సాధారణంగా సీలింగ్ ఫ్యాన్‌లను ఎక్కువ ఎత్తులో అమర్చుతారు. అందువల్ల వాటిని తరచు శుభ్రం చేయడం చాలా కష్టం. అలాగని నెలల తరబడి అలాగే ఉంచేస్తే మురికి పేరుకుని పోయి అసహ్యంగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో పాత పిల్లో కవర్ తీసుకుని టేబుల్ మీద ఎక్కి సీలింగ్ ఫ్యాన్ రెక్కలను కవర్ చేయాలి. కవర్ పైభాగం నుంచి మీ చేతులతో రుద్దాలి. అదేవిధంగా, మూడు రెక్కలను శుభ్రం చేయాలి. మట్టి కూడా కవర్‌లో పడిపోతుంది. ఇది మీ ఇంటిని కూడా మురికిగా చేయదు.
మరో పద్ధతి...
పాత షర్ట్, టీషర్ట్ లేదా ఏదైనా కాటన్ వస్త్రం సహాయంతో ఫ్యాన్‌ను శుభ్రం చేయవచ్చు. ఫ్యాన్ మీద ΄÷డి దుమ్ము ఉంటే.. అది సులభంగా ఒక వస్త్రంతో శుభ్రం చేసుకోవచ్చు. ఒకవేళ వంటగదిలో ఉండే ఫ్యాన్‌ను క్లీన్ చేస్తున్నట్లయితే.. దానిపై నూనె, ధూళి పేరుకుపోయి ఉంటుంది. అటువంటి వాటిని సబ్బుతో కడగడం మంచిది. కాసేపు రెక్కలను స్క్రబ్ చేయాలి.
గుర్తుంచుకోవాల్సింది..
ఫ్యాన్‌ను క్లీన్ చేసినప్పుడల్లా కింద ఒక షీట్ లేదా వస్త్రాన్ని పరచాలి. దీంతో ఫ్యాన్ క్లీన్ అయిన తర్వాత మీకు పని పెరగదు. ఫ్యాన్ మురికి షీట్లో పడిపోతుంది.
ఫ్యాన్ శుభ్రం చేసేటప్పుడు గ్లాసెస్ లేదా సన్‌గ్లాసెస్ ధరించండి. ఇది చెత్తను కంట్లో పడకుండా చేస్తుంది. దీంతో అలర్జీ కూడా రాదు. సీలింగ్ ఫ్యాన్ శభ్రం చేసేటపుడు ముక్కుకు మాస్క్ లేదా రుమాలు కట్టుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment