
న్యూఢిల్లీ: ప్రెషర్ కుక్కర్‌ను ఉపయోగించి కూరగాయలను స్టెరిలైజేషన్ చేయొచ్చా? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఈ స్టోరీ చదివేయండి.. సాధారణంగా కుక్కర్లను పప్పులు ఉడికించడానికి వాడతాం. కానీ ఓ వ్యక్తి మాత్రం అంతకు మించి వాడుకున్నాడు. కుక్కర్ పైన ఉండే విజిల్‌కు ఓ పైపు తొడిగించాడు. మరో చివరను కూరగాయల దగ్గర పెట్టాడు. సహజ పద్ధతిలో అక్కడున్న ఉల్లి ఆకులు, టమాటలు, కాకరకాయలు తదితర కూరగాయలకు ఆవిరి తగిలించాడు. తద్వారా వాటిపై ఏవైనా సూక్ష్మిక్రిములు కానీ, కరోనా వంటి వైరస్ కణాలు ఉన్నా నశించిపోతాయని ఆయన అంటున్నాడు. (చావు కబురు చల్లగా చెప్పాడు..)
ఈ వీడియోను ఐఏఎస్ అధికారిణి సుప్రియ సాహు ట్విటర్‌లో షేర్ చేశారు. ఇంత వెరైటీగా కూరగాయలను శుభ్రం చేసే పద్ధతిని చూసి ఆమె మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది అతడిని పొగిడేస్తుంటే మరికొందరు మాత్రం ఇది ప్రమాదకరమైన పద్ధతని వారిస్తున్నారు. అంతగా శుభ్రం చేయాలనుకుంటే సబ్బునీళ్లలో వేసి కడిగితే సరిపోతుందని సూచిస్తున్నారు. ప్లాస్టిక్ పైపు ద్వారా ఆవిరి పట్టడం అస్సలు మంచిది కాదని, దానివల్ల ఆ కూరగాయలు తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఓ నెటిజన్ హెచ్చరించాడు. (ఈ బుడ్డోడికి ఎంత ధైర్యమో!)
Comments
Please login to add a commentAdd a comment