పాపం ఆ తండ్రికి ఎంతటి విషాదం.. | Two toddlers left in car die in Israeli desert | Sakshi
Sakshi News home page

పాపం ఆ తండ్రికి ఎంతటి విషాదం..

Published Thu, Jun 23 2016 12:34 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

పాపం ఆ తండ్రికి ఎంతటి విషాదం.. - Sakshi

పాపం ఆ తండ్రికి ఎంతటి విషాదం..

ఇజ్రాయెల్: ఇజ్రాయెల్లో ఓ తండ్రికి విషాదం మిగిలింది. పాఠాలు చెప్పే క్రమంలో తన ఇద్దరు పిల్లలను కార్లో వదిలి డోర్లు పెట్టి వెళ్లడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరికి 18 నెలలుకాగా, మరొకరికి మూడు నెలలు. ప్రస్తుతం ఇజ్రాయెల్ లోని నెగెవ్ ఎడారిలో విపరీతమైన ఎండలు ఉన్నాయి. బయటకు వెళ్లాలంటే మనుషులు గజగజ వణికిపోతున్నారు.

ఈ క్రమంలోనే ఏడారి పక్కనే ఉన్న అల్ కసోమ్ అనే చోట ఓ ఉపాధ్యాయుడు తన ఇద్దరు పిల్లలతో పాఠశాలకు వెళ్లాడు. పాఠాలు చెప్పే క్రమంలో తన ఇద్దరు పిల్లల్ని కారులో వదిలి వెళ్లాడు. పైగా అద్దాలు కూడా మూసి వెళ్లడంతో ఓ పక్క విపరీతమైన ఎండలు, మరోపక్క ఊపిరాడని కారణంగా వారిద్దరు మృత్యువాత పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement