
నిత్యం మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్.. ఎన్నో వేల బ్యాక్టీరియా, వైరస్‌లకి ఆలవాలమనే సంగతి తెలిసిందే! దాన్ని పర్‌ఫెక్ట్‌గా శానిటైజ్ చేయాలంటే.. ఇలాంటి స్టెరిలైజర్ డిసిన్ఫెక్షన్ బాక్స్ ఉండాల్సిందే. ఇందులో 3 నిమిషాలు పెట్టి.. ఆన్ బటన్ నొక్కితే చాలు. 99.99 శాతం క్రిములు నాశనం అవుతాయి.
ఫోన్ నీట్‌గా మారిపోతుంది. ఇక ఈ బాక్స్‌లో బండి తాళాలు, ఇంటి తాళాలు, మాస్కులతో పాటు.. కళ్లజోడు, బ్లూటూత్, పెన్నులు, నగలు వంటివెన్నో శుభ్రం చేసుకోవచ్చు. ఈ బాక్స్‌ని హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ముందుగానే చార్జింగ్ పెట్టుకుని, వైర్‌లెస్ మెషిన్‌లా వాడుకోవచ్చు. భలే ఉంది కదూ!
Comments
Please login to add a commentAdd a comment