sterilisation
-
బలవంతపు ‘కుటుంబ నియంత్రణ’ బాధితులకు పరిహారం
జపాన్ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దేశంలో ‘యూజెనిక్స్ ప్రొటెక్షన్ లా’ కింద బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. శారీరక వికలాంగులు పిల్లలను కనకుండా నిరోధించడానికి ప్రభుత్వం గతంలో ఈ చట్టం చేసింది. 1950- 1970 మధ్యకాలంలో పుట్టే పిల్లల్లో శారీరక లోపాలను నివారించడానికి ఈ చట్టం చేశారు. ఈ చట్టం కింద దేశంలోని సుమారు 25 వేల మందికి వారి అనుమతి లేకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు.‘యూజెనిక్స్ ప్రొటెక్షన్ లా’ను యుద్ధానంతర కాలంలో జరిగిన అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘనగా జపాన్ న్యాయవాదులు అభివర్ణించారు. ఈ నేపధ్యంలో 1948 నాటి ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. జపాన్‌లోని ఐదు దిగువ న్యాయస్థానాల నుంచి ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. న్యాయవాదుల వాదనలు విన్న సుప్రీం కోర్టు ఈ చట్టాన్ని రద్దు చేస్తూ, ‘కుటుంబ నియంత్రణ’ బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.తీర్పు అనంతరం కోర్టు బయట బాధితులు సుప్రీకోర్టు న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. టోక్యోలోని 81 ఏళ్ల వాది సబురో కితా మీడియాతో మాట్లాడుతూ ‘ఇప్పుడు నేను నా ఆనందాన్ని వ్యక్తపరచలేకపోతున్నాను. 1957లో 14 ఏళ్ల వయసులో ఉన్నప్పడు బలవంతంగా నాకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. అనాథాశ్రమంలో ఉన్నప్పుడు ఇది జరిగింది. ఈ విషయాన్ని నా భర్య చనిపోయే ముందు ఆమెకు తెలిపాను. తన వల్లే పిల్లలు పుట్టలేదని భార్య ముందు పశ్చాత్తాప పడ్డాను’ అని తెలిపారు. కాగా జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా బాధితులకు క్షమాపణలు తెలిపారు. బాధితులకు పరిహారాన్ని అందించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
స్మార్ట్‌ఫోన్‌లో వేల కొద్ది బాక్టీరియా.. ఇలా క్లీన్ చేసుకోండి
నిత్యం మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్.. ఎన్నో వేల బ్యాక్టీరియా, వైరస్‌లకి ఆలవాలమనే సంగతి తెలిసిందే! దాన్ని పర్ఫెక్ట్గా శానిటైజ్ చేయాలంటే.. ఇలాంటి స్టెరిలైజర్ డిసిన్ఫెక్షన్ బాక్స్ ఉండాల్సిందే. ఇందులో 3 నిమిషాలు పెట్టి.. ఆన్ బటన్ నొక్కితే చాలు. 99.99 శాతం క్రిములు నాశనం అవుతాయి. ఫోన్ నీట్‌గా మారిపోతుంది. ఇక ఈ బాక్స్‌లో బండి తాళాలు, ఇంటి తాళాలు, మాస్కులతో పాటు.. కళ్లజోడు, బ్లూటూత్, పెన్నులు, నగలు వంటివెన్నో శుభ్రం చేసుకోవచ్చు. ఈ బాక్స్‌ని హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ముందుగానే చార్జింగ్ పెట్టుకుని, వైర్లెస్ మెషిన్లా వాడుకోవచ్చు. భలే ఉంది కదూ! -
పిల్లలకు పాలు పడుతున్నారా? కనిపించని బ్యాక్టీరియాలు..
సాధారణంగా పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగానే ఉంటాం. అందులోనూ పాలు తాగే పిల్లల విషయంలో ఈ జాగ్రత్త అవసరం. వాళ్ల కోసం వాడే పాలసీసాలు, పాల పీకలు, ఉగ్గు గిన్నెలు, స్పూన్లు వంటివన్నీ శుభ్రంగా ఉంచాలి. అయితే ఎంత శుభ్రంగా కడిగినా కనిపించని క్రిములు, వైరస్లు, బ్యాక్టీరియాలు చాలానే ఉంటాయి. వాటిని పారదోలేందుకు ఉపయోగపడుతుంది ఈ బేబీ బాటిల్ స్టీమ్ స్టెరిలైజర్. ఇందులో సుమారుగా ఆరు చిన్న చిన్న బాటిల్స్‌తో పాటూ నిపుల్స్, ఉగ్గు గిన్నెలు వంటివి క్లీన్ చేసుకోవచ్చు. ఫాస్ట్ – ఎఫెక్టివ్ స్టెరిలైజేషన్ టెక్నాలజీతో ఆటో షట్ ఆఫ్ వంటి ఆప్షన్‌తో రూపొందిన ఈ డిౖవైస్.. 99.9 శాతం సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది. క్లీన్ చేసిన తర్వాత సుమారు 24 గంటల పాటు మూత తియ్యకుండా ఉంచితే.. క్రిమిరహితంగా దాచిపెడుతుంది. కేవలం 8 నిమిషాల్లోనే ఈ మెషిన్.. బాటిల్స్‌ని క్లీన్ చేయగలదు. బాగుంది కదూ!. ఈ స్టీమ్ స్టెరిలైజర్ ధర 22 డాలర్లు (రూ.1,810) మాత్రమే. -
కూరగాయలపై కరోనాను ఖతం చేసే టెక్నిక్!
న్యూఢిల్లీ: ప్రెషర్ కుక్కర్‌ను ఉపయోగించి కూరగాయలను స్టెరిలైజేషన్ చేయొచ్చా? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఈ స్టోరీ చదివేయండి.. సాధారణంగా కుక్కర్లను పప్పులు ఉడికించడానికి వాడతాం. కానీ ఓ వ్యక్తి మాత్రం అంతకు మించి వాడుకున్నాడు. కుక్కర్ పైన ఉండే విజిల్‌కు ఓ పైపు తొడిగించాడు. మరో చివరను కూరగాయల దగ్గర పెట్టాడు. సహజ పద్ధతిలో అక్కడున్న ఉల్లి ఆకులు, టమాటలు, కాకరకాయలు తదితర కూరగాయలకు ఆవిరి తగిలించాడు. తద్వారా వాటిపై ఏవైనా సూక్ష్మిక్రిములు కానీ, కరోనా వంటి వైరస్ కణాలు ఉన్నా నశించిపోతాయని ఆయన అంటున్నాడు. (చావు కబురు చల్లగా చెప్పాడు..) ఈ వీడియోను ఐఏఎస్ అధికారిణి సుప్రియ సాహు ట్విటర్లో షేర్ చేశారు. ఇంత వెరైటీగా కూరగాయలను శుభ్రం చేసే పద్ధతిని చూసి ఆమె మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది అతడిని పొగిడేస్తుంటే మరికొందరు మాత్రం ఇది ప్రమాదకరమైన పద్ధతని వారిస్తున్నారు. అంతగా శుభ్రం చేయాలనుకుంటే సబ్బునీళ్లలో వేసి కడిగితే సరిపోతుందని సూచిస్తున్నారు. ప్లాస్టిక్ పైపు ద్వారా ఆవిరి పట్టడం అస్సలు మంచిది కాదని, దానివల్ల ఆ కూరగాయలు తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఓ నెటిజన్ హెచ్చరించాడు. (ఈ బుడ్డోడికి ఎంత ధైర్యమో!) -
ఎంజీ మోటార్స్ కార్లలో కరోనా నియంత్రణ సాంకేతికత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్ల తయారీ కంపెనీ ఎంజీ మోటార్స్ తన కార్లలోని క్యాబిన్ ఎయిర్, ఉపరితల భాగాలను కరోనా నియంత్రణ కట్టడికి నేచురల్ స్టెరిలైజేషన్ టెక్నాలజీని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు క్యాబిన్ స్టెరిలైజేషన్ టెక్నాలజీ పేటెండ్ పొందిన సింగపూర్‌కు చెందిన మెడ్‌క్లిన్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. హెక్టార్, జెడ్ఎస్ ఈవీ కార్లలో ఏర్పాటుకు పరిశోధనలు జరుగుతున్నాయని కంపెనీ ఇండియా ఎండీ అండ్ ప్రెసిడెంట్ రాజీవ్ చాబా ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కస్టమర్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా కార్ల ఉపరితల భాగాలను వైరస్ నియంత్రణ చర్యలు తీసుకోవటం అత్యవసరమన్నారు. -
రెండువేలు ఇచ్చి.. ఆ ‘ఆపరేషన్’ చేశారు!
అలీగఢ్: పెద్దనోట్ల రద్దు ప్రభావంతో డబ్బులేక తీవ్ర ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తి కేవలం రూ. రెండువేల కోసం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాడు. ‘నాకు ఉద్యోగం లేదు. డబ్బు అవసరం చాలా ఉంది. పురుషులు కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే రూ. 2000 ఇస్తున్నారని విన్నాను. అందుకే నేను కూడా ఆ ఆపరేషన్ చేయించుకున్నాను’ అని ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన పురాణ్శర్మ తెలిపారు. అయితే, డబ్బులు ఇచ్చి బలవంతంగా పురుషులకు కు.ని. ఆపరేషన్లు చేయిస్తున్నారంటూ వివాదం చెలరేగడంతో దీనిపై అలీగఢ్ ముఖ్య వైద్యాధికారి స్పందించారు. కుటుంబనియంత్రణ ఆపరేషన్ కోసం భార్యను తీసుకొని పురాణ్ శర్మ వచ్చాడని, అయితే, ఆయన భార్య ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆమెకు ఆపరేషన్ చేయడం కుదరలేదని, కాబట్టి ప్రభుత్వ ఫ్యామిలీ ప్లానింగ్ పథకంలో భాగంగా పురాణ్ శర్మను ఒప్పించి ఆపరేషన్ చేశామని తెలిపారు. -
అక్కడ మొత్తం 83 ఆపరేషన్లూ ఫెయిలే!!
-
అక్కడ మొత్తం 83 ఆపరేషన్లూ ఫెయిలే!!
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్లో నిర్వహించిన కుటుంబ నియంత్రణ శిబిరంలో చేసిన మొత్తం 83 ఆపరేషన్లు ఫెయిలయ్యాయి. వాళ్లలో 11 మంది మహిళలు మరణించగా, మిగిలినవాళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ విషయం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నేరుగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు ఫోన్ చేశారు. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి నలుగురు వైద్యులతో కూడిన బృందాన్ని హుటాహుటిన బిలాస్పూర్ పంపారు. కుటుంబ నియంత్రణ శిబిరంలో సంభవించిన మరణాలపై ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని భావిస్తున్నారు. సెప్టిక్ షాక్ వల్లనే ఈ మరణాలు సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ అమర్‌సింగ్ ఠాకూర్ తెలిపారు. అయితే, శస్త్రచికిత్స పరికరాలు ఇన్ఫెక్ట్ కావడం వల్లే ఇలా జరిగిందన్నారు. తమకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు లక్ష్యాలు ఇస్తున్నారని, వాటిని చేరుకోడానికే తొందరగా ఆపరేషన్లు చేయాల్సి వస్తోందని సస్పెండైన నలుగురిలో ఒకరైన డాక్టర్ ఆర్కే భంగే చెప్పారు. రోజుకు ఒక బృందం 40 ఆపరేషన్లు చేయాలి. ఈ లక్ష్యాల వల్లే ఇలా జరుగుతోందని వాపోయారు. ఆపరేషన్లు విఫలమై మరణించిన వాళ్ల కుటుంబాలకు ఇంతకుముందు ప్రకటించిన రూ. 2లక్షల పరిహారాన్ని సీఎం రమణ్ సింగ్ 4 లక్షలకు పెంచారు. ఈ దుర్ఘటన సాక్షాత్తు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అమర్ అగర్వాల్ నియోజకవర్గం పరిధిలోనే జరగడంతో ఆయన రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.