
కోతి షాపులో హాయిగా కూర్చొని కూరగాయాలు అమ్మేస్తోంది. పైగా ఓ పక్క నుంచి చక్కగా లాగించేస్తోంది కూడా.
In This Video Monkey Sitting At A Vegetable Shop: ఇంతవరకు మనం జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు చూశాం. మనుషులను కాపాడిన వీడియోలు, దాడి చేసిన వీడియోలు చూశాం. జంతువులు మనుషులును అనుకరిస్తాయని అందరికీ తెలుసు. కానీ మనుషలు మాదిరిగా వ్యాపారం చేసే జంతువులు గురించి విన్నారా!.
విషయంలోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని ఒక కూరగాయాల దుకాణంలోకి కోతి చొరబడింది. కూరగాయలమ్ముకునే వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోగానే ఆ కోతి అతని స్థానంలోకి వచ్చి కుర్చొంది. దుకాణదారుడి మాదిరిగా కూరగాయాలు అమ్ముతున్నట్లుగా నటిస్తూనే కూరగాయలను తినేసింది. ఈ దృశ్యాన్ని చూస్తే ఎవరైన సరే కోతి కూరగాయాల దుకాణం నడుపుతుందని అనుకుంటారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది. కాగా మా దగ్గర విపరీతమైన కోతుల బెడద ఉందని.. అవి ఇలా దుకాణంలోకి చొరబడి వస్తువులను పాడుచేయడం లేదా ఎత్తుకుపోవడం చేస్తుంటాయని స్థానికులు పేర్కొన్నారు.
(చదవండి: ఔను! ఆ పబ్‌లో దెయ్యాలు ఉన్నాయి ! డెవిల్ వైరల్ వీడియో)