'కొంతమందిని చూస్తే ఎప్పుడూ ఏ తాళం చెవో, పెన్ను రీఫిలో, పొడవుగా చుట్టిన కాగితాన్నో, ఏవీ దొరక్కపోతే చేతివేళ్లతోనో చెవిలో సంగీతం పాడిస్తుంటారు. ఈ చికాకంతా ఎందుకని చాలామంది స్నానం చేయగానే వీలైనంత లోతుగా చెవిని శుభ్రం చేస్తుంటారు. కానీ బయటికి కనిపించే చెవి కాకుండా లోపలి వైపు శుభ్రం చేయాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు.' ఇంతకీ చెవి ఎలా శుభ్రం చేయాలో చూద్దాం...
- కాటన్ బడ్ పెట్టడం వల్ల అది ఇయర్ వాక్స్‌ని చెవి లోపలికి మరింతగా నెట్టివేస్తుంది.
- అంతేకాదు, చెవిలో పెట్టిన బడ్ కర్ణభేరికి తగలవచ్చు. ఇది మరింత ప్రమాదకారి.
- దీనివల్ల వినికిడి శక్తి దెబ్బతింటుంది.
- నిజానికి ఇయర్ వాక్స్ వల్ల చెవులకు లాభమేగానీ నష్టం లేదు.
- బయటినుంచి వేరే పదార్థాలు, క్రిముల వంటివి చెవి లోపలికి వెళ్లకుండా ఇది రక్షిస్తుంది.
- శిలీంధ్రాలు లేదా ఫంగస్ ఏర్పడకుండా నివారిస్తుంది.
- చెవిలోని నాళం పొడిబారకుండా ఉండేందుకు దోహదపడుతుంది.
మరి ఇయర్ వాక్స్‌ని ఏం చేయాలి?
దాని జోలికి వెళ్లకుండా ఉండడమే సరి. వాక్స్ తీయడం కోసం చెవి లోపల ఇయర్ బడ్ మాత్రమే కాదు. ఇంకేమీ పెట్టక్కరలేదు. ఎందుకంటే, చెవి తనను తానే శుభ్రం చేసుకోగలుగుతుంది. ఒకవేళ చెవిలో శబ్దాలు రావడం, నొప్పి లాంటి సమస్యలు కనిపించినా, వినికిడిలో తేడా అనిపించినా వెంటనే ఈఎన్‌టీ నిపుణుని కలవండి.
ఇవి చదవండి: 'పచ్చి మిరపకారా'నికి గారం చేయండి.. ఎందుకో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment