వీడియో చూస్తే మీరూ ఆశ్చర్యపోవాల్సిందే! | Viral Video Chef Made Cake Like Real Objects | Sakshi
Sakshi News home page

వైరల్‌: అచ్చంగా వాటిలాగానే కేకులు!

Published Mon, Jul 13 2020 2:25 PM | Last Updated on Sat, Oct 3 2020 8:47 PM

Viral Video Chef Made Cake Like Real Objects - Sakshi

ఈ రోజుల్లో ప్రతి చిన్న వేడుకను కేక్‌తో సెలబ్రేట్‌ చేసుకోవడం సాధారణమైంది. అయితే, ఎప్పుడూ ఒకే తరహా కేకులతో విసిగిపోయిన అమెరికాకు చెందిన ప్ర‌ముఖ చెఫ్ న‌టాలీ సైడ్‌స‌ర్ఫ్ సరికొత్తగా ఆలోచించారు. చాలా వెరైటీగా కేకులు తయారు చేసి అబ్బురపరిచారు. వెరైటీ అంటే మ‌రీ షాక్ అయ్యే విధంగా చేసేశారు. వంకాయ‌, ఉల్లిగ‌డ్డ‌, నిమ్మ‌కాయ, ఇలా అన్ని రకాల పళ్ల ఆకారాలతో కేకులు త‌యారు చేసి ఆకట్టుకున్నారు. ఇక ఈ వెరైటీ కేకుల వీడియో అంద‌రినీ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకోవడంతో వైరల్‌ అయింది. అచ్చం నిజమైనా కూరగాయాల్లా ఉన్న కేకులను చూస్తే మీరూ ఆశ్చ‌ర్యపోవాల్సిందే! 'నేను అక్షరాలా జీవించడానికి కేకులను తయారుచేస్తాను, కాబట్టి ఇది నిజంగా నాతో మాట్లాడుతుంది' అనే కాప్షన్‌తో నటాలీ ఈ వీడియో షేర్ చేశారు. నోరూరించే కేకుల వీడియోపై నెటిజన్ల కామెంట్ల వర్షం కురుస్తోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement