ఖరీదైన సౌకర్యాలు సమకూర్చుకునేంత సంవద పేదల దగ్గర లేకపోవచ్చు. అయితే ప్రత్యామ్నాయ ఐడియాలకు మాత్రం కొదవ లేదు అని చెప్పే వీడియో ఇది. ఒక మూరుమూల గ్రామంలో ఒక పేదింటి మహిళ ‘ఫ్రిడ్జ్ అవసరం లేకుండా వాటర్‌ను సింపుల్‌గా ఇలా కూల్ చేసుకోవచ్చు’ అంటూ ఒక వాటర్‌బాటిల్‌లో నీళ్లుపోసి దానికి తడి వస్త్రం చుట్టి చెట్టుకొమ్మలకు వేలాడదీసింది.
పావు గంటలో ఆ నీళ్లు చల్లబడ్డాయి. ‘తడి వస్త్రం బాటిల్ లోపల ఉన్న వేడిని బయటికి లాగుతుంది. మా ఊళ్లో అందరం ఇలాగే చేస్తాం’ అంటుంది ఆ యువతి. నిజానికి గతంలోకి వెదుక్కుంటూ వెళితే, ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఇలాంటి సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఆర్గానిక్ ట్రిక్స్ ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ఐడియాలన్నీ పర్యావరణానికి హాని కలిగించనివే. పాపులర్ కంటెంట్ క్రియేటర్ దివ్య సిన్హా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది.
(చదవండి: కేన్స్‌లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!)
Comments
Please login to add a commentAdd a comment