ఫోటో అదుర్స్‌! దెబ్బకు కస్టమర్‌ బేరం ఆడకుండా కొనాల్సిందే! | Photo Of Woman At Bengaluru Vegetable Market Goes Viral | Sakshi
Sakshi News home page

ఫోటో అదుర్స్‌! దెబ్బకు కస్టమర్‌ బేరం ఆడకుండా కొనాల్సిందే!

Published Sun, May 19 2024 10:36 AM | Last Updated on Sun, May 19 2024 10:36 AM

Photo Of Woman At Bengaluru Vegetable Market Goes Viral

బెంగళూరు కూరగాయల మార్కెట్‌లోని ఒక ఫొటో ట్రెండ్‌గా మారింది. చాలా షాప్‌లలో ఆ ఫొటోను గోడలకు వేలాడదీస్తున్నారు. లెక్క ప్రకారం అయితే షాప్‌లలో అభిమాన తారల పోస్టర్లు కనిపిస్తాయి. బెంగళూరు కూరగాయల మార్కెట్‌లోని టొమాటో స్టాల్‌లో వేలాడదీసిన పెద్ద ఫొటోలో ఒక మహిళ గుడ్లురుముతూ కోపంగా చూస్తుంటుంది. 

ఏ కారణం వల్ల ఇట్టి టెర్రిఫిక్‌ ఫొటోను వేలాడదీశారు అనే గండికోట రహస్యం గురించి తెలియకపోయినా ఈ వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘ఊహించుకున్నవారికి ఊహించుకున్నంత మహదేవా’ అన్నట్లుగా ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ఈ ఫొటోకు భాష్యం చెబుతున్నారు. ‘బేరం అడుతున్నావా! అదేం కుదరదు. చచ్చినట్లు కొనాల్సిందే... అని కస్టమర్‌ని బెదిరిస్తున్నట్లుగా ఉంది’ అని ఒక యూజర్‌ కామెంట్‌ పెట్టాడు. 

 

(చదవండి: కరెంట్‌తో పనిలేకుండానే వాటర్‌ని కూల్‌ చేసుకునే సిపుల్‌ టెక్నిక్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement