Baby Bottle Feeding Cleaning And Sterilising Equipment And Uses In Telugu - Sakshi
Sakshi News home page

కనిపించని వైరస్‌లు..బుజ్జాయి పాలసీసాలను ఇలా క్లీన్‌ చేయండి

Published Mon, Jul 24 2023 2:34 PM | Last Updated on Thu, Jul 27 2023 4:44 PM

Baby Bottle Feeding Cleaning And Sterilising Equipment And Uses - Sakshi

సాధారణంగా పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగానే ఉంటాం. అందులోనూ పాలు తాగే పిల్లల విషయంలో ఈ జాగ్రత్త అవసరం. వాళ్ల కోసం వాడే పాలసీసాలు, పాల పీకలు, ఉగ్గు గిన్నెలు, స్పూన్లు వంటివన్నీ శుభ్రంగా ఉంచాలి. అయితే ఎంత శుభ్రంగా కడిగినా కనిపించని క్రిములు, వైరస్‌లు, బ్యాక్టీరియాలు చాలానే ఉంటాయి.

వాటిని పారదోలేందుకు ఉపయోగపడుతుంది ఈ బేబీ బాటిల్‌ స్టీమ్‌ స్టెరిలైజర్‌. ఇందులో సుమారుగా ఆరు చిన్న చిన్న బాటిల్స్‌తో పాటూ నిపుల్స్, ఉగ్గు గిన్నెలు వంటివి క్లీన్‌ చేసుకోవచ్చు. ఫాస్ట్‌ – ఎఫెక్టివ్‌ స్టెరిలైజేషన్‌ టెక్నాలజీతో ఆటో షట్‌ ఆఫ్‌ వంటి ఆప్షన్‌తో రూపొందిన ఈ డిౖవైస్‌.. 99.9 శాతం సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది.

క్లీన్‌ చేసిన తర్వాత సుమారు 24 గంటల పాటు మూత తియ్యకుండా ఉంచితే.. క్రిమిరహితంగా దాచిపెడుతుంది. కేవలం 8 నిమిషాల్లోనే ఈ మెషిన్‌.. బాటిల్స్‌ని క్లీన్‌ చేయగలదు. బాగుంది కదూ!. ఈ స్టీమ్‌ స్టెరిలైజర్‌ ధర 22 డాలర్లు (రూ.1,810) మాత్రమే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement