
Pressure Cooker Coffee: A Man Makes Coffee in Cooker Video Goes Viral: పనిలో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి టీ, కాఫీలు తాగుతాం! అయితే ఒకే రకం కాఫీ కాకుండా కొత్తగా ట్రై చేస్తాం. కొంతమంది కాఫీ ప్రియులైతే.. ఎక్కడ మంచి కాఫీ దొరుకుతుందా? అని కనుక్కొని మరీ తాగుతారు. ఘుమఘుమలాడే మంచి కాఫీని అందిస్తున్న ఓ ఓల్డ్ మ్యాన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ఆయన కాఫీకి సంబంధించిన వీడియోను ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేశాడు.
అతడు కాఫీ చేస్తున్న విధానం అందరినీ అక్కట్టుకుంటోంది. అమోఘమైన రుచిని కూడా ఇస్తోంది. వీధుల్లో తిరుగుతూ చాలా కొత్తగా ప్రెషర్ కుక్కర్ ఆవిరితో.. రుచికరమైన కాఫీ చేసి అమ్ముతున్నాడు. ప్రెషర్ కుక్కర్‌తో ఎలా చేస్తున్నారని ఆశ్చర్యంగా ఉందా! సైకిల్ మీద ప్రెషర్ కుక్కర్ ఏర్పాటు చేసుక్కని.. ఒక గిన్నెలో కాఫీ పౌడర్, పాలు కలిపి ప్రెషర్ కుక్కర్ అవిరితో వేడిచేసి ఇన్‌స్టాంట్‌గా వేడివేడి కాఫీ ఇస్తున్నాడు.
ఇలా ప్రెషర్ కుక్కర్ సాయంతో స్టీమ్ చేయటం వల్ల కాఫీ మరింత రుచిగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఐతే ప్రెషర్ కుక్కర్‌లో నీళ్లు నింపి.. దానికి ఓ పైపు అమర్చాడు. ఆ పైపు గుండా వచ్చే ఆవిరితో కాఫీని మరిగించి ఇవ్వడంతో ఓల్డ్ మ్యాన్ కాపీ వైరల్‌గా మారింది. అయితే చిక్కటి రుచికరమైన కాఫీని వీధుల్లో తిరిగి మరీ అమ్మడంతో స్థానికులు ఉత్సాహంగా తాగుతున్నారు. ఈ కాఫీ విక్రేత గ్వాలియర్ చెందిన వ్యాక్తిగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment