాలని ప్రజలతో పాటు పలువురు డెమొక్రాట్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తుపాకుల వాడకాన్ని నియంత్రిస్తూ కఠిన చట్టాలను తీసుకొచ్చినప్పుడే అమాయకుల ప్రాణాలను కాపాడగలమని స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ చర్యలను 55 లక్షల మంది సభ్యులున్న నేషనల్ రైఫిల్ అసోసియేషన్(ఎన్ఆర్ఏ) అనే లాబీయింగ్ బృందం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎన్ఆర్ఏ ఆర్థికమూలాలు ఎంతబలంగా ఉన్నాయంటే ఏకంగా రిపబ్లికన్ పార్టీ వీరికి సంపూర్ణ మద్దతు ఇస్తోంది. అమెరికా కాంగ్రెస్‌లో అటు రిపబ్లికన్లు, ఇటు డెమొక్రాట్లకు పెద్దమొత్తంలో ఎన్నికల విరాళాలు అందిస్తూ లోబర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో తుపాకీ సంస్కృతికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదన్నది నిపుణుల మాట. అత్యధిక తుపాకులున్న టాప్–10 దేశాలు దేశం తుపాకులు (ప్రతి 100 ఇళ్లకు) అమెరికా 120.5 యెమెన్ 52.8 సెర్బియా 39.1 మాంటెనెగ్రో 39.1 ఉరుగ్వే 34.7 కెనడా 34.7 సైప్రస్ 34 ఫిన్లాండ్ 32.4 లెబనాన్ 31.9 ఐస్లాండ్ 31.7 -
చిన్నారుల చేతికి గన్స్.. గాల్లో ప్రాణాలు
న్యూయార్క్: అమెరికాలో విచ్చలవిడిగా దాదాపు చాలామంది ఇండ్లలో ఉన్న తుపాకుల కారణంగా వారి ప్రాణాలుపోతున్నాయి. ముఖ్యంగా చిన్నారుల చేతుల్లో అవి ఆటవస్తువులుగా మారి తెలిసి తెలియక వాటి ట్రిగ్గర్స్ నొక్కుతుండటంతో ఆ పిల్లలు, కుటుంబ సభ్యులు మృత్యువాత పడుతున్నారు. ఇలా తమకు తెలియకుండానే తుపాకుల బారిన పడుతున్నవారు ఒకటి నుంచి మూడేళ్లలోపు చిన్నారులే. ఒక్క ఏడాదిలోనే అభంశుభం తెలియని చిన్నారులు దాదాపు 23మంది మృత్యువాత పడ్డారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో గమనించవచ్చు. గత వారం మిల్ వాకీ అనే చిన్నబేబి కారు నడుపుతున్న తన కన్నతల్లిని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కాల్చి చంపిన విషయం తెలిసిందే. సీటు వెనుకాల నిర్లక్ష్యంగా పడేసిన తుపాకీని ఆపాప చేతుల్లోకి తీసుకొని ట్రిగ్గర్ నొక్కడం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది. ఇలాంటివి ఒక్క ఏప్రిల్ లోనే వరుసగా ఏడు ఘటనలు చోటుచేసుకున్నాయి. అవి ఏమిటంటే.. ఏప్రిల్, 20న ఇండియానాలో రెండేళ్ల బాలుడు అనుకోకుండా కిచెన్ లో ఉన్న తుపాకీని తీసుకొని తనను తాను కాల్చుకున్నాడు ఏప్రిల్ 21న కాన్సాస్ లో ఏడాది పాప తన తండ్రి తుపాకీతో ప్రమాదవవాత్తు కాల్చుకొని చనిపోయింది. ఏప్రిల్ 22న నాచితోచెస్ లో మూడేళ్ల బాలుడు ఏప్రిల్ 26న డల్లాస్ లో మూడేళ్ల బాలుడు ఏప్రిల్ 27న మిల్ వాకీలో ఓ పాప తెలియక తన తల్లిని కార్లో కాల్చింది. అదే రోజు.. మూడేళ్ల బాలుడు గ్రౌట్ టౌన్ షిప్ లో తనను కాల్చుకున్నాడు. ఇతడు బ్రతికే అవకాశం ఇంకా ఉంది. ఏప్రిల్ 29న మూడేళ్ల బాలిక ఆగస్టాలో ఓ కారులో పెట్టిన తుపాకీ తీసుకుంటుండగా దాని తూటా పాప అరచేతిలో నుంచి దూసుకెళ్లింది. ఇలా దాదాపు ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే చిన్నపిల్లల చేతుల్లోకి తుపాకులు రావడం మూలంగా దాదాపు 23 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇవి గత ఏడాది మొత్తం 18 మాత్రమే ఉన్నాయి. వీటిపై ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే మరో ఎనిమిది నెలల్లో ఎన్ని ఘటనలు జరుగుతాయో..! -
తుపాకీతో ఆట.. యువకుడి మృతి
వాషింగ్టన్: ప్రమాదకర ఓ ఆటలో భారత సంతతికి చెందిన పద్దెనిమిదేళ్ల యువకుడు మృతిచెందాడు. రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన ఆమెరికాలోని టెక్సాస్ లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. జస్కరన్ సింగ్ తలపై కాల్చానని నిందితుడు విక్రమ్ విర్క్ ఒప్పుకున్నాడని తెలిపారు. విర్క్ కారులో రష్యన్ రౌలెట్ట్ గేమ్‌లో భాగంగా విర్క్ కాల్చాడని వివరించారు. విక్రమ్ విర్క్ వద్దకు ఓ తుపాకీతో వచ్చి గేమ్ ఆడదామని సింగ్ చెప్పాడు. నిజానికి అది బుల్లెట్లు లేని తుపాకీ అని విక్రమ్ భావించాడు. దాంతో సింగ్ ప్రతిపాదించిన ఆటకు తాను సిద్ధమన్నాడు. వెంటనే రెండు సార్లు విర్క్ తలకు గురిపెట్టి రెండు రౌండ్లు కాల్చాడు. విక్రమ్ విర్క్ భావించినట్టుగానే బుల్లెట్లు బయటకు రాలేదు. ఆ తర్వాత.. నీ అవకాశం అంటూ విక్రమ్ కు తుపాకీ ఇచ్చాడు. బుల్లెట్లు లేవని ముందే భావించిన విక్రమ్ ఓ రౌండ్ కాల్చాడు. రెండో సారి కూడా ట్రిగ్గర్ నొక్కాడు. ఈ సారి బుల్లెట్ దూసుకువచ్చింది. జస్కరన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఆనూహ్య సంఘనకు ఆశ్చర్యంతో పాటు భయానకి గురైన విర్క్ తన కారులో వెంటనే జస్కరన్ను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే జస్కరిన్ మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఆసుప్రతి యాజమాన్యం విక్రమ్ కారులో ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో మొదట సింగ్ తనని తాను కాల్చుకున్నాడని చెప్పిన విర్క్, ఆ తర్వాత అసలు విషయాన్ని బయటపెట్టాడు. విర్క్ కు మరణశిక్షతో పాటు 1.5 లక్షల డాలర్ల జరిమానా విధించింది.